రావూరి మనోరమ
-ఎన్.ఇన్నయ్య
93 సంవత్సరాల మనోరమ గోరా కుమార్తె. ప్రస్తుతం విజయవాడలో నాస్తిక కేంద్రం దగ్గరే వారు వుంటున్నారు. మనోరమ పెళ్ళి చారిత్రాత్మకం. గాంధీ గారి దగ్గరకు వెళ్ళి ఆయన ఆశీస్సులతో ఆశ్రమంలో పెళ్ళి చేసుకుంటామన్నారు. గాంధీజీ అంగీకరించి 1948లో రమ్మని, పెళ్ళి నిరభ్యంతరంగా చేసుకోవచ్చని చెప్పారు. సంతోషంగా తిరిగి వచ్చి పెళ్ళికి సిద్ధమౌతున్న సమయానికి, హిందూ మత మూర్ఖుడు పిస్టల్ తో గాంధీజీని కాల్చి చంపారు.
అయినా మనోరమ, అర్జునరావు ఆశ్రమానికి వెళ్ళి అనుకున్న తేదీలలో వార్ధాలో పెళ్ళి చేసుకున్నారు. అప్పటి నుండి మనోరమ – అర్జునరావు దంపతులు నాస్తికోద్యమంలో పని చేస్తున్నారు. అర్జునరావుకు 103 ఏళ్ళు. మనోరమకు 97 ఏళ్ళు. ఇటీవలే వారిని విజయవాడలో కలిశాను. ఆదరణ, ఆప్యాయత వారి సొత్తు. అర్జునరావు – మనోరమలకు కలిగిన సంతానాన్ని నాస్తిక మార్గంలోనే పెంచారు. వారు మిలావ్, చువాన్, సాదిక్, సూయజ్, పవన్ లు.
మనోరమ తన సంతానాన్ని నాస్తిక మార్గంలో పెంచారు. వారంతా ప్రయోజకులై, తమ వత్తులు చేసుకుంటూనే ఉద్యమానికి సహకరిస్తున్నారు. మనోరమ మితభాషిణి. కార్యశూరురాలు. ఆమెను కలియడం, సత్కారం స్వీకరించడం ఎంతో ప్రేమతో కూడినదిగా వుంటుంది.
పెళ్ళి అయిన తరువాత కొన్నేళ్ళు వానపాముల (కృష్ణాజిల్లా)లో వుంటూ కార్యక్రమాలు సాగించారు. గోరా గారు తలపెట్టిన ముస్లిం – హిందూ సహపంక్తి. భోజనాలు, ఆవు మాంసం పంది మాంసం సహపంక్తిలో వడ్డించడాన్ని మనోరమ సమర్ధించి సహకరించింది. తమ సంతానానికి కులాంతర వర్ణాంతర వివాహాలు చేయించారు. మనోరమ పబ్లిసిటీ కోరని కార్యకర్త. 93 ఏళ్ళ వయస్సులో భర్తతో కలసి అతిథి గౌరవం చేస్తున్నారు.
మనోరమను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సత్కరించాయి.
నాస్తిక మార్గం ఆచరణ సాధ్యమని మనోరమ నిరూపించింది.
****