సర్కస్

-కందేపి రాణి ప్రసాద్

అనగనగా ఒక అడవిలో జంతువులన్నీ కలిసిమెలసి ఆనందంగా జీవించేవి. ఒకదానికొకటి సహకరించుకుంటూ పోట్లాటలు లేకుండా చక్కగా ఉండేవి. ఎప్పుడైనా ఏదైనా కష్టం ఎదురైతే అన్నీ కలసి కూర్చుని ఆ విషయాన్ని చర్చించుకొని పరిష్కారాన్ని వెతుక్కునేవి. పగలంతా ఆహార అన్వేషణలో సమయం దొరక్కపోయిన రాత్రిపూట అన్నీ కలసి ఒక్కచోట చెరీ కబుర్లు చెప్పుకునేవి. ఆ రోజు వాటికి ఎదురైన అనుభవాల్ని అవి పక్కవాళ్లతో పంచుకునేవి. ఆ అడవికి అనుకోని ఒక ఊరు ఉండేది. కోడి, కుక్క, కోతి వంటి జంవుతులు, కాకులు, పిచ్చుకలు వంటి పక్షులు ఆ ఊరి విశేషాలు అందరికీ చెబుతూ ఉండేవి. అడవి దాటని మిగతా జంతువులు చాలా ఉత్సుకతతో వినేని.
ఒకరోజు ఆ ఊర్లో ఉన్న ఒక సినిమా థియేటర్ గురించి అవి ఎంతో గొప్పగా చెప్పాయి. మిగతా జంతువులన్నీ చాలా ఆసక్తి వింటున్నాయి. కుందేలు, తాబేలు, కప్ప, ఉడుత, మొదలైన జంతువులు మరియు కోయిల, పావురం వంటి పక్షులు కొన్ని అంతకు ముందే ఊళ్ళనూ, మనుష్యులనూ చూసి ఉండడం వల్ల ఎక్కువగా ఆశ్చర్యపడకపోయిన, పులి, సింహం, ఎలుగుబంటి వంటి ఊరి ముఖం ఎప్పుడూ చూడని జంతువులు మాత్రం ఎంతో ఆసక్తిని కనబరిచాయి. సినిమా అంటే ఏమిటి? ఎలా ఉంటుంది? అని అడిగిన ప్రశ్ననే అడిగి వాటిని విసిగిస్తున్నాయి. చివరకు అన్నీ కలసి ఆ ఊరికెళ్లి సినిమా చూసి రావాలని నిర్ణయించుకున్నాయి. అందుకుగాను ఓ వెన్నెల రాత్రిని ఎంచుకున్నాయి. ఆ రోజు కోసం ఎదురుచూడసాగాయి.
చివరకు ఆ వెన్నెల రాత్రి రానే వచ్చింది. జంతువులన్నీ సరదాగా సినిమాకు బయల్దేరాయి. దారిలో చెట్లకున్న పండ్లుకోసుకొని తమతో తీసుకెళ్ళాయి ఇంటెర్వెల్ లో తినటానికి. థియేటర్లో సీట్లు ఎంత మెత్తగా ఉన్నాయో అనుకున్నాయి. ఇవి అచ్చం మన గడ్డిపరుపుల్లా ఉన్నాయే అనుకుంటూ ఎగిరెగిరి కూర్చుంటూ సరదాపడ్డాయి. తమతో తెచ్చుకున్న పండ్లను కోరుక్కుతింటూ సినిమాలోని ఫైటింగ్ సీన్లను బాగా ఎంజాయ్ చేశాయి. సినిమా నుంచి ఇంటికి తిరిగి వాస్తు మనుష్యుల గొప్పదనాన్ని మెచ్చుకున్నాయి. ‘ఇలా సినిమాలు అందంగా ఎలా తీస్తారో? ఏమైనా మానవులు చాలా గొప్పవాళ్ళు’ అని పొగుడుతూ ఇంటికి చేరాయి. ఇలా ఆ జంహువులన్నీ అప్పుడప్పుడు ఆ ఊరికెళ్లి సినిమాలు చూడటం అలవాటు చేసుకున్నాయి. అలా సినిమాలు చూసి వచ్చిన తరువాత అవి తన పనులు చాలా హుషారుగా పనిచేసుకుంటున్నాయి.
ఇలా ఉండగా ఒకరోజు కోతి ఆ ఉర్నుంచి ఒక వార్తా మోసుకొచ్చింది. ఆ ఊర్లోకి సర్కస్ వచ్చిందని చెప్పింది. ‘సర్కస్ అంటే ఏమిటి? అది కూడా సినిమాలనే ఉంటుందా’ ఆశగా ముందుకొచ్చి అడిగింది గబ్బిలం. ఎప్పుడు మానవ సంచారమే చూడని గబ్బిలానికి సినిమాలు చూడటం బాగా నచ్చింది. అందుకే ఇది కూడా కొత్తరకం సినిమా అనుకున్నది. కానీ కోతి చెప్పుకొచ్చిన విశేషాలన్నీ విని జంతువులన్నీ ఆలోచనలో పడ్డాయి. ఆ సర్కస్ లో తమలాంటి జంతువుల చేత నానా రకాల ఫీట్లు చేయిస్తూ వాళ్ళు గబ్బులు సంపాదించుకుంటున్నారట. అది కాదు విషయం ఇన్ని పనులు చేయించుకుంటూ సరియైన ఆహారాన్ని కూడా ఇవ్వటం లేదట. ఈ విషయం తెలిసినప్పట్నుంచి అవి యధావిధిగా తమ పనులు చేసుకోలేకపోతున్నాయి. ఆహారం తీసుకుంటున్నా, నీళ్ళు తాగుతున్నా మొదళ్ళు మాత్రం చురుగ్గా పనిచేస్తూనే ఉన్నాయి. బొనుల్లో ఆహారం లేక చిక్కిశల్యమైపోతూ, తమ స్వేచ్చా జీవితాన్ని కోల్పోయి, భార్యా బిడ్డలకు దూరమై అవి ఎంత బాధపడుతున్నాయో తలచుకుంటేనే మనసు కుతకుత ఉడికిపోతోంది. యువ జంతువులైతే ఆవేశంతో ముందుకు దూకి ‘మానవులంటే మంచివాళ్ళనుకున్నాం గాని ఇంతటి క్రూరులనుకోలేదు’ అంటూ తమ కోపాన్ని వెళ్ళగక్కాయి. ముసలి జంతువుల ‘ఆవేశపడవద్దు! ఆలోచించండి ఏదైనా మార్గం. కోపం సమస్యకు పరిష్కారం కాదు’ అంటూ హితబోధ చేశాయి.
జంతువులన్నీ ఒకచోట సమావేశమై చర్చించుకున్నాయి. చివరకు అన్నీ కలసి ఒక నిర్ణయానికొచ్చాయి. ఓ రాత్రివేళ అన్నీ కలసి ఆ సర్కస్ కంపెనీ మీద మూకుమ్మడిగా దాడిచేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఆ దాడి కొరకు రాబోయే అమావాస్యను ఎన్నుకున్నాయి.
అనుకున్న సమయానికి జంతువులన్నీ కలిసి ఆ సర్కస్ కంపెనీ మీద దాడిచేశాయి. చీకటి కావటం వలన అక్కడున్న మనుష్యులకు ఏం జరుగుతుందో కనిపించలేదు. ఒకవేళ కనిపించిన పులి, సింహం, ఏనుగు, ఎలుగుబంటి వంటి పెద్ద జంతువుల్ని చూశాక మానవుడు ఎదిరించే ధైర్యం చేస్తాడా! జంతువులు తమ సహచరుల్ని విడిపించుకొని ఆనందంగా అడవి వైపు పయనమయ్యాయి.

      *****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.