ప్రముఖ రచయిత్రి డా.ఆలూరి విజయలక్ష్మి గారితో నెచ్చెలి ముఖాముఖి

-డా||కె.గీత

డా.ఆలూరి విజయలక్ష్మి తెలుగు పాఠకులకి పరిచయం అవసరం లేని పేరు.  వీరు ప్రముఖ రచయిత్రే కాకుండా ప్రముఖ వైద్యనిపుణులు, సంఘసేవకులు కూడా.  1967లో విశాఖపట్టణంలోని ఆంధ్ర వైద్య కళాశాలలో  ఎం.బి.బి.ఎస్, 1970లో పాట్నాలోని ప్రిన్స్ వేల్స్ వైద్య కళాశాలలో ప్రసూతి శాస్త్రం, గైనకాలజీలు ప్రధాన అంశాలుగా ఎం.ఎస్. చదివారు. 1971లో రామచంద్రాపురంలో గైనకాలజిస్టుగా కొంతకాలం పనిచేసి, తరువాత కాకినాడలో ప్రసూతి వైద్యం ప్రధానంగా నర్సింగ్ హోమ్‌ను నాలుగు దశాబ్దాలకు పైగా నడిపి, ప్రస్తుతం హైదరాబాదులోని ఛీఫ్ గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేశారు.

డా.ఆలూరి విజయలక్ష్మి గారు దాదాపు 150 కథలు, 5 కథా సంపుటాలు, 4 నవలలు, 3 వైద్య సంబంధ గ్రంథాలు రాశారు. అనేక అనువాదాలు చేశారు. శీర్షికలు నిర్వహించారు. వీరి రచనలు వివిధ వార, పక్ష, మాస, దినపత్రికలలో ప్రచురితమయ్యాయి. కొన్ని కథలు ఆకాశవాణి విశాఖ పట్టణం, విజయవాడ కేంద్రాల నుండి ప్రసారమయ్యాయి.

వీరి రచనలు:
నవలలు:
సజీవ స్వప్నాలు
చైతన్య దీపాలు
ప్రత్యూష పవనం
వెలుతురు పువ్వులు

కథా సంపుటాలు:
మీరు ప్రేమించలేరు
మాకీ భర్త వద్దు
పేషెంట్స్ చెప్పే కథలు
అగ్ని కిరణం
జ్వలిత
THE WAR (ఆంగ్లం)
BATTLE FIELD (ఆంగ్లం)

వైద్యవిజ్ఞాన గ్రంథాలు:
మాతృత్వం
మన దేహం కథ
కౌమార బాలికల ఆరోగ్యం

అనువాద గ్రంథాలు:
వైద్యుడు లేనిచోట
మనకు డాక్టర్ లేనిచోట
మానసిక వైద్యుడు లేనిచోట
తాబేలు మళ్ళీ గెలిచింది
తుంప మరియు పిచ్చుకలు
యోగాతో నడుమునొప్పి నివారణ

పురస్కారాలు & బహుమతులు:
1993 – పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము వారిచే మహిళాభ్యుదయ రంగంలో కీర్తి పురస్కారం
1993 – వీరేశలింగం అభ్యుదయ రచయిత్రి పురస్కారం
1992, 1993 – ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ శాఖచే ఉత్తమ వైద్యపుస్తక రచన అవార్డు
1994 – కోడూరి లీలావతీదేవి స్మారక సాహిత్య పురస్కారం
1996 – ఆంధ్ర మెడికల్ కాలేజి పూర్వ విద్యార్థుల సంఘం వారిచే సత్కారం
1997 – అల్లూరి సీతారామరాజు సాహిత్య కళావేదిక ప్రజ్ఞ పురస్కారం
1999 – ఎస్.బి.ఎస్.ఆర్.కళాపీఠం, తాపేశ్వరం వారిచే సాహిత్య పురస్కారం
2001 – ఇన్నర్ వీల్ క్లబ్ వారిచే మేటి మహిళ పురస్కారం
2002 – ఔట్ స్టాండింగ్ రోటరీ ప్రెసిడెంట్ అవార్డ్
2002 – సీతారామరాజు కళావేదిక, రాజమండ్రి వారిచే ఆంధ్రశ్రీ పురస్కారం.
2004 – మెగాసిటీ నవకళావేదిక వారిచే వైద్య శిరోమణి పురస్కారం
2004 – కౌమార బాలికల ఆరోగ్యం, వసతుల అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నిర్వహించిన పోటీలో విజేత
2009 – ఆంధ్ర నాటక కళాసమితి, విజయవాడ వారిచే నన్నపనేని లక్ష్మి స్మారక పురస్కారం
2011 – త్రిపురనేని రామస్వామి చౌదరి సాహిత్య వేదిక వారిచే సావిత్రీబాయి ఫూలే & దుర్గాబాయి దేశ్‌ముఖ్ వారసత్వ పురస్కరం
2012 – ఆంధ్ర సారస్వత సమితి సాహిత్య పురస్కారం
2013 – జ్యోత్స్న కళా పీఠం వారి కథా పురస్కారం
2016 – జ్యోత్స్న కళా పీఠం వారి నవలా పురస్కారం
2019 – కవి సంధ్య సాహిత్య పురస్కారం
పదవులు:
ప్రెసిడెంట్ – చైతన్య వనితా మండలి
ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ – సెంటర్ ఫర్ ఎంపవర్‌మెంట్ అండ్ డెవెలప్‌మెంట్ ఆఫ్ ఉమెన్ (CEDOW)
ప్రెసిడెంట్ – ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కాకినాడ చాప్టర్
ప్రెసిడెంట్ – రోటరీ క్లబ్ కాకినాడ
డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ – నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్

*****

Please follow and like us:

3 thoughts on “ప్రముఖ రచయిత్రి డా.ఆలూరి విజయలక్ష్మి గారితో నెచ్చెలి ముఖాముఖి”

  1. Dr. Vijaya Lakshmi, what an inspirational talk! I am amazed to hear your achievements. Your energy, enthusiasm, drive and service have no bounds! Hats off to you! What is your secret? We all can learn a lot from you. Thanks Geeta for this wonderful and very informative interview.

Leave a Reply

Your email address will not be published.