రుద్రమదేవి-1 (పెద్దకథ)

-ఆదూరి హైమావతి

[ ఇది స్వాతంత్య్రం రాకముందటి కథ- ]

 దేశభక్తి గల భానుచంద్ర, పేరిందేవిలు తమ కుమార్తెకు   ‘రుద్రమదేవి’ అని తన  నామకరణం  చేసి పొంగిపోయారు. ‘రుద్రమ్మా’ అని నోరారా పిలుచుకునేవారు.  

   రుద్రమను కుమార్తె లాకాక  మగపిల్లవానిలాగా  పెంచసాగాడు. రుద్రమ చదువుతో పాటు సంస్కారం  నేర్చి తండ్రితో పాటు ప్రజాసేవ చేయసాగింది.మగపిల్లాడిలా అన్నీ నేర్చుకుని గ్రామాలు తిరిగి  ఆరోగ్య పారిశుధ్యపాఠాలు బోధిస్తూ, గ్రామస్థులకు  ముఖ్యంగా హరిజనవాడల కెళ్ళి తండ్రి అతడి-‘స్పందనబృందం తో పాటుగా సేవలు అందించ సాగింది.

రుద్రా! నీవు వైద్యం చదివి వాడలో వారికి సంపూర్ణ  సేవలు అందించాలిరా! గాంధీ గారి  ఆశయ సాధనకు మనవంతు కృషిచేయాలి , ఏమంటావు?” తండ్రి భానుచంద్ర, అడిగినదానికి ఆమె,

 ” నాయనగారూ ! నేను వైద్యం చదివి సేవలు అందించను ఇంకా ఎన్ని సంవ త్సరాలు పడుతుందో మీకు తెల్సు.ఈలోగా ఆవాడల ప్రజల కష్టాలూ  , నష్టాలూ ఎవరు తీరుస్తారు .మీరు మన బృందంలో ఆడమగ వైద్యులను చేర్చండి , వెంటనే మనం సాయం అందించవచ్చు.” అని చెప్పింది.

    ” తెలివైన మాట చెప్పావు. ఆమార్గంలో సేవలను అందించడం మన తక్షణ కర్తవ్యం. నేను మన వల్లభ బాబాయితో మాట్లాడిచూస్తాను.” అని బయటికి వెళ్ళాడు భానుచంద్ర

 తండ్రి అంటువెళ్ళగానే రుద్రమ్మ తన సైకిలెక్కి కాలేజ్ కి బయల్దేరింది. పదిగ జాలు వెళ్ళిందో లేదో చమటలు కక్కుతూ ఎదురొస్తున్నవాడపిల్లలు నలుగురు ఎదురయ్యారు. రుద్ర  సైకిలాపిఏరా! ఏమైంది ఇలా పరుగెడుతూ  వచ్చారు ?” అని అడిగింది.

 వారిలో పదేళ్ళవాడైన  నాగన్నఅక్కా! ‘మావాడకు అగ్గిఅంటుకుంది.గుడిసెలు మండిపోతన్నైఅని రొప్పుతూ చెప్పాడు.

అక్కా! పెద్దళ్ళెవ్వరూ  లేరు , పన్లకెళ్ళిండ్రు. లేవలేని ముసిలాళ్ళు గుడెసెల్లో ఉండ్రు , మాకు భయ మేసి వచ్చిన మక్కా!”మరో కూనడు చెప్పగానే , రుద్ర ఓరి నాగన్నా ! !నీవెళ్ళి బాబుకు చెప్పి అందర్నీ పిల్చుకు రమ్మను .నే వీళ్ళను తీసు కెళతాబాబు గుడ్డల కొట్లో ఉన్నారు..”  అంటూ మిగిలిన ముగ్గుర్నీ తన సైకిల్  వెనకా ముందూ కూర్చోబెట్టుకుని వేగంగా తొక్కుతూ వెళ్ళింది .

    రుద్ర వాడ చేరేసరికి మంటలు  చెలరేగుతున్నై. పాకలు  ఒకదాని తర్వాత ఒకటి అంటుకుని మంటలు చిటపట శబ్దంతో ఎగసిపడుతున్నై. రుద్ర సైకిల్  చెట్టుక్రింద ఆపేసి పిల్లలందరినీ పోగుచేసి , ఇసుక చేటలతోతీసి పాలకపైకిచల్లమంది. పాకల ముందు మట్టితొట్టెల్లో నిలువసేసుకున్న నీళ్ళని ముంతల తో ముంచి పాకలపైకి చల్లమని కొందరికిచెప్పి ,తాను పరికణావెనక్కు మడిచి గోచీదోపి, పమిటతీసి నడుం చుట్టూ చుట్టి మడిచికట్టి,పొడవైన జడని చుట్టగా చుట్టి తలపై ఒకగోనెపట్టా ముక్క కప్పికట్టి గుఱ్ఱప్పిల్లలా మండుతున్న గుడిసెల్లోకి  ఛెంగునదూకింది

     ఎక్కడైతే కదల్లేని ముసలివారున్నారో వాళ్ళని భుజాలపైవేసుకుని తెచ్చి దూరం గా చెట్లక్రింద పడుకోబెట్టింది. సుమారుగా తొమ్మిదిమంది ఆడ, మగా 70,80 ఏళ్ళ వృధ్ధుల ప్రాణాలు బూడిదై పోకుండా  కాపాడి, 10,12 ఏళ్ళపిల్లలందరిచేతా ,ఇసుక, నీళ్ళు పాకలపై  చల్లించి మంటలను అదుపుచేస్తూనే గుడిసెల్లో  వస్తువులన్నీ ఓచోట తానే మంటల్లోకి వెళ్ళి తెచ్చి దూరంగా విసిరేసి, పిల్లలను వాటిని ఓచోట చేర్చమని చెప్పింది. మొత్తం ముప్పై మంది ఆరునుంచీ పదిపన్నేడేళ్ళ వరకూ ఆడ మగపిల్లలు  రుద్ర నాయకత్వంలో కొన్ని వస్తువులు కాపాడుకోగలిగారు. కుండల్లోని నూకలు, కొన్ని గుడ్డలూ చాపలవంటివి మాత్రం దక్కాయి చంటిపిల్లలు కొందరు చెట్లకు కట్టిన గుడ్డ ఉయ్యలల్లో ఉండటాన వారికే అపాయమూ జరగలేదు

ఇంతలోస్పందనబృందం వచ్చి చేరింది. రుద్ర ధైర్యంగా చేసినపనికి వారెంతో ఆశ్చర్యమూ, ఆనందమూ చెంది ఆమెను అభినందించారు.

నాయనగారూ! ముందు ఆవృధ్ధులకు ప్రధమ చికిత్సచేయించి, అవసరమైన వారిని వైద్యశాలకు తీసుకు వెళ్ళాలేమో చూడండి.” అని రుద్ర చెప్పగానే ఆ బృందం సభ్యులంతా దూరంగా చెట్లక్రింద పడిఉన్న వారివద్దకెళ్ళి, వైద్య సేవలు అందించి  వారికిచికిత్స చేయగా, మిగిలినవారు, వారిని నీడబాగా ఉన్న చెట్ల క్రింద కు చాపలుపరిచి పడుకోబెట్టారు. ఇద్దరు పిల్లలు అందించిన  కబురందుకుని పను ల్లో ఉన్నపెద్దలంతా లబోదిబో మంటూవచ్చి , స్పందన బృందాన్నిచూసి, విష యం తెల్సుకుని , చేతులెత్తి మొక్కారు.స్పందన బృందలోని వారుకొందరువెళ్ళి మిగిలిన అందరికీ కొంతఆహారం తెచ్చిఅందించారు.

       అప్పటికి మధ్యాహ్నం మూడైంది.స్పందన సభ్యులంతా కలసి మాట్లాడుకుని ,తదుపరి కార్యక్రమాన్నిగురించీ చర్చించారు.ముందుగా వారి గుడిసెలు కప్పుకోను గడ్డి,కొబ్బరిమట్టలు, తాటాకుల వంటివి సప్లయి చేయటం , కొన్ని గుడ్డలు సేకరించి ఇవ్వటఒ వంటివి చేసి ,తిరిగి ఇలాంటిఅగ్ని ప్రమాదాలు జరక్కుండా శాశ్వత చర్య లు చేపట్టాలని నిర్ణయించారు . మరునాటి నుండీ ఆపధకం  అమలుకు శ్రీకారం చుట్టాలని నిశ్చయించారు.

రుద్ర  మరునాడు తనమనస్సు తెలిసిన స్నేహితుల ఇళ్ళకెళ్ళి వారిపెద్దలను కలిసి తమసేవాసంఘం నిర్ణయం తెలిపింది. తానంటే ఎంతో ప్రేమగా ఉండే తననెచ్చెలి తోఏమోయ్ మధురిమా ! నీవలన జరిగేసహాయం ఏమైనా ఉందా? పాపం వాళ్ళంతా గాయాలతో ఉన్న ఆముసలి వగ్గులను చూస్తుంటే నామనస్సు తరుక్కుపోతోంది.మనమూ దూరంగా పెట్టాం భగవంతుడూ వారినిచిన్నచూపు చూశాడు.” అని తన నెచ్చెలితో అంటున్నరుద్రను చూసి,మధురిమ తల్లి ,

ఏమమ్మా ! రుద్రా ! నీవెలాగూ బరితెగించి వాడల్లో తిరుగు న్నావ్ ? మా పిల్లనూ చెడ గొట్టాలనివచ్చావా?” అని అడిగింది.

 రుద్ర నవ్వుతూమానవ సేవ చేయటమే చెడగొట్టటమూ, బరితెగించడమూనా! అత్తా! వారు మన వరి పొలాల్లో పని చేయక పోతే మనమేం తింటాం? మన చేలలో పని చేసేవారు మనవారుకారా? వారు ఒక్కరోజు రాకపోతే మన  పరిస్థితేంటి ? మన కు పాలిచ్చే పశువుకు కాలు మెలి తిరిగితే మన మనస్సు మెలి తిరిగి పోతుంది. వెంటనే వైద్యం చేయిస్తాంఅదిపశువే కదాని వైద్యం మానం. మన వంటి మను ష్యు లైన వారంటే ఎందుకంత కోపం ? ఎప్పుడోమనమూ వారింట పుట్టి ఉండలేదనే గ్యారంటీ ఉందా మన లక్షల జన్మల్లో? ఆతర్వాతే ఎన్నో జన్మ లెత్తి ఇప్పుడు ఇక్కడ ఉన్నామేమో కదావారి శ్రమ వలన మనం బాగుపడుతూ వారిని పగవారిలా చూడ టం భావ్యమాఅత్తా ! చెప్పండి. వారినేం మనఇళ్ళలో పెట్టుకొడం లేదు. మనవద్ద మిగిలి  పోయిన బట్టలూ , కొద్దిగా ధాన్యం వంటివి ఇస్తే వారూ కాస్త వండుకు తిని బలం తెచ్చుకుని తిరిగి మన తోటల్లోనే పనిచేయను వస్తారు కదా! నేచెప్పిన దాంట్లో పొరపాటు ఉంటే నన్ను మన్నించండి . మీ కూతురువంటి దాన్నే !” ఎంతో నిబ్బరంగా మాట్లాడుతున్న రుద్రను చూసి ఆమె ఆశ్చర్యపోయింది.

  తన మనస్సుకిఉన్న అఙ్ఞానపుపొరను తొలగించిన  రుద్ర ఆమెకళ్ళకు  దేవతలా కన్పించింది.  

అమ్మా!రుద్రా ! నీవు ఎంతో తెలివైనదానివి! ఇంతకాలం ఇరుగుపొరుగమ్మల మాటలువిని నీవేదో చెడ్డ పని, కానిపనీ  చేస్తున్నావనేభావన  నామనస్సులో పాతు కు పోయింది, ఇప్పుడది కడిగేశావు తల్లీ! నా కూతురు బయట తిరిగితే  మాఅత్త గారూ, మామగారూ ఊర్కోరు,ముసలివారిని బాధించడం నామతంకాదు , దానికి పెళ్ళిసంబంధాలు చూస్తున్నాంకూడా!మెమౌ వడనిబట్టలూ కొంతధాన్యంమాత్రం నేనుఇవ్వగలను, అలాగే మాఇంటాయనకు చెప్పి పొలంలో కొబ్బరిమట్టలూ, తాటి మట్టలూ కొట్టుకుపోయే ఏర్పాటు చేస్తాను. నీ మనస్సు  ఎంతోమంచిదమ్మా ! పది కాలాలపాటు చల్లగాజీవించు.” అని ఆశీర్వదించింది. తనపని అంతసులువైనం దుకు రుద్ర ఆదేవునికి మనస్సులోనే దండాలర్పించి ఇంకో నేస్తురాలింటికి కదిలింది .  

    అలా రుద్ర తనస్నేహితురాళ్ళ ఇళ్లలోమాట్లాడి , కొందరిని వప్పించి , మరికొంద రిని  నొప్పించినా ఆతర్వాత తనవాక్చారుర్యంతో  చందాలూ,బట్టలూ , ధాన్యమూ ఇవ్వను ఒప్పించి ఎలాగైతేనేం తనవంతు కార్య సాధనచేసింది

 మరునాడు రుద్ర తనతండ్రీ, ‘స్పందనసభ్యులూ వెంటరాగా , ప్లేకార్డులతో ఊరం తా తిరిగి ఒక ఒంటెద్దు బండినిండా కొంత ధాన్యం , పాతబట్టలూ, ఉప్పూ పప్పులూ సంపాదించింది . ఆబట్టలన్నీ ఒకదగ్గర చేర్చి చేతి కుట్టుమిషన్ తో సరిచేసి, బొత్తా లుకుట్టి , మరునాడు అందరికీ పంపకం చేశారు స్పందన సభ్యులు.ఎలా తెల్సుకు న్నా రో పత్రికలవారు వచ్చి ఫోటోలు తీసుకోబోగా సభ్యులఒతా ప్రతిఘటించారు.

      ” ఎందుకని వద్దంటున్నారు? మీసేవలు అందరికీ తెలియాలనికదా! ” అని అడగ్గామాకు మేము చేసుకుంటున్న పనిసేవెలా అవుతుంది ? దానికి ప్రచారమొ కటా? వద్దేవద్దుఅని ఘట్టిగా వారించింది రుద్ర.

      ఎలాతెలిసిందో బాపట్లలో మకాంచేసిన  తెల్లదొరలకు ఈవార్త తెలిసి కబురం పారు, ‘వచ్చికలవమనిసున్నితంగాతనకు కాలేజ్ లోపరీక్షల సమయం గనుక రాలేననిజవాబిచ్చి పంపింది రుద్ర.వారితో ఒక్కమారు సమావేశమైతే  లేనిపోని ఇబ్బందులు కొనితెచ్చుకున్నట్లేని ఆమెభావన. సమాజ సభ్యులంతా కూడా రుద్ర భావనకు సపోర్టు చేశారు.

      వాడ సభ్యులంతా గుడిసెలు కప్పుకున్నాక రుద్ర కాస్త స్థిమితపడి, తనచదువు ల్లో మునిగి  ఇంటర్ పరీక్షలు పూర్తిచేసింది

ఆవేసవిలో  వాడలో పిల్లలందరినీచేర్చి చదువుచెప్పడం  మొదలెట్టింది.ఒక పల్లె పాఠశాలకు వెళ్ళి పాత అచ్చుపుస్తకాలు ఇవ్వమని కోరింది.

 ” ఏం అమ్మాయమ్మోయ్! మేం శానాఅనుబవంతో సెవుతాంటేనే  పిల్లకుంకలకు సదువుఅబ్బటంలా . నీవింత సిన్నదానివి  ఆవాడ పిల్లెదవ కుంకలకు ఏం సదువు సెప్పి వుద్దరిత్తావ్చాదత్తం కాపోతే!”  అన్నాడా పంతులు వాడిఖర్మకాలి.

****

(ఇంకా ఉంది) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.