వెనుకటి వెండితెర-5

-ఇంద్రగంటి జానకీబాల

అక్కినేని నాగేశ్వరరావు గారు నటుడిగా బాగా స్థిరపడి, ప్రేక్షకుల్లో అబిమానం సంపాదించి, అతను కనిపిస్తే సినిమా కోసం జనం ఉషారుగా పరుగులు పెట్టే స్థితికి చేరుకున్నాక, చిత్ర నిరామణంలోకి అడుగుపెట్టారు. 1944 లో సినీ రంగప్రవేశం చేసిన యన సుమారు పదేళ్ళు నటులుగానే కొనసాగారు. అప్పట్లో మంచి అభిరుచి, సినిమాపట్ల గొప్ప ఆరాధన, ఆదర్శం ర్పరచుకున్నారు. సినిమా అంటే దాని కొక అర్థం, సార్థకత వుండాలి. సమాజాన్ని ప్రతిఫలించేదిగా వుండాలని భావించి నిర్మాణంలోకి అడుగుపెట్టారనిపిస్తుంది.

నాగేశ్వరరావుగారికి వరుసకి మేనమామగారైన దుక్కిపాటి మధుసూదన రావుగారితో కలిసి అన్నపూర్ణా పిక్చర్స్ స్థాపించి సినిమా నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అప్పటికే ప్రసిద్ధులు, ప్రతిభావంతులూ అయిన కె.వి. రెడ్డి గారిని దర్శకునిగా ఎంపిక చేసుకుని దొంగరాముడు సినిమా తీశారు.

ఈ ‘దొంగరాముడు’ లో నాగేశ్వరరావుతో బాటుగా, సావిత్రి, జమున, జగ్గయ్య మొదలైన వారు నటించారు, దీనికి పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం సమకూర్చారు.

పరిస్థితులు ప్రభావంతో, పేదరికంలో చిన్న దొంగతనం చేసిన పదేళ్ళ కుర్రాడు రాముడు జైలుపాలవుతాడు. జబ్బుతో వున్న తల్లి మరనిస్తే, అతని చెల్లెలు ఒక అనాథ ఆశ్రమంలో పెరుగుతుంది. జైలు నుంచి విడుదలై వచ్చిన కథానాయికుడు (రాముడు) సావిత్రితో స్నేహంకడతాడు.

‘దొంగ’ అనే ముద్రనుంచి తప్పించుకుని, మామూల మంచి, గౌరవ ప్రదమైన వ్యక్తిగా నిలతొక్కుకోవడమే కథ. నిజాయితీగా, మంచి వాడిగా వున్నరాముడు తనని తను నిరూపించుకుంటాడు. చెల్లెల్ని జమిందారుగారి కొడుకు వివామం చేసుకుంటాడు.

కథ మలుపులతో, సావిత్రీ, నాగేశ్వర్రావు ఆర్ నాగేశ్వర్రావు (విలన్) నటలతో, దర్శకత్వపు బిగింపుతో – అందమైన పాటలతో ఈ ’దొంగ రాముడు‘ అన్నపూర్ణా వారి మొదటి చిత్రం ఆంధ్రులను అలరించింది.

‘తెలిసిందా బాబూ! నీకు తెలిసిందా’

‘భలే తాత మన బాపూజీ – బాలల తాతా బాపూజీ’

‘అనురాగము విరిసేనా’

‘చిగురాకులలో చిలకమ్మా’

‘రారోయి మా యింటికీ – లాంటి పాటలతో పెండ్యాల నాగేశ్వరరావు గారు తన ప్రతిభను చాటుకున్నారు. ఇందులో ప్రధాన నాయికకి జిక్కి (పి.జి. కృష్ణవేణి) పనాయికకు పి. సుశీల – హీరోగారికి ఘంటసాల వెంకటేశ్వరరావు ప్లేబ్యాక్ పాడారు.

‘దొంగరాముడు’

1955 రిలీజై వచ్చని ‘దొంగరాముడు’ అందర్నీ ఎంతో మెప్పించింది. దీనికి రచన చేసిన వారు డి.వి. నరసరాజు గారు.

కథలో నాటకీయత వున్నప్పటికీ, సహజధోరణిలో కథనం సాగి ఆసక్తి కలిగిస్తూ ముందుకు సాగుతుంది సనిమా.

ఈ దొంగరాముడు’ మంచి విజయం సాధించి, అక్కినేనిగారికి సావిత్రికి, జమునకి, ఇంకా మిగిలిన నటులందరికీ మంచి గుర్తింపు తీసుకొచ్చింది. మనకున్న కొద్దిపాటి మంచి తెలుగు సినిమాల్లో దొంగరాముడు ఒకటి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.