స్వరాలాపన-6

(మీ పాటకి నా స్వరాలు)

-డా||కె.గీత

మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు ఇటువంటి కాలమ్ ఒకటి ఉంటే ఉపయోగకరంగా ఉంటుందన్న సలహా ఇవ్వడంతో అవి మీకూ ఉపయోగపడతాయని ఇక్కడ నెలనెలా ఇస్తున్నాను.

మీకు నచ్చి, నేర్చుకుంటే ఇక్కడ కామెంటులో తెలియజెయ్యడమే కాకుండా రికార్డు చేసి editor.neccheli@gmail.com ఈ-మెయిలుకి పంపండి. ఉత్తమమైన వాటిని ప్రచురిస్తాం. అంతే కాదు మీకు నచ్చిన సినిమా/ఏదైనా ప్రముఖ పాటకి (ఏ భాషైనా) స్వరాలు కావాలనుకుంటే కూడా ఈ-మెయిలు పంపండి. వరసవారీగా స్వరాలు ఈ కాలమ్ ద్వారా అందజేస్తాను.  మీరు ఇలా నేర్చుకున్న పాటల్ని యూట్యూబు, ఫేసుబుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పెట్టదలుచుకుంటే తప్పనిసరిగా ఆ పాట ప్రచురితమైన  నెచ్చెలి పేజీ లింక్ ని ఇస్తూ, నా పేరుని జత చెయ్యడం మరిచిపోకండేం!

***

చిత్రం : పంతులమ్మ(1977) 

 సంగీతం : రాజన్-నాగేంద్ర 

సాహిత్యం : వేటూరి

రాగం: మోహన రాగం  

ఆరో: స రి2 గ3 ప ద2  స*  

 అవ: స* ద2 ప గ3 రి2 స 

ఇందులో ని2, మ2  కలుస్తాయి. 

సిరిమల్లె నీవే  విరిజల్లు కావే

సరిగాప గారీరీ గరిసాగాగా 

వరదల్లె రావే వలపంటె నీవే

సరిగాప గారీరీ గరిసా సాసా 

 

ఎన్నెల్లు తేవే  

సరిగాపదా దనీదనీ సా* 

ఎదమీటి పోవే

సనిదనిప పాపద పగరిస 

సిరిమల్లె నీవే విరిజల్లు కావే

సరిగాప గారీరీ గరిసాద సాసా

 

ఎలదేటి పాటా 

పపదాస సాదాపా 

చెలరేగె నాలో 

 పపదాస దాసాసరీ*  

చెలరేగిపోవే 

స*రి*స*రి*స*  నీదాదానీ 

మధుమాసమల్లే

సనిదనిప పాపా 

ఎలమావి తోటా 

పపదాస దాసా సగరిసదాపా

పలికింది నాలో

పపదాస దాసాసారీ*

పలికించుకోవే 

స*రి*స*రి*స*  నీదాదానీ 

మది కోయిలల్లే

సనిదనిద పాపా

నీ పలుకు నాదే 

గపపదప గారీరీ

నా బ్రతుకు నీదే

పామ2దప గారీసా 

 

 

తొలిపూత నవ్వే వనదేవతల్లే

సరిగాప గారీరీ గరిసా గాగా 

పున్నాగపూలే సన్నాయి పాడే

సరిగాప గారీరీ గరిసా సాసా

ఎన్నెల్లు తేవే 

సరిగాపదా దాదానీ

ఎదమీటి పోవే

సనిదనిప పాపద పగరిస 

సిరిమల్లె నీవే విరిజల్లు కావే

సరిగాప గారీరీ గరిసా సాసా

 

ఆ ఆ ఆ అ అ ఆ

దాసా*సా*రీ*సా*దా  దస*పాదారీ* సదపగ 

ఆ ఆ ఆ అ అ ఆ

పాదాసా*రీ*గా  సాసగ*రి*స  దాసా

 

మరుమల్లె తోటా మారాకు వేసే మారాకు వేసే నీ రాకతోనే

నీ పలుకు పాటై బ్రతుకైన వేళా బ్రతికించుకోవే నీ పదముగానే

నా పదము నీవే నా బ్రతుకు నీవే అనురాగమల్లే సుమగీతమల్లే

నన్నల్లుకోవే నా ఇల్లు నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే

సిరిమల్లె నీవే విరిజల్లు కావే

ఆహా ఆహా ఆహ లలల

*****

*ఈ స్వరాలు వింటూ నేర్చుకోవడానికి అనువుగా కింద ఇవ్వబడిన “గీతామాధవీయం” టాక్ షో లో రెండవ భాగమైన “స్వరాలాపన” వినండి-

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.