ఎవరికి ఎవరు
-కాళ్ళకూరి శైలజ
ఆరింటికి ఇంకా వెలుతురు రాని చలికాలపు ఉదయం, గేటు తాళం తీసి నిలుచున్నాను. భద్రం గారు వచ్చారు. “మహేష్! మీ వీర ఇక లేడు’ అన్నారు. “తలుపు తెరిచి ఉంది,ఏ అలికిడీ లేదు.డౌటొచ్చి లోపలికెళ్ళి చూస్తే ప్రశాంతంగా పక్కమీదే నిర్జీవంగా…”
నా చెవుల్లో నిశ్శబ్దం సుడులు తిరిగింది. ఎన్నిసార్లు విన్నా, ఎంత దగ్గరగా చూసినా, మరణం ఒక్కటే ఎప్పుడూ ఒకేలా ఆశ్చర్యపరుస్తుంది. వీర మంచి ఆర్టిస్ట్. అతడిల్లు
మా ఇల్లున్న సందులో మొదటిది. మాది చివరిది.అవడానికి ఇద్దరం సింగిలే.నాకేవో కొన్ని మేచెస్ వచ్చాయి.కుదర్లేదు.అతనికైతే వెనకా ముందూ ఎవరూ లేరు. ఉన్నట్టుండీ మాటెందుకు తోచింది ? బహుశా మనకోసం అంటూ ఏడ్చే నాలుగు అనుబంధాలు ఉండాలని మనసులో ఎక్కడో ఫిక్స్ అయిపోతాం కాబోలు.
మా నాన్నకి వీరా కి ఏదో తెలియని స్నేహం. రోజూ నేను వంట చేసి , లంచ్ బాక్స్ తీసుకుని డ్యూటీ కి 8:30 కి వెళ్తే మళ్లీ సాయంకాలం 5 కే రావడం. హార్బర్ లో జాబ్. నెలలో ఒక వారం నైట్ షిఫ్ట్ కూడా.వీరా ప్రతి రోజూ మా ఇంటికి వస్తాడు. ఏ రోజైనా సూర్యుడు రావొచ్చు, రాకపోవచ్చు గానీ, పదింటికల్లా ట్యూబులు, రంగులు, కాన్వాసు, స్టాండ్ తో సహా మోసుకుని వచ్చేవాడు .
నాన్న పుస్తకం చదువుతూ మధ్య మధ్యలో మాట్లాడతాడు.ఇద్దరికీ బ్రేక్ ఫాస్ట్ నేనే చేసి పెడతాను.టిఫిన్ చేశాక మొదలుపెట్టిన వీర, ఏ మూడు గంటలకో పని ఆపుతాడు.ఒకసారి ఒకే బొమ్మ వారం పది రోజులు పడుతుంది. నాన్నతో కబుర్లు. వీరా నాన్నకి కాలక్షేపం కాదు.నాన్న కి రోజూ దొరికే
అవకాశం.ఓ రకంగా చెప్పాలంటే ఎడమ భుజం, కాలు కూడా: నాన్న పక్షవాతం వచ్చి కోలుకుంటున్నాడు. సుమారు రెండేళ్ళ క్రితం వీర,నేను మా కాలనీ లో కొండమల్లె చెట్టు దగ్గర కలుసుకున్నాం.ఆ పూల వాసనకు దగ్గరగా వెళ్దామని నేను,ఆ పువ్వు కిందపడే సవ్వడి వినేందుకు అతను నిలుచుండగా మాటలు కలిసాయ్.
అతను పాత తరం వాళ్ళ ఫోటోలను బొమ్మలేస్తాడు.పోర్ట్రైట్ పెయింటింగ్స్. శిధిలమై పోతున్న ఫోటోల్లో మచ్చలు, మాపు తీసేసి మళ్ళీ వాళ్ళ రూపాన్ని సృష్టిస్తాడు. ఫోటోలో తగ్గిన జీవకళ వీర బొమ్మల్లో తిరిగొస్తుంది.నగలు,కొప్పు,జరీ చీరెలు,తలపాగా-చేతికర్ర,గడ్డం , మీసాలు …భలే ఉంటాయి. ఆనాటి గోడలు,తలుపులు, కిటికీలు, ఉయ్యాల బల్ల, అప్పుడప్పుడూ వీణ, తంబుర, వింటాజ్ ఫర్నిచర్.. ఇలా.
…” కాలాన్ని గెలిచేది ఇదొక్కటే !”, గర్వంగా తన బ్రష్ చూపిస్తాడు.
అతడు పని వెతుక్కో గా నేనెప్పుడూ చూడలేదు.ఎవరో తెచ్చిస్తారనుకుంటా. ఎందుకంటే వీర కి ఫోన్ లేదు. సాయంకాలం వాకింగ్ కెళ్లి, రాత్రికి నాయర్ హోటల్ లో చపాతీ, పెరుగన్నం పార్సిల్ తెచ్చుకుంటాడు. ఒకోసారి ఊళ్ళు పోతాడు. కొన్ని వారాల పాటు కనబడడు. అప్పుడంతా నాన్న దీర్ఘంగా చూస్తూ ఉండేవాడు. పైకి చెప్పక పోయినా నాన్న కళ్ళల్లో వెలితి కనబడేది.
లోపలికొచ్చి చొక్కా తొడుక్కుని, బయటికి వెళ్ళేలోపు ఇన్ని ఆలోచన లు.వార్త తెలిస్తే నాన్నసలే నీరసంగా ఉన్నాడు. ఇంకా కుంగిపోతాడేమో నని చెప్పకుండానే బయటికి వెళ్లాను.
సావేరి అపార్ట్మెంట్ లో వాచ్మెన్ రూమ్ పక్కన రెండు గదులు.
నలుగురైదుగురున్నారు. భద్రం గారు,
” ఇందాక చెప్పాను కదా! రోజూ వీళ్ళింటికే వెళుతూ ఉండేవాడు”, అని చెప్పారు. పోలీసులు నా వివరాలు అడిగి రాసుకున్నారు. గదుల్లో వెతికినా అతని బంధువుల ఎడ్రస్ ఏదీ దొరకలేదట. నన్ను కూడా వీర సంబంధీకులు ఎవరైనా తెలుసా అని ప్రశ్నించారు. స్వచ్ఛంద సేవా సంస్థ ‘దీనబంధు’ వాళ్లు వాన్ లో వచ్చారు. నేను నిర్లిప్తంగా లోపలికెళ్ళి చూశాను. అతడు ఎంత ప్రాక్టికల్ మనిషో అక్కడున్న టేబుల్ మీదున్న ‘ఇన్’, ‘అవుట్’ ట్రేలు చెబుతున్నాయి. పెద్ద గవర్నమెంట్ ఆఫీస్ లో లాగా బిల్డప్!
ఇన్ లో ఏం లేవు: అంటే కొన్నాళ్లుగా ఎవరి దగ్గర ఏ పని ఒప్పుకోవటం లేదన్న మాట.ఔట్ లో ఒక పది దాకా రఫ్ స్కెచెస్ ఉన్నాయి. టేబుల్ మీద ఉన్న ఫైల్ లో పేపర్స్ చెదిరిపోయాయి. ప్రసిద్ధ చిత్రకారుల గురించి కొన్ని బుక్స్, డౌన్లోడ్ చేసి ప్రింట్ చేసుకున్న కొన్ని పెయింటింగ్స్ ఫోటోలు కనబడ్డాయి. నిజానికి వీర గదే ఒక స్టిల్ లైఫ్ పెయింటింగ్ లా ఉంది.రెండో గదిలో మంచి నీళ్ల కుండ.దాని మీద కూడా రంగులే! కాడ గరిట మూత మీద బోర్లించి ఉంది. పక్కన సిమెంట్ బల్ల మీద గ్లాసులు,ప్లేట్స్.ఒక ఇగ్నిషన్ స్టౌ,కుక్కర్ వగైరా.
ఒక అట్టపెట్టె లో అరటిపళ్ళు, యాపిల్స్ ఉన్నాయి. అక్కడున్న అలమార లో పోలీసులు వెతకడం కోసం అస్తవ్యస్తం చేసిన బట్టలు.అంతే.
ఇంత తక్కువ సామాను తో అతనెలా బతికేడో! నిజానికి మనం కూడా ఇలాగే బతకొచ్చు…అనిపించింది. ఆడంబరంగా ఉండటం, నిరాడంబరత్వం రెండూ అంటువ్యాధు లే. ఏది చూసినా అలా చేయాలి అనిపిస్తుంది. ఇప్పుడేం చేయాలి ఈ ఉన్న వాటిని?
డాక్టర్ వచ్చి, పరీక్షించి,”ఏ అర్ధరాత్రో నిద్రలో జరిగినట్టుంది. తలుపు తీసి పడుకున్నారా? ఆశ్చర్యం!” అన్నారు.
వాచ్ మాన్,” నేను ఆయన కబుర్లు చెప్పుకున్నాం.ఆయన పడుకున్నారని తలుపు దగ్గరగా వేసి పదకొండు ప్రాంతంలో వెళిపోయాను.సార్” అన్నాడు.
” ఓకే.న్యూస్ పంపాలి.అది చూసి ఎవరైనా వస్తారేమో చూడాలి. పబ్లిక్ చేద్దాం”,అన్నారు సి.ఐ గారు.
“కార్నియా పనికొస్తుందేమో?”, నేను అడిగాను.డాక్టర్ పెదవి విరిచాడు.
పనికిరాదట.
“లా ప్రకారం మార్చురీలో మూడు నెల్లుంచాలి”, పోలీసులు చెప్పారు .
” సరేనండీ.మాకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడే వస్తాం”, ‘దీనబంధు’ సెక్రెటరీ ప్రకటించి కదిలారు .
ఎవరికి వారు వెళ్లిపోయారు.నేను కానిస్టేబుల్ తో గవర్నమెంట్ ఆసుపత్రి కి వెళ్లాను.అక్కడ పనై వచ్చేసరికి, సుమారు మూడున్నర అయింది.
బాధగా ఉంది గానీ, ఏడుపు రావట్లేదు. చాలా ఏళ్ల నుంచి మళ్ళీ మళ్ళీ వినే కథలో, ఒక ముఖ్యమైన పాత్ర కనుమరుగైనట్టుగా ఉంది. రోడ్ మీద వెళ్తున్న వాళ్ళల్లో ప్రతిరోజు ఎదురయ్యే వారు ఒక్కోసారి నెలలపాటు కనబడరు. కొన్నాళ్ల తర్వాత కొంతమంది కనబడతారు. మరికొందరు ఇంక కనబడనే కనబడరు.అలవాటు కొద్దీ వాకింగ్ లోనో, ట్రాఫిక్ లైట్స్ దగ్గరో ఎదురయ్యే వాళ్లు కూడా అంతే. అంతా తెలిసినట్టే ఉంటుంది, కానీ తెలీదు.అసలు వీర ఎలా చనిపోయాడు? అని నాకు అనుమానం వచ్చింది.పోలీస్ కే ఏం క్లూస్ దొరకలేదు.కాళ్ళీడ్చుకుంటూ ఇంటికెళ్ళాను.
“అదేంటివాళ చెప్పాపెట్టకుండా వెళిపోయావ్?” అన్నాడు నాన్న.
“పైగా…”ఏదో చెప్పబోతుంటే నేను నాన్న పక్కన కూలబడి,”వీరు చచ్చిపోయాడు నాన్నా!”అంటూ ఏడ్చాసాను.ఆయన నా వీపు మీద రాస్తూంటే ఇద్దరం కాసేపలా ఉండిపోయాం .
“సరే మహీ, ‘ఆ రోజు’ ఇదేనా?”
“అంటే, నీకు ముందే తెలుసా నాన్నా?
“గత రెండు నెలలుగా ‘ఆ రోజు’ అనే కాన్సెప్ట్ చెప్తూనే ఉన్నాడు. వాడొక బాబూ మషాయ్ !”,అంత బాధ లోనూ కళ్ళు చికిలించి,”ఇదిగో వాడి ఫైల్”అంటూ అందించాడు నాన్న.
“గత రెండు నెలలుగా ‘ఆ రోజు’ అనే కాన్సెప్ట్ చెప్తూనే ఉన్నాడు. వాడొక బాబూ మషాయ్ !”,అంత బాధ లోనూ కళ్ళు చికిలించి,”ఇదిగో వాడి ఫైల్”అంటూ అందించాడు నాన్న.
నిర్ఘాంత పోయాను.
“అదే మరి! ఏదో హార్ట్ లో దోషం ఉందంట.టెస్ట్ చేయించుకోవడానికి హైదరాబాద్ వెళ్లినవాడే.”.ఫైల్ లో అతని ఆరోగ్య పరిస్థితి గురించిన వివరమైన రిపోర్ట్స్ ఉన్నాయి. పేస్ మేకర్ పెట్టించుకోవాలని, లేకపోతే హఠాన్మరణం రావచ్చని,ఏదో ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ ఉందనీ , ఆ విషయం పేషెంట్ కి అర్థమయ్యే భాషలో చెప్పామని. అతను వద్దన్నాడని కూడా రాసి, కింద వీర సంతకం పెట్టించి ఉంది.
“అదే మరి! ఏదో హార్ట్ లో దోషం ఉందంట.టెస్ట్ చేయించుకోవడానికి హైదరాబాద్ వెళ్లినవాడే.”.ఫైల్ లో అతని ఆరోగ్య పరిస్థితి గురించిన వివరమైన రిపోర్ట్స్ ఉన్నాయి. పేస్ మేకర్ పెట్టించుకోవాలని, లేకపోతే హఠాన్మరణం రావచ్చని,ఏదో ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ ఉందనీ , ఆ విషయం పేషెంట్ కి అర్థమయ్యే భాషలో చెప్పామని. అతను వద్దన్నాడని కూడా రాసి, కింద వీర సంతకం పెట్టించి ఉంది.
నాన్న ఒక పర్సు నా చేతికి అందించాడు.కాసిన్ని నోట్ల వెనుక,లేత నీలం రంగు చూడీదార్ లో, స్నేహంగా నవ్వుతున్న కళ్లతో ఒకమ్మాయి ఫోటో.
“తను రత్న . హైదరాబాదు లో ఏషియన్ ఇనిస్టిట్యూట్ అఫ్ ఆర్ట్ అండ్ కల్చర్ కాలేజీ హాస్టల్ లో ఉంటుంది.మన వీర ఈ అమ్మాయికి స్పాన్సరర్.ఫోన్ చేసి చెప్పాలి”, అన్నాడు నాన్న.వీరా కి నాన్నకి ఉన్న సాన్నిహిత్యం నన్ను అబ్బురపరిచింది.
ఎంత సిధ్ధ పరిచి ఉంటాడో నాన్నని!
అక్కడున్న ఫోన్ నెంబర్ కి చేసి మేట్రన్ ని పిలిపించి,వార్త చెప్పాను.
రత్న ని ఆన్లైన్ లోకి పిలిచి మాట్లాడాను.
మర్నాడు ఉదయం పదకొండు గంటలకల్లా రత్న బస్ దిగింది. ముందుగా పోలీస్ స్టేషన్ కెళ్లి వీర ఫైల్ అందజేసి, అందులో ఉన్న వీలునామా,తాను ఎప్పుడైనా హఠాత్తుగా మరణించివచ్చు, ఈ విషయం తనకు పూర్తిగా తెలుసు అని ప్రకటించిన వీర స్వదస్తూరితో ఉన్న ఉత్తరాన్ని అందజేశాం.వాళ్ల అనుమతి తో అంతిమ సంస్కారాలు కూడా పూర్తయ్యాయి.
రత్న ను బస్సు ఎక్కించేందుకు బస్సు స్టాండ్ కి వెళ్ళాను .
“నేను ఎయిత్ క్లాస్ లో ఉండగా వీరేంద్ర అంకుల్ మా బడికి బొమ్మలు నేర్పేందుకు వచ్చారు.అప్పటినుంచి ఆయన నాకు స్పాన్సర్ చేసారు . ఇప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్”.
“ఓహో! ఏం సబ్జెక్ట్?”, అడిగాను.
“బి ఆర్క్”,వస్తున్న బస్సు కేసి చూస్తూ చెప్పిందా అమ్మాయి.
వీరేంద్ర జీవన సాఫల్యం నాలో, లోలోపల నిండిపోతున్నట్టుంది. జీవితం,మరణం అనే రెండు చుక్కల నడుమ సరళరేఖ లా, వీర కనబడుతున్నాడు.
రత్న ను బస్సు ఎక్కించేందుకు బస్సు స్టాండ్ కి వెళ్ళాను .
“నేను ఎయిత్ క్లాస్ లో ఉండగా వీరేంద్ర అంకుల్ మా బడికి బొమ్మలు నేర్పేందుకు వచ్చారు.అప్పటినుంచి ఆయన నాకు స్పాన్సర్ చేసారు . ఇప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్”.
“ఓహో! ఏం సబ్జెక్ట్?”, అడిగాను.
“బి ఆర్క్”,వస్తున్న బస్సు కేసి చూస్తూ చెప్పిందా అమ్మాయి.
వీరేంద్ర జీవన సాఫల్యం నాలో, లోలోపల నిండిపోతున్నట్టుంది. జీవితం,మరణం అనే రెండు చుక్కల నడుమ సరళరేఖ లా, వీర కనబడుతున్నాడు.
****
డాక్టర్ కాళ్ళకూరి శైలజ. MBBS: కర్నూలు మెడికల్ కాలేజీలో పీ.జీ.: రంగరాయ మెడికల్ కాలేజీ లో General Surgery, DNB.Laparoscopic Surgery.FCGP ,FIAGES ప్రస్తుతం: అసోసియేట్ ప్రొఫెసర్ రంగరాయ మెడికల్ కాలేజీ, కాకినాడ లో పనిచేస్తున్నాను.
మేడమ్ మీ శైలి అద్భుతం .ఆపకుండా చదివించే లక్షణం ఉంది దానికి .కథ హృద్యంగా ఉంది .అప్పుడే అయిపోయిందా అన్నట్టుంది. కథ గుండెని రెండు నిమిషాల సేపు పిండేసింది .కథ ముగింపు చాలా చాలా బాగుంది .జనన మరణాల సరళరేఖ చక్కగా గీసారు .
Thanks Mam 🙏
కథ సున్నితంగా రాయగలగడం శైలజా గారి సృజనశైలి యొక్క అద్భుతమైన గుణం. ఆ సున్నితం వెనుక సూధీర్ఘంగా కేంద్రీకృతం చేసిన ఒక సిద్ధాంతం ఉండి. వీర గదిని మాటల చిత్రం వేసినట్టు రాసారు. తన కళలతో కాలాన్ని ఎదిరించిన వీరుడు వీరా. ఎలా ఐతే తన పెయింటింగ్స్ ని శిధిలం చేసాడో వీరా, తన ఆనందాన్ని మహేష్ నాన్నతో, తన అవయవాలని సమాజంతో, తన ఆశయాన్ని రత్నతో… పంచుకుని తను కూడా తన పెయింటింగ్స్ లా శిధిలం అయ్యాడు
Thankyou very much Uttej. 🌻
గొప్ప కథండీ