Please follow and like us:
గవిడి శ్రీనివాస్ ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం నుండి ఎం.సి.ఏ.పూర్తి చేశారు. సెయింట్ ఆన్స్ స్కూల్ లో గణిత ఉపాధ్యాయునిగా చేశారు. నోర్డ్ సిన్యూ, సిఎంబియోసిస్ టెక్నాలజీస్, సొనాటా (డెల్) వంటి సాఫ్ట్ వేర్ కంపెనీస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. కన్నీళ్లు సాక్ష్యం, వలస పాట ప్రచురితమైన కవితా సంపుటులు. 2016లో సాహితీ సమాఖ్య నుండి కవితాసృజన పురస్కారాన్ని, 2017లో పాలపిట్ట మాస పత్రిక నుండి గొట్టిపర్తి లక్ష్మి నరసింహారావు పురస్కారాన్ని అందుకున్నారు.
చాలా బాగుంది కవిత…
కలలు పూసేవరకు
అడుగుల పరుగులు సాగాలి…
ఎన్ని దుఖాలు ముసురుతున్నా…..
కృత్రిమ పరిమళాలమధ్య నలుగుతున్న బంధాలు …ఎంత కవితాత్మకంగా ఉందో మీ కవిత. ఆత్మను తడిమే అక్షరాలు మీవనిపించింది. వస్తువులతో ,యంత్రాలతో మెలగుతూ ప్రేమాప్యాయతలకు దూరం కావడం, ప్రతి బంధాన్ని ఆర్థికంతో ముడిపెట్టడం, స్వార్థం తో విడివడే స్నేహాలు, కఠోర శ్రమతో లక్ష్యం వైపు నడిచే అడుగులు…వాఁహ్ మీ కవిత👏👏👏🙏🙏🙏