పడవలసిన వేటు (కవిత)
పడవలసిన వేటు -శ్రీనివాస్ బందా తెగిపడిన నాలిక చివరగా ఏమన్నదో పెరకబడిన కనుగుడ్డు ఏ దౌష్ట్యాన్ని చూసి మూసుకుందో లేతమొగ్గ ఎంత రక్తాన్ని రోదించిందో అప్పుడే తెరుచుకుంటున్న గొంతు ఎంత ఘోరంగా బీటలువారిందో చచ్చిందో బతికిందో అనుకునేవాళ్లు పొలంలోకెందుకు విసిరేస్తారు చిదిమేటప్పుడు చలించనివాళ్లు చిన్నపిల్ల అని ఎందుకనుకుంటారు కలెక్టివ్‌గా గంతలు కట్టుకుని దుర్గకీ కాళికీ లక్ష్మికీ ఉత్సవాలు చేస్తాం గదిలో ఏనుగు చుట్టూ గుడ్డోళ్ళం సమస్యకి అనేక రంగులు పూస్తాం నా సుఖప్పిల్లో కింద మూలుగు నొక్కేసుకుని […]
Continue Reading