డొక్కా సీతమ్మ వితరణ

(1841-1909)

-ఎన్.ఇన్నయ్య

పేరులో ఆకర్షణ లేదు. అయినా ఇండియాను పాలించిన ఏడవ ఎడ్వర్డ్ చక్రవర్తిని ఆకట్టుకొన్నదంటే విశేషమే. ఒకనాడు రాజప్రతినిధిగ ఒక అధికారి తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట గ్రామానికి వచ్చి, రాజు పంపిన ఆహ్వానాన్ని అందించాడు. ఇంగ్లండ్ వచ్చి పట్టాభిషేకం చూసి తాను ఇచ్చే బహుమానాన్ని స్వీకరించమని దాని సారాంశం. ఇది 2008లో జరిగిన విశేషం.

డొక్కా సీతమ్మ అతి నమ్రతతో ఆహ్వానాన్ని అంగీకరించలేనని, ఇంగ్లండ్ రాలేనని జవాబు పంపింది.

బ్రిటిష్ చక్రవర్తి ఎడ్వర్డ్ ఆహ్వానం పంపడానికి కారణం డొక్కా సీతమ్మ చేస్తున్న ఆతిథ్య కార్యక్రమం గురించి ఆకర్షితుడై – గౌరవించడానికి పిలిచాడు. డొక్కా సీతమ్మ చేస్తున్న సేవల్ని తెలుసుకున్న ఎడ్వర్డ్ చక్రవర్తి ఆమెకు ఆహ్వానం పంపాడు. ఆ విశేషాలు గమనిద్దాం.

డొక్కా సీతమ్మ ప్రాథమిక విద్య మాత్రమే చదివి, పెళ్ళి చేసుకుని, సంసార జీవనం గడిపింది. ఆమెను పెళ్ళి చేసుకున్న డొక్కా జోగన్న సాధారణ కుటుంబీకుడు.

సీతమ్మ కేంద్రీకరించిన కార్యక్రమం ఒక్కటే.  ఎవరైనా ఆకలితో వచ్చి, అన్నం పెట్టమని ఏ సమయంలో అడిగినా, అప్పటికప్పుడు వండి పెట్టడం సీతమ్మ విధిగా చేసేది. అలా వచ్చేవారు దొంగలా, దొరలా అని విచక్షణ ఆమె పాటించేది కాదు. ఒక్కోసారి దోపిడీ దొంగలు రాత్రిళ్ళు వచ్చి, అన్నం పెట్టమని అడిగి, తిని వెళ్ళేవారు.  డొక్కా సీతమ్మ సనాతన బ్రాహ్మణ కుటుంబీకురాలైనా, కుల పట్టింపులు పాటించకుండా, అన్నం పెట్టేది. విసుక్కోకుండా అర్థరాత్రి అయినా అప్పటికప్పుడు వండిపెట్టేది.

డొక్కా సీతమ్మ వితరణ బాగా పాకిపోయింది. అలాగే ఆమె పేరు కూడా కథలోకి ఎక్కి విస్తృత ప్రచారం జరిగింది. పాఠ్య గ్రంథాలలో ఆమెను గురించి చక్కని కథలు వచ్చాయి.

వినతేయి నదీ ప్రాంగణంలో ఆమె విగ్రహాన్ని స్థాపించి, గౌరవించారు. చనిపోయేవరకూ అడిగిన వారికి అన్నం పెట్టిన డొక్కా సీతమ్మ చివరలో కాశీయాత్ర కోరుకొని, అక్కడే మరణించింది.

సీతమ్మ భర్త జోగన్న ఆమెకు పూర్తి సహాయ సహకారాలు అందించి, తోడ్పడ్డారు.

1909 ఏప్రిల్ 28న కాకినాడ వివేకానంద పార్కులో డొక్కా సీతమ్మ విగ్రహాన్ని పెట్టి గౌరవించారు. పట్టాభిషేకానికి వెళ్ళలేని డొక్క సీతమ్మ ఫోటోను ఒక కుర్చీపై పెట్టి, ఉత్సవంలో ఉచిత రీతిని గౌరవించడం విశేషం. పాఠ్య గ్రంథాలలో డొక్కా సీతమ్మ దాతృత్వం గురించి విశేష ప్రచారం జరిగింది.

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.