ఎప్పటికి వస్తుంది స్వేచ్ఛ ?

-శ్రావణి బోయిని

పుట్టగానే ఆడపిల్ల అన్నారు …

నేను పుట్టగానే అమ్మని తిట్టారు …

పక్కవారి తప్పు ఉన్నా, నా వైపు వేలు చూపిస్తారు …..

నల్లగా పుట్టినందుకు వివక్షతో చూసారు …

పెరుగుతున్నపుడు ఇంటి నుండి బయటకి వెళ్ళకు అన్నారు …

చదుతున్నపుడు చదివి ఎవరిని ఉద్ధరిస్తావ్ అన్నారు…

ఆడుకునే వయసులో అబ్బాయిలు ఉంటారు జాగ్రత్త అన్నారు…

కాలేజీకి వెళ్ళే వయసులో చూపులు  జాగ్రత్త అన్నారు…

మనసుకి నచ్చినట్టు ముస్తాబు అయితే  ఎవరి కోసం అన్నారు …

బాధ పడితే ఇది తప్ప ఏం చేతకాదు అన్నారు…

ధైర్యంగా ముందుకు వెళ్తే తెగించావ్ అన్నారు …

తోటి వాళ్ళతో నవ్వుతు కనిపిస్తే గుణం బాలేదు అని అన్నారు ….

నష్టం వస్తే దురదృష్టవంతురాలు పుట్టింది అన్నారు …

నచ్చిన దారి ఎంచుకుంటే  నీకు ఏం తెలీదు అని అన్నారు….

నచ్చిన దుస్తులు వేసుకుంటే  సంస్కారం లేదు అంటారు …

ఎదురు తిరిగి  నిలబడితే స్వభావం బాలేదు అన్నారు….

పెళ్ళి చూపుల్లో కూర్చుంటే అమ్మాయి నచ్చిందా అని అడిగారు….

నచ్చిన మనిషిని ఎంచుకుంటే గుణం బాలేదు అంటారు …

పెళ్ళి అయ్యాక భర్తకు నచ్చినట్టు నడుచుకోమని అన్నారు…

పిల్లలు పుట్టాక పిల్లలకి నచ్చినట్టు మెలుగు అన్నారు…

ఎన్నాళ్ళు ఇలా ….

ఇలా ఎన్ని రోజులు మనసు కి స్వేచ్ఛ లేకుండా మెలగాలి …

మనసుకి నచ్చినట్టు స్వేచ్ఛగ బతికేది ఎప్పుడు…

నచ్చిన ఉదోగ్యం చేసేది ఎప్పుడు ….

నచ్చిన చదువు చదివేది ఎప్పుడు ….

ఇలా జీవితం మొత్తం పక్క  వారికి నచ్చినట్టు ఉంటె తన బతుకు బతికేది ఎప్పుడు ….

ఎప్పటికి వస్తుందో మనసుకి స్వేచ్ఛగా బతికే స్వతంత్రం? !

*****

Please follow and like us:

3 thoughts on “ఎప్పటికి వస్తుంది స్వేచ్ఛ ?”

  1. Stree swaatantraanni samaajam enni rakaaluga maatalatho kattestundo baaga vivarincharu. Small suggestion: “బాలేదు అని అన్నారు” , “లేదు అంటారు” ila padaalu break cheyakunda, “బాలేదన్నారు” , “లేదంటారు” ani raaste chadavaadiniki flow baaguntundi ani naa abhipraayam.

Leave a Reply

Your email address will not be published.