ఆమె ఒంటరిగా నడిరేయి నడవదు
-రామకృష్ణ సుగత
ఆమె ఒంటరిగా నడిరేయి నడస్తుందంటె
కళ్ళుకి నిప్పు తగిలించికొని
అలాయి చేస్తుండాలి
విమర్శకుల వీధిలో శబ్దాలను అమ్మినట్టు
సులభం కాదు ఆడదానయ్యేది
పూరించిన దేహం కాలిపోయిన ఆత్మ
వసంతానికి విసిరిన రాయి
కొంచం తడిచి వచ్చుండాలి
ఆమె ఒంటరిగా నడిరేయి నడస్తుందంటె
బట్టలువేసిన నగ్నం తో పాటు భావాలు వీధికి దిగి ఉండాలి
చనిపోయిన కడుపుని ఆకలి ఓదార్చినట్టు
సులభం కాదు ఆడదానయ్యేది
పనుల జీతం మరణించిన కోరిక
మొన్న కుట్టిన జేబు కొంచం చిరిగుండాలి
ఆమె ఒంటరిగా నడిరేయి నడస్తుందంటె
విధిలే రాసిన అక్షరాలు స్థానం మార్చి ఉండాలి
మౌనంలో నీ మాటను తిప్పి
వ్యాకరణం దిద్దినట్టు
సులభం కాదు ఆడదానయ్యేది
శబ్దాలు స్మశాన గ్రంథాలు ఘోరీ
అర్థాలు అందం దిద్దడానికి అలంకారం నిరాకరించుండాలి
లేదు సుగత
ఆమె ఒంటరిగా నడిరేయి నడవదు
నాగరికతల తదుపరి శిథిలం అయినప్పుడు
గాయాలకు నొప్పి లేపం అయినప్పుడు
పగలు పురుష దీక్షానికి యాగం అయినప్పుడు
ఆమె ఒంటరిగా నడిరేయి నడవదు
*****