చిత్రలిపి

జీవనయానం !

-మన్నెం శారద

పడుతూనేవున్నాను… అప్పడు నడక రాక..
ఇప్పుడు నడవలేక!
 
పడుతూనే వున్నాను … పసివయసులో
ఎంతదూరం వస్తాడో చందమామ నాతో అని ….
పరుగులెత్తి పరుగులెత్తి .
..
బారెడు తోకతో
ఆకాశమే హద్దుగా రంగులహంగుతో
ఆటలాడే గాలిపటం కోసం ఆకాశంకేసి చూస్తూ….
పడుతూనేవున్నాను …పళ్ళు రాలగొట్టుకుంటూ
ఏ చెట్టునో, పుట్టని ఢీ కొని !
 
పడుతూనేవున్నాను …నేటికీ నాటికి
అయినవారు గుచ్చిన కంటకాలను తొలగించుకుని కన్నీరు పెడుతూ ..
 
కరడుగట్టిన కఠిన పాషాణ హృదయాల పాచి హృదయాలమీదుగా
జారుతూ …పోరుతూ ….
 
పడుతున్నాను పడుతున్నాను
పడుతూనే వున్నాను
అయినా నడుస్తూనే వున్నాను ఆనాడు పెద్దల చేయూతతో
నేడు పిన్నల భుజాల ఆసరాతో.!
..పడిలేచే కెరటమై ప్రాణమున్నంతవరకు సాగించే నడక ఇది !
 
****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.