మహమ్మద్ ఘోరిని ఓడించిన వీరాంగన “రాణి నాయికి దేవి”
-యామిజాల శర్వాణి
గ్రీకు చరిత దగ్గరనుంచి ప్రపంచ చరిత్రలో ఎందరో వీరనారుల చరిత్రలు చదువుతాము వీళ్ళు పురుషులకు ఏ మాత్రము తీసిపోకుండా యుద్దాలు చేసి ఘనత వహించారు పరిపాలనలోను శత్రువులను ఎదుర్కోవటము లోవారిదైనా ముద్ర వేశారు.కానీ మన దేశ చరిత్రలో అటువంటి వారిని తక్కువగా కీర్తించి విదేశ ఆక్రమణదారులను గొప్ప హీరోలుగా చిత్రకరించిన సంఘటనలు చాలా ఉన్నాయి ఇదంతా మనము ఎక్కువకాలం బ్రిటిష్ వారి పాలనలో ఉండటమే వాళ్ళు చరిత్రను వాళ్లకు అనుకూలముగా వ్రాసుకున్నారు నేటికీ ఆ చరిత్రనే మనము పాఠాలుగా పిల్లలకు చెపుతున్నాము ఇంకా అ బానిస భావాలనుంచి పూర్తిగా బయటకు రాలేదు మహమ్మద్ ఘోరీ చేసిన అరాచకాలను గోప్ప విజయాలు గా కీర్తిస్తూ మనకు పాఠాలు చెపుతున్నారు స్వాతంత్రము వచ్చి
ఘోరీ ,పృద్వి రాజ్ చౌహన్ ను ఎదుర్కోవటానికి 14 సంవత్సరాల ముందే ఆమె మొహమ్మద్ ఘోరిని ఓడించింది. 1192లో జరిగిన రెండవ తారైన్ యుద్దములో పృద్విరాజ్ చౌహన్ ను మొహమ్మద్ ఘోరీ ఓడించి సంగతి అందరికి తెలిసినదే అంతకు ముందు జరిగిన కధ గురించి తెలుసుకుందాము.నాయకి దేవి చాళుక్య వంశానికి చెందిన రాణి.ఈవిడ గోవాకు చెందిన కదంబ పాలకుడు మహామండలేశ్వర పేర్మాడి కూతురు,మరియు సోలంకి రాజు అజేయ పాల భార్య ఇతను 1170 వరకు 4 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు.భర్త మరణించాక కుమారుడు ములరాజా II చిన్న పిల్లవాడు అవటం వలన నాయకి దేవి రాజ్య పాలన భారము తీసుకుంది1173 లోఆఫ్ఘనిస్తాన్ ను జయించిన ఘురిడ్ రాజైన మొహమ్మద్ షహాబుద్ధిన ఘోరీ(మొహమ్మద్ ఘోరీ పూర్తి పేరు) ఇతర దేశాలను దురాక్రమణ చేయాలన్న తలంపు ఉన్నవాడు అవటం వల్ల అలెగ్జాన్డర్ ఇతర పర్షియన్ రాజులు చేయని సాహసము భారత దేశములోకి చొరబడి ఆక్రమించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఘోరీ మొదటి ఆక్రమణ ముల్తాన్ మరియు ఉఛ్ దుర్గాలు.ఈ ఆక్రమణలు పూర్తి అయినాక దక్షిణాన ఉన్న రాజపుత్ర మరియు గుజరాత్ సంస్థానాలపై దృష్టి పడింది. అతని లక్ష్యము సంపదలతో తుల తూగుతున్నఆన్ హిల్వారా పఠాన్ కోట. ఈ కోట చాళుక్య(సోలంకి అని కూడా పిలుస్తారు) రాజుల రాజధాని. మొదట ఈ రాజ్యము 8 వ శతాబ్దానికి చాపోత్కట వంశానికి చెందిన వన్రాజ్ చే స్థాపించబడి చాళుక్య వంశస్తులచే కొనసాగించబడింది.
అమెరికన్ చరిత్రకారుడు తెర్తియస్ చాండ్లెర్ ఆన్ హిల్వారా పఠాన్ కోటను ప్రపంచములోని పురాతనమైన 10 దుర్గలలో,1000 సంవత్సరములో 100,000 జనాభాతో ఒకటిగా వర్ణించాడు ఈ దుర్గాన్ని మూలరాజ II పరిపాలిస్తున్నప్పుడు ఘోరీ దాడి చేశాడు కానీ ఈ యుద్దాన్ని నడిపించింది రాజు తల్లి అయిన నాయికి దేవి. ఘోరీ సులభముగా యుద్దములో గెలిచి కోటను స్వాధీనము చేసుకోవచ్చని దాడి చేసాడు కానీ జరిగింది వేరు. నాయకి దేవి కత్తి యుద్ధము,గుర్రపుస్వారీ,యుద్ధ తంత్రాలలో,దౌత్య కార్యకలాపాలలో మంచి నేర్పరి.కాబట్టి ఘోరీ దండయాత్ర సమయానికి చాళుక్య సైన్యానికి ఆధిపత్యము వహించింది. నాయకి దేవి తన పొరుగు రాజ్యాల రాజులతో(పృద్వి రాజ్ చౌహన్ తో సహా) రాయబారాలు జరిపింది కానీ చాలా మంది వారి సహకారము అందివ్వలేదు. కానీ చాళుక్య సామంతరాజులైనా నద్దులా చాహమన వంశము వారు,జాలోర్ చాహమన వంశస్తులు మరియు అర్బుద పరామరా వంశస్తులు నాయకి దేవికి పూర్తి సహకారము అందించారు.
శత్రువును గెలవటానికి ఈ సైన్యము సరిపోదని భావించిన నాయకి దేవి తన యుద్ధ తంత్రాన్ని చాలా తెలివిగా ప్లాన్ చేసింది. దాడికి మౌంట్ అబూ పర్వతశ్రేణిలోని ప్రస్తుత సిరోహి జిల్లాలోని కసహ్రద గ్రామము దగ్గర గల పర్వత ప్రాంతమైన గదర్ ఘట్ట ప్రాంతాన్ని యుద్దానికి ఎన్నుకుంది.ఈ ఇరుకైన కొండ ప్రాంతము ఘోరీ సైన్యానికి పూర్తిగా పరిచయము లేనిది అవటం వలన నాయకి దేవి సైన్యాలకు బాగా లాభించింది. నాయకి దేవి తన కొడుకును ఎత్తుకొని తన సైన్యాన్నినడిపిస్తూ శత్రుసైన్
ఆ విధముగా కసహ్రద యుద్ధము ఘోరికి
*****
నా పేరు యామిజాల శర్వాణి. M.B.A, B.Ed చేశాను. కొంతకాలం ఉపాధ్యాయ వృత్తిలో ఉండి, ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో గృహిణి పాత్ర నిర్వహిస్తున్నాను. అడపాదడపా ఇలా కొన్ని రచనలు చేస్తుంటాను. నా రచనలు బాలల పత్రికలైన బుజ్జాయి వంటి వాటిలో ప్రచురితమయ్యాయి.