రుద్రమదేవి-2 (పెద్దకథ)

-ఆదూరి హైమావతి

ఏంటి రుద్రా ఇతని ఉఛ్ఛారణ ఇలా ఉంది? నిజంగా ఇతడు చదువుకున్న పంతు లేనా? లేక వేషధారా! అని నాకనుమానంగా  ఉంది !” అంది రుద్ర చెవిలో వరమ్మ.

ఆగు వరం ఇతహాడి నిజరూపం తేల్చేద్దాం ! నాకూ అదే అనుమానంమెల్లిగా అంది రుద్ర వరంతో .  

సరే మరి ! నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను , మీ పిల్లలను జవాబివ్వమనండి , అవే ప్రశ్నలు మీరు మా వాడ పిల్లలను అడగండిఎవరు సరిగా చెప్తే వారికే ఈపుస్తాకా లన్నీ చెందుతాయి సరా!ఎవరో దానాధర్మఒ చేసిన అచ్చుపుస్తకాలు  , మీరు వాడా క మాకివ్వను ఏం బాధండీ?” అంది రుద్ర..

ఏవమ్మాయమ్మోయ్! నీవేం ఇనస్పెట్టేరువా? పెసిన్ లడగటేనికి నేనొప్ప.” అన్నా డు రావప్పంతులనిచెప్పు కుంటున్న ఆపంతులు

పిల్లలకు ఏంచదువు చెప్తున్నారో తెల్సుకోను ఇన్స్ పెక్టర్లవక్కర్లా ! ఎవరైనా తెల్సు కో వచ్చు .అడగనా మీ పిల్లల్ను  ” అంటున్న రుద్రతో    

ఏం అమ్మాయమ్మోయ్ ! ఏదో దేచాన్నుద్దరిత్తున్నట్టు మాత్తాడకు.వాడపేరు సెప్పి బాగానే సంపాదించిన వని ఇన్నాం.అంతా సెప్పుకుంటున్నరులే!  ” రోషంగా అన్నాడు ఆపంతులు, నిజానికి అతడు ఏమీ పెద్దగా చదవలేదు, నకిలీ పంతులు ఏదో దొరల ప్రాపకంసంపాదించి ,వారిసానుభూతితో పంతులుగా చేరిన ఒకవ్యక్తి ఇతడ్ని తనబదులు నకిలీ గా ఉంచి తాను మరోలాభసాటి పనిచూసుకునేందుకు వెళ్ళాడు . జీతం నెలకు ఐదు రూపాయ లైతే తాను సగంతీసుకుని నకిలీకిసగం ఇస్తాననినచ్చజెప్పాట్ట!..పిల్లలకు చదువేమీ చెప్పక వారిచేత తన ఇంటి పనులు చేయించు కుంటూ కాలంగడుపుతున్నాడు.

”  ఏం  బెదిరిత్తున్నావా ఏందమ్మాయమ్మోయ్ !అడుగు నేసెప్పిన సదువునే ఎక్కి రిత్తావుగా! ” అన్నాడు రోషంగా ఆ రామప్పంతులు. 

పిల్లల వేపుతిరిగి ” ఏయ్ పిల్లోల్లూ!ఈఅక్క ఏదో అడుగుతందంట ! సెప్పండి ! మీకుఅన్నీ సెప్పిచ్చానుగందా?” అని పంతులు చెప్పేప్పుడు,రుద్ర మెల్లగా బోర్డుమీద ‘రామాయణం’అనివ్రాసింది వారెవ్వరూ గమనించకుండా. ” పిల్లలూ! మీరు బాగా చదువుతారా?” అని అడిగింది.

 ” మేమెక్కడ సదువుతాం అక్కమ్మో? ఎంసక్కా అయ్యోరికి  నీల్లుతెత్తాం కాలవ నుంచీ,అయ్యోరమ్మకు కూరలుతెచ్చిత్తాం ,బొగ్గులూ, కట్టెలూ ఏరితెత్తాం .అయ్యోర య్య  మాకుపద్దాలు చెపుతారు పలుకుతాం , ఆయన్నిద్దరోతుంటే  ఇసరతాం, కాల్లు పడతాం.అంతే కాని సదవతం ,రాయతంరాదు.” అన్నాడు వారిలో ఒకడు .  పకపకా నవ్వింది రుద్ర..

    రుద్రకు తోడుగా వచ్చిన వరమ్మ” ఏయ్ రుద్రా ఈయనతో మనకెందుకే! పదపో దాం మానాయన గారికి చెప్పి నీబడికి కావల్సిన అచ్చులన్ని నేనుషాపు నుండీ తెప్పిచ్చిస్తాన్లే! ” అంది మెల్లిగారుద్ర చెవిలో. 

” ఎందుకే వృధా ఖర్చు గాంధీగారి పొదుపు గురించీ చెప్పుకుంటూ .ఆగాగు ఈయన తెలివి బయటపెట్టి అచ్చుపుస్తకాలన్నీలాక్కుపోదాం.”అంది రుద్ర మెల్లిగా వరమ్మ కు మాత్రంవినిపించేలా.

“అడుగమ్మాయమ్మో!వాల్లమాటలకేం పిల్లెదవలు. ఐనాపంతులుకు సేవలుసేత్తే తప్పేంటీ! చెప్పు. సీకిట్టయ్యంతటోడు  కట్టెలేరి తేలే?  ” 

” ఔనవును .తప్పేంలేదు. ఐతే శ్రీకృష్ణునికి వాళ్ళగురువు పాఠాలుకూడా చెప్పేరు.”  

” నేనూ సెప్పానమ్మాయమ్మో ! అడుగు. ఏరా  పద్దేలూరావురా మీకూ! సెప్పండి?”  

 ” సరే అలాగే అడుగుతాను.పిల్లలూ !ఏదీమీకొచ్చిన చిన్నపద్యం  చెప్పండి ” అంది రుద్ర. పిల్లలంతా ఏక కంఠంతో…..

                       ” ఛీరాముని  సేలో   దయ్యం, 

                         నోరూరగ శనగలన్ని సెకసెక తినగా ,

                         తూరాములు  చూడగదాన్నీ

                         పోపోర పోరా యంటూ పక్కకు తరిమెన్ !”

       అనిచెప్పగానే పదినిముషాలు  ఆపకుండా నవ్వేరు పొట్టచెక్కలయ్యేలా రుద్ర ,వరమ్మానూ.. వరమ్మ గింకిరీలు తిరుగుతూ  పొట్టపట్టుకుని నవ్వి, నవ్వి అలసి పోయి కూర్చుంది అరుగుపైన.కాస్త సేపయ్యాక రుద్ర ,

“పిల్లలూ!ఈ పద్యం మీకెవరు చెప్పారు ? ” అని అడిగింది?.

” మాపంతులయ్యే నక్కమ్మా!” అని అంతా పెద్దగా చెప్పారు .

” రామప్పంతులుగారూ! మీకీ పద్యం ఎవరు చెప్పారు ? అసలు దీనిఅర్ధం ఏంటో కాస్త చెప్తారా? నామొద్దుబుఱ్ఱకు అర్ధమేఅవటంలేదు ” అనిఅడిగింది రుద్ర.

” మరి ఊరికే నన్నుఏలాకోలం సేయతం కాదమ్మాయమ్మోయ్ ! మాతాతా వోల్ల పక్కింటి–ఛీరాములు అంటే ఛీమలమఱ్ఱి  రాములన్నమోత!. ఆల్లచెనిగసేలో ఒకదెయ్యంసేరి, చెనిగ లన్నీతిఒటం తూరాములు అంటే తూర్పోల్లరాములు సూశాడన్నమోట!.అప్పుడాదెయ్యం’పోరా ‘ అని బెదిరించిందంట అదీ దీనర్దకం”అని గొప్పగాచెప్పాడు రామప్పంతులు, చేతులుతిప్పి నాటకంలోలాగా యాక్షన్ చేస్తూ …           

” సరి సరి చాలా బాగుంది రామప్పంతులుగారూ! మీదెంతగొప్ప పాండిత్యమండీ! మీగురుజీ ఎవరోగానీ చాలాగొప్పవారుసుమా!.ఐతే  పిల్లలూ !మరి రామాయణం ఎవరు  వ్రాశారో చెప్పండి ?” అంది బోర్డుమీద తాను రాసిన ‘ రామాయణం ‘ అనే మాట చూపుతూ…

” నేను రాయనే లేదక్కాయ్ ” అన్నాడొకడు.

  ఇంకోడులేచి ” యీడు కుశాలుకు అప్పుడప్పుడూ బోరడ్డుమీన రాత్తాఉంటాడక్కో య్ , అబద్దగాలు సెప్తుండడు.” అంటూ పక్కవాడిని చూపాడు.

” అదిసరేగానీ మీకుతెలిస్తే రామాయణ గ్రంధాన్ని ఎవరురాశారో చెప్పండి.” అడిగింది రుద్ర.

కుశాలుక్కూడా  మేంయవ్వరం  రాయలేదక్కాయ్ , నమ్ముమేం  అసత్యకాలు సెప్పేటోల్లంకానేకా    దక్కోయ్!”. రెండుచెంపలూ వాయించుకుంటూ బ్రతిమాలా రు పిల్లలు.   

”  మీరు చక్కగా నేనుఅడిగినవన్నీ చెప్తేమీ కందరికీ మిఠాయుండలు,జీడీలు ఇస్తా ను సరా?” 

అట్టాగే అక్కోయమ్మా! అడుగడుగుఅన్నారంతా ముక్త కంఠంతో..

ఐతేమరి రామాయణం రాసిందెవరు చెప్పండి ” 

మేవ్కానే కాదక్కమ్మా! రాయటాలూ, సదవటాలూ  మాకుసారోరు సెప్పనేలేదుగా? మేవెట్టారాస్త మక్కమ్మా!”                                                                                                                         ” ఏందర్రా! రాసి నోల్లుసెప్పక ఇట్టాఅంటాఉండ్రు? ఇందాకటాల్నుంచీ సూత్త న్నా.రాసినోల్లు సెప్పండహే !” అన్నాడు రామప్పంతులు . రుద్రకువరమ్మకు నవ్వాగిందికాదు.                                                                

  ” ఈయదవలే ఎవురో రాసుంటరమ్మాయమ్మలూ !మరే మనుకోకండమ్మాయ మ్మలూఅన్నాడు రామప్పంతులు.. 

రామప్పంతులుగారూ ! మీరైనాచెప్తారా! రామాయణ గ్రంధాన్ని సంస్కృతంలో  ఎవరురాశారో మేం తెల్సుకుందామని అడుగుతున్నామంతే   ?” అడిగింది రుద్ర.

యదవది ఆమాత్తరం తెలీకండానే పంతుల్నెట్టయ్యానమ్మోయ్ ! రామాయన గంధాన్ని రాములోరు, బారతగంధాన్ని బరతులోరూ ,ఏదగందాలను ఎంకన్న సాములోరూ ,పురాన గందాలను పాండురంగలోరు ,చాత్త గందాలను చాముండ మ్మగోరూ  రాశారని నాకుతెలీదను కోకండమ్మాయమ్మలూ! ” అని చెప్పగానే రుద్ర , వరమ్మా పడీపడీనవ్వి పొట్టనెప్పి భరించలేక గోడవారగా ఉన్న అరుగుపై కూర్చు న్నారు

   నవ్వు ఆపుకుని , అలసట తీర్చుకునిమీరు మహా పండితులండోయ్! ఏమోను కున్నా మిమ్మల్ని చూసి! అందుకే దొరల ప్రాపకంతో ఐదురూపాయల ఉద్యోగం సంపాదించారుసుమా! మానాయనగారు నెలంతా ఆచేసేతవస్త్రాలయంలో పని చేసినా నెలకు నాల్గురూకలే వస్తున్నాయ్ ! ” అంది అమాయకంగా ముఖంపెట్టి రుద్రమ్మ.  

రామప్పంతులుగారు గర్వంగా మీసంమెలేసుకున్నారు. ” మీరు ఇంతపండితులు గదా! మీకు అచ్చు పుస్తకాలతో పనేంలేదు , అవిమా వాడపిల్లలకివ్వండి పంతులు గారూ ! వాళ్ళూ కాస్త తెలివి నేర్చు కుంటారు, గొప్పవారైన మీరుచదివి చెప్పిన ఆ అచ్చుపుస్తకాలు నావద్దఉంటే నేనూమీలా పండితురాలినై  వాడ పిల్లలకు చదువు చెప్తానండీ ! ” అంది ఎంతో వినయంగా

 రామప్పంతులుకు ఆమెమీద  జాలికలిగిఐతే తీసుకెల్లు అమ్మాయమ్మో! పాపం ఆడకూతురి వి  అడిగితే కాదనలేకుండాఅనిచెప్పి అచ్చుపుస్తకాలకట్టతెచ్చి రుద్ర కు ఇచ్చాడు. అవి అసలు తెరవనే లేదు, కొన్నవికొన్నట్లే ఉన్నాయ్! రుద్ర వాటిని తనసైకిలుమిద పెట్టుకుని, రామప్పంతులుకు నమస్కరించిపిల్లలందరికీ నువ్వుండలు, జీడీలుపంచి , వరమ్మతో కలిసి వెళ్ళింది, దారిపొడుగునా ఇద్దరూ రామప్పంతులు గురించీ చెప్పుకుంటూ నవ్వుకుంటూనే వెళ్ళారు రుద్ర ఇంటికి. రుద్ర ,వరమ్మ ఇంటికెళ్ళేసరికి ఎదురింటి పానకప్పంతులు గారింట్లోంచీ పెద్దగా మాటలు వినిపిస్తున్నై. రుద్ర ఏంటో చూద్దామని వెళ్ళింది.

పానకప్పంతులు .అసలాయనపేరు పండరయ్య. గుళ్ళో ఏపండుగాపర్వఒ జరిగినా బిందెనిండా పానకం చేయించి తెచ్చేవాడు, అత్తగారికి చెఱకుతోటఉంది.బెల్లం వ్యాపా రంఉంది  ,కూతురికి పదెకరాల పొలంతో పాటు ఒక ఎకరం పసుపుచేను కూడా రాసిచ్చారు పసుపుకుంకుమలక్రింద. అత్తగారిచ్చిన చెఱకుతోటలో తయారై న బెల్లం ఇరవైగంపలు తెప్పించుకుంటాడు పండరయ్య అత్తగారింటినుండీ . ఇంట్లో అన్నిపండు గలకూ బెల్లపన్నం ప్రత్యేకం, కాఫీ అలవాటు చేసుకుని బెల్లం కాఫీ చప్పరించుకుంటూ  తాగుతాడుఎవరొచ్చినా గర్వంగా బెల్లంకాఫీ పెట్టించి ఇస్తాడు పంచదార దొరకనందున బెల్లంతో ప్రతి పండగకూ పానకంతయారు చేయించడంవలన అతడికి పానకప్పంతులనే పేరు స్థిరపడింది

      రుద్ర , వరమ్మ పానకప్పంతులు గుమ్మలోంచీ లోపలికిచూశారు. ఆయన భార్య  రమాబాయమ్మ  ముఖానికి కొంగుఅడ్డం పెట్టుకుని ఓమూలనిల్చుని ఏడుస్తున్నది. రుద్ర లోపలికెళ్ళిఅత్తా ! మీ సైకిలు పంపు ఒకసారి ఇస్తారేమో అడగుదామని వచ్చానుఅంది . నిజానికి అదికాదు కారణం , ఇంట పంతులు అనవసరంగా ఆమెనుపెడుతున్న ఱంపపుకోత గురించీ తెల్సుకోడంకోసమే లోపలికివచ్చింది రుద్ర, వరమ్మతో కల్సి

    ” ఏం కొనుక్కోలేవూ ! మాషిమాషికీ మమ్మల్ని అడక్కపోతే ? సైకిల్ కొన్నదానివి పంపుకొనుక్కో లేవేం?” అన్నాడు పానకప్పంతులు కారాలూమిరియాలూ నూరు తూనూ.    

మామ ఇక్కడేఉన్నారా? మీరులేరని అత్తనడిగాను. ఏమనుకోకండి మామా! ” అంది

ఐనా మీఆడడలకు పొగరు తలకెక్కిపోతున్నది. మగపురుషుల్లా బజార్నపడ్డారు , మా నాయన అంటుండే వారు,’ధనియాల జాతనిమీఆడజాతి. చెప్పుక్రిందపెట్టి నలపాలిట !లేకపోతే మొలకెత్తవు ధనియాలు మీరూఅఒతే చెప్పుక్రిందపెట్టి తొక్కు తుంటేనే మాటవింటారు. లేకపోతే మగవారిని లెక్క చేయరుస్మీ!” అన్నాడు ఉక్రో షంపట్టలేక.

నిజమా మామా! ఆడచెప్పుక్రిందా! మగచెప్పుక్రిందా మామా! మగచెప్పేఐఉంటుం ది లే! ఔనా ! ఆడ చెప్పుక్రింద పెట్టినలిస్తే మొలకెత్తవుకదా ధనియాలు?”అంది నవ్వుతూనే , వెనకనుండీ వరాలు , రుద్ర బారెడు జడపట్టి వెనక్కుఊరుకోవే తల్లీఅన్నట్లులాగుతూనే ఉంది.      

  ” ఏం పిల్లా ! పరాసికాలాడుతున్నావా? మీ అమ్మాఅబ్బా ఊరిమీద వదిలారాయె పెళ్ళీపెటాకులూ షేయకుండా!”    ఆగ్రహంతో అన్నాడు పానకప్పంతులు  ముక్కె గరేస్తూ .

ఔను మామా ! మీలాంటి మగధీరుడుదొరక్క మాఅమ్మ నాయనగారూ నాకుపెళ్ళి చేయకుండా వది లేశారు. ఏదీమానాయనగారు ఆస్థిపరులుకాదుకదా మీ అత్తారిలా! పదెకరాల చెఱకుతోట, ఎకరం పసుపు తోట ,బెల్లంగంపలూ,పదిపుట్లవడ్లూ  యాడా దికి సరిపడా పప్పులూ, పత్తికట్టలూ  పంపేతాహతులేదాయె ! అదీ మానాయనగారి సమస్య నాకు పెళ్ళిచేయను .పోనీ మామా నన్నూచేసేసుకోరాదూఅత్తకు తోడుగా రెండోమూలచేరి ముఖానికి కొంగడ్దం పెట్టుకుని ఏడుస్తూ నించుంటాను ?” అంది రుద్ర కోపాన్నిపళ్ళ బిగువుననొక్కి పెట్టి పైకిహాస్యంగానే

 ” ఏవే పిల్లా ! పోగరెక్కి మాష్టాడుతున్నావ్  ! హాస్యకాలా! ఔనే మాఅత్తారు దీనిముఖా నికి ఎవ్వరూ మొగుడుదొరక్క నాకుప్రతిఏడాదీ దీన్నిపోషించను అన్నీఇచ్చేట్లు  మాట్లాడుకుని ఈఏడుపుముఖం దాన్నినాకు  కట్టబెట్టారు.” అన్నాడు చొక్కా లేని పెద్ద బానెడు నల్లనిపొట్టనురుద్దుకుంటూ

      ” నీవు అత్తనుపోషించనా? లేక అత్త నిన్నుపోషించనా? అనేవిషయం అందరికీ తెలుసులే మామా! నీకు ఏపనీ లేదుకదా! ఐనా  అత్తముఖం ఎప్పుడూ నవ్వుముఖ మే మామా ! పచ్చని ఆమె ముఖంలో నవ్వుతప్ప మరేదీ ఎవ్వరికీ కనిపించదు ఎప్పు డూనూ ! నీవు నాతో రారాదూ  నేత్ర  వైద్యుని వద్దకు నాసైకిలుమీద ఎక్కించుకెళతాపాపం అత్త ముఖమే నీకుసరిగా కనిపించనట్లుంది .ఇహ  నన్నేం చేసుకుంటావు లే!” అంది రుద్ర.

   “మీ అబ్బఇస్తే అట్టాగేషేసుకుంటా , నాకేం వయస్సై పోయిందనుకున్నావా? చూడు ఎంతబలంగా ఉన్నానో! ” అంటూ తన బలంచూపాడు ఆపానకప్పంతులు.

 ” ఎట్లాఅనుకుంటాను  మామా! ఇంత గట్టిగా అత్తను  వేపుకు తింటుంటే! ఏంచేసిం దని అసలు అమాయకపు అత్త ?”  

ఏంచేసిందా! నాకు తెలీకుండా బస్తాడుబియ్యం ఆవాడ వెధవలకోసం ఇస్తుందాఎంతపొగరు దీనికి  ? అసలు దీన్నికాదే దీన్నికన్నదాన్ననాలి.” 

     ” నోరు పారేసుకోకుగానీ మామా! ఓహ్ అదాఅసలుకధ! నేనే వచ్చిఅడిగాను. ఆ బస్తాలన్నీ ఆమె పుట్టింటినుండీ వచ్చినవేకదా! వాటిపై పూర్తిహక్కు ఆమెకేఉంది. దీనికోసం ఆమెనుతిట్టి ఏడిపిస్తున్నావా?   కొట్టావు కూడానా?” అనుమానంగా ఆమెముఖానికిఉన్న చీరచెరగు తొలగించిచూసింది రుద్ర.ఆమె రెండు ఎర్రటి బుగ్గలమీద ఐదువేళ్ళచారికలూ  కనిపిస్తున్నాయి

 ” ఏమే తిడతానూ, కోడతానూకూడా, అదినాపెళ్ళామే! “ఉగ్రంగా ఊగిపోతూ అన్నా డు పానక ప్పంతులు.

         ” మరి నన్ను చేసుకున్నా ఇలాగే తిట్టి కొడతావా అత్తలాగా?”

పెళ్ళామయ్యాక తిట్టినా కొట్టినా కోసినా పడిఉండాల్సిందే  ధనియాల జాతేమీది, …” పొట్ట తడుము కుంటూ  వెకిలిగానవ్వుతూ అన్నాడు పానకప్పంతులు. ”  

”  ఓహో మరిఈ ధనియాలు కూడా అత్త పొలంనుండే వస్తున్నాయని మరువకు మామా! మెంతులు, మిరియాలూ సైతం అత్తపుట్టింటి నుండేవస్తున్నాయికదా! మాది ధనియాలజాతైతే మీది మిరియాల జాతా?! మెంతుల జాతా? మిరియాలను  రోట్లోవేసిదంచి చారుపెడతాం, మెంతులను వేయించి దంచి కూరల్లోనూ, మెంతి ఆవకాయలోనూ వేస్తాం , వాటిని లొట్టలేసుకుంటూ మీజాతి తినడం లేదామామా?” 

    ” ఏమే పిల్లా! పోనిలే అనుకుంటుంటే మీరిమాట్లాడుతున్నావ్ ? “

నీవే మీరి ప్రవర్తిస్తున్నావ్ మామా! ఇహమీద అత్తనేమన్నా అన్నావో దొరలకు చెప్తాజైల్లో పెడతారు జాగ్రత్త, అత్తసొమ్ముతిని వళ్ళుపెంచుకుంటూ అత్తనే కొడతావ్గాఅత్త నాయనగారికి కబురుచేస్తా, నోరు లేనిదని ఇష్టంవచ్చినట్లు తిట్టి, కొట్టి వేధిస్తావా? ఆమెఆస్థి ఆమెఇష్టం వచ్చినట్లు ఖర్చుచేసుకుంటుంది, కావలిస్తే ఇంకా ఎక్కువ తెప్పించుకుంటుంది , దానధర్మాలు చేస్తుంది, అన్నిపండుగలకు ఒక్కబిందెడు పానకం ఇచ్చిపానకప్పంతులని పేరుతెచ్చుకున్నావ్? పైనచొక్కా ఉండదు, వంటిన మంచిబట్టా ఉండదుపిల్లలా లేరు ఏంచేసుకుంటావ్ ధనం దాచి? అంతా అత్తఇంటినుండీ వచ్చేదేగా ?ఏం వాడవాళ్ళకు అత్త సాయంచేస్తే తప్పా ? మామా! ఇదే నీకు తుదిహెచ్చరిక , అత్తను జాగ్రత్తగా చూసుకున్నావో సరి, లేదంటే దొరలకు కబురెళ్ళుతుంది.” పానకప్పంతులుకు  దొరలంటే మహాభయం అందుకే ఆమాటతో అతడిని లొంగదీయొచ్చని అనుకుంది రుద్ర..

        ద్రమదేవిలా రౌద్రమ్మూర్తై కాళికలా ఊగిపోతూ ఎఱ్ఱబడ్దముఖంతో  ఉరుములు రుము తున్నట్లు చెప్తున్న రుద్రనుచూసి అదిరిపోయాడు పానకప్పంతులు.

ఎందుకుమామా! రుద్రకు కోపం తెప్పిస్తావ్ ? అన్నంతపనీ చేసిదొరలకు కబురం పిందంటే నీపని ఐపోతుంది జాగ్రత్త !ఇహనీబ్రతుకంతా  జైల్లోనే  ” అని వరాలు మాటకలిపింది.

రుద్ర సామాన్యురాలుకాదనీ , మగవారు చేయలేని పనులెన్నో ఎంతో ధైర్యంగా చేస్తున్నవిషయం తెల్సిన పానకప్పంతులు ఆమెఅన్నంతపనీ చేస్తుందనే భయం తో వణికిపోతూలేదులేమ్మా ! ఏదో పరాచికాని కన్నాను, అంతే ! ఇహ మీఅత్తనేమీ అననుగా ! మీవాడకు కావల్సినవి అత్త ఇస్తానంటే అడ్డుచెప్పన్లే. అత్తనేమీ అన నుపువ్వుల్లోపెట్టి చూసుకుంటా ! నామాట నమ్ముఅన్నాడు బ్రతిమాలుతూ.. పానక ప్పంతులు.

 “ఏపువ్వులు బొగ్గులంగడి పువ్వులా? ” అంది రుద్ర నవ్వుతూ..

 ‘ ! ! బొగ్గు లంగడి పువ్వులా? అవేంటీ !  “ అమాయకంగా ముఖంపెట్టి అన్నాడు పానకప్పంతులు

అమాయకం నటించకుమామా! వెళ్ళి తీసుకురానా? బొగ్గులపువ్వులుపెళ్ళికి ముందు నీవుబొగ్గులు కొనేవాడివే….” అంటూ  మర్మగర్భంగా నవ్వుతున్న  రుద్ర వద్దకువచ్చి చేతులుపట్టుకుని,

 ” తప్పైపోయిందమ్మా రుద్రమ్మతల్లీ ! అత్తనేమీఅనను ,నామాటనమ్ము ! మల్లె పువ్వులు ! మల్లె పువ్వుల్లోపెట్టి చూసుకుంటా!” .అంటూ చేతులు పట్టుకున్న పానక ప్పంతుల్ని జాలిగాచూసి.

అట్టాగేలే మావా ! నీవుమా మామవని వదిలేస్తున్నా. వస్తామరి.వస్తానత్తా ! అవసర మనుకుంటే నన్ను కేకెయ్యి.పదవే వరంఅంటూ బయటికి వచ్చిందిరుద్ర. .

ఏంటేరుద్రా ! అంతకోపంగా అలామాట్లాడావ్? మామఅసలే కోపిష్టి నిన్నూతంతా డనుకున్నా! ఐనాఅది వారిఇంటి విషయంకదా నీకెందుకే? అద్సరే ఆబొగ్గులేంటే !? ఆమాటెత్తగానే కంగారుగావచ్చి నీచేతులు పుచ్చుకునిమరీ బ్రతిమాలాడు?” ఆశ్చర్యఒ, ఆసక్తి కలగలిపి అడిగిందివరం రుద్రను.  

        ” ఇంటి విషయమేంటే ! మనతోటి స్త్రీజాతికి జరిగేఅన్యాయం మనం పట్టించు కోకపోతే ఇహమన మేంటే సమాజసేవ చేసేది. పాపంరోజూ అత్తనునానా మాటలూ అంటుంటాడు , అత్త ఏడవనిరోజంటూ లేదనుకో, ‘ఇన్ ఫీరియారిటీ కాప్లెక్స్అంతేఅత్త అందం ముందు తాను తీసికట్టు, పైగా అత్తఇంటి వారు  ఆస్థిపరులు కదా ? అదీమామబాధ. ఇహ అత్తజోలికి రాడుచూడు. నీవడిగావేబొగ్గులని–‘ బొగ్గులమాటెత్తావంటేచాలు నోరుతెరవడు అదొకకధలే ,తర్వాత చెప్తాఅంది రుద్ర.  

 ” రుద్రా! నాకునిద్రే పట్టదే ! ప్లీజ్ చెప్పవూ?”  బ్రతిమాలింది వరాలు.

****

(ఇంకా ఉంది) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.