రుద్రమదేవి-4 (పెద్దకథ)

-ఆదూరి హైమావతి

          రుద్ర సైకిల్ ఆపగాముందు వరాలు దిగిందిరుద్ర సైకిల్ స్టాండ్ వేశాక  ఇద్దరూ మెల్లిగా నడుస్తూ కపిల బావివద్ద కెళ్ళారు. వారిని అనుకోకుండా అక్కడ చూసిన అమ్మాయి దూరంగా చాటుకు వెళ్ళ బోయింది . ఒక్క మారు రుద్ర కంట పడితే  తప్పించుకోను ఎవరి వల్లా కాదని ఆచుట్టుపక్కల  అందరికీ తెల్సు. అమ్మాయి ఎంత ప్రయత్నించినా రుద్ర గబగబావెళ్ళి చెయ్యి పట్టుకుంది .ముఖం చూసి ఆశ్చర్యపోయింది.  

          “నువ్వా సుబ్బూ!ఏం చేస్తున్నావిక్కడ ! సమయంలో ?” అనుమానంగా అడిగింది. ‘రుద్రను, వరాన్నీ చూడగానే  రెండు చేతుల్లో ముఖం ఉంచుకుని భోరుమని ఏడ్వసాగింది సుబ్బులు.  

          “బావిలో దూకుదామనివచ్ఛావ్ కదూ! ఏమే రుద్ర నీ స్నేహితురాలని మరచావా?” అని రుద్రాఏమంత కష్టమొచ్చిందేనీకు ఆత్మహత్య చేసుకోను !అదెంత పాపమో మనం తెలుగు పాఠంలో చదువుకో లేదూ!?ఐనానీకు మేంలేమా!?”అని  వరాలూ బుజ్జగిస్తూ అడిగారు.

          సుబ్బుల్ని భుజంతట్టి చెయ్యి పట్టుకుని రోడ్డు వద్దకు నడిపించారు ఇద్దరూకల్సి. చెట్టుక్రింద కూర్చోబెట్టారు .

          “సుబ్బూ! ఏంజరిగింది? ఎందుకోసం నీవిలా కపిల బావిలో దూకాలని వచ్చావుఏం కష్టం వచ్చింది? మాతో చెప్పు.” అంటూ స్నేహంగా అడిగింది రుద్ర.

          మెల్లిగా ఏడ్పుఆపుకునిరుద్రా! ఎలా చెప్పాలో తెలీడంలేదు. మా ఇంట్లో మావదిన తమ్ముడు ఉన్నాడు కదా? వాడు నన్నుఎవ్వరూ లేనపుడు తాకాలని ప్రయత్నిస్తాడు. వెకిలి నవ్వు నవ్వుతాడు, కళ్ళు ఆర్పు తాడు ,ఏదో సైగలు చేస్తాడు. ఎవ్వరితో చెప్పుకోను?మా అమ్మ ఉండి ఉంటే నేనిలా అసహాయంగా ఉండే దాన్నామా నాయనగారు  పక్షవాతంతో మంచానపడటం , మా అన్నభార్యమాటే వేదంగా భావించి ఆమె ఏమిచెప్తే అదేనమ్ముతాడు. మానాయన గారికి ఇంత అన్నం వేళకు పెట్టనే ఆమె బాధపడుతూ ఏదేదో అంటుంటుంది .ఆయనకోసంనేను అన్నీ భరిస్తున్నాను. లేకపోతే మా అమ్మమ్మ ఇంటికెళ్ళిపోయేదాన్ని.” అని మళ్ళాసుబ్బులు భోరు మని ఏడ్వసాగిందిరుద్ర సుబ్బును ఓదార్చుతూనీవేం దిగులుపడకు. చూద్దాం  ఏదైనామార్గం దొరక్క పోదు. ” అంది. వరాలుసుబ్బూ! నీవిహ దిగులు వదిలెయ్ ! రుద్రచెవిన పడిందంటే ఆమె మెరుపు వేగంతో చకచకా  సర్దుబాటు  చేసేస్తుంది. పద వెళదాం!అంటూ చెయ్యిపట్టి లేపింది..

          “ఇప్పుడు ఇంటికి వెళితేఇంతసేపూ ఎక్కడున్నావని మావదినమ్మ కోప్పడుతుంది…” అంది సుబ్బులు

          “కోప్పడటమే  కాదు, కొడుతుంది కూడా మాకుతెల్సులే. ఔనా!” అడిగింది వరాలు.

          ఔన్నన్నట్లు తల ఊపింది సుబ్బులు.” సరే ముందు వరాల్ని ఇంట్లోవదలి నేను వచ్చి నిన్ను దింపుతానుచూస్తాను నిన్నుఎవరే మంటారో! పద వెళదాంఅంది రుద్ర

          ముగ్గురూ నడుచుకుంటూ వరాల్నిఇంట్లో వదిలాక , రుద్ర సుబ్బుల్నిసైకిలుమీద  వెనక ఎక్కించుకుని  ఆమె ఇంటి వైపుతొక్కసాగింది.ఇంటి ముందు సైకిలు స్టాండు వేసి , ముందు సుబ్బుల్ని వెళ్ళమంది, సుబ్బులు భయంభయంగా వీధిగుమ్మందాటి లోపలఅడుగు పెట్టగానే ,ఆమె వదిన , మాణిక్యం బయటే కాచుక్కూచున్నట్లుందిగుమ్మంవద్దకే వచ్చిఏమే! వీధులన్నీ ఎవరితో తిరిగి వస్తున్నావ్?” అంటూ జడ పట్టిలోపలికి లాగింది . నొప్పితోఅమ్మా! ” అని అరిచింది సుబ్బులు.

          వెంటనే రుద్ర లోపలఅడుగు పెట్టిఅక్కా! సుబ్బులుతో నేనే గుడికి తోడు వెళ్ళాను. అది పాపం ఈరోజు మావదిన  పుట్టినరోజు గుడికెళ్ళను తోడు ఎవరూ లేరని బాధ పడుతుంటేనూ.. నాకెందుకు పొద్దుటే చెప్పలేదని  కోప్పడ్డానుకూడా! లేకపోతే ఈరోజు పుట్టినరోజైన  ఉత్తమగృహిణులకు మాస్పందన’  సంస్థ వాళ్ళం గుళ్ళో సన్మానంచేశాం  అక్కా ! నీకూ చేయించేదాన్ని , నీవెంత మంచిదానివి! నీపేరే మాణిక్యం ! గుణంబంగారం. తల్లిలేని  మరదల్ని కడుపులో పెట్టుకు సాకుతున్నావ్ ! మంచంలో పడి ఉన్నమామగార్ని ఎంతబాగా చూసుకుంటున్నావ్? నీ అంత మంచివదిన మా సుబ్బులుకు దొరకడం దాని అదృష్టం .” అంటూ  పొగడటంతో పొంగి పోయింది మాణిక్యం .

          “మాఅమ్మే ! నీవు గనుక నన్నుఅర్ధం చేసుకున్నావ్ ! ‘తల్లి లేని పిల్లను అదుపు చేయకుండా గాలికి వదిలేసింది వదిన గనుకఅంటారని కాస్తకోప్పడు తుంటాగానీ, సుబ్బు అంటే నాకెంత ప్రేమో తెల్సా? ” అంటూ సుబ్బుల్ని మురిపెంగా ముద్దాడింది.

          “మీతమ్ముడు డుమ్మడు. అదే నీవలా పిలుస్తావుకదక్కా ప్రేమగా!ఏంచేస్తుంటాడు?”

          “ఏవుందమ్మా  చేయను ? ఎవరిప్పిస్తారు నౌకరీ?”

          “రేపు మాఇంటికి పంపు మానాయన గారికి చెప్పి  చేనేత వస్త్రాలయంలో ఎదైనా నౌకరీ వేయిస్తా, మగ పిల్లాడు అలాతిని కూర్చుంటే రేపు పిల్లనెవరు ఇస్తారు చెప్పు?” అనగానే మాణిక్యం గబుక్కున రుద్ర చేతులు పట్టుకునిమా బంగారానివి కదూకాస్త ఆసాయం చేసి పెట్టమ్మా ! వెధవ తిని నట్టింట్లో  నులక మంచం యిరగ దీస్తున్నాడు, వ్యాపకం లేదమ్మా ! అందుకే ! ‘పని ఇప్పిస్తే  చేసుకోనూ బంగారంగా!’ ? అంటుంటాడు. ఎవరున్నారు చెప్పు నీలా ఊరివారికి సాయంచేసేవారు? మా ఆయనా ఉన్నాడు ఎందుకూ ఏపనీ సాధించలేడు. బావమరిదికి ఒక్క ఉద్యోగం వేయించుకోలేడు.” అంటూ మొగుడిమీదకు మళ్ళింది.  

          “అలా అనకు అక్కా! బావగారికి ఆపంచాయితీ ఆఫీసులో ఎంతమంచి పేరుందో తెల్సా? అంతా అతగాడిని మెచ్చుకుంటుంటారు.పనిఎంతో శ్రధ్ధగాచేస్తాడని ! నిజ మక్కా? ఐతే అక్కడ నౌకరీ కావాలంటే ఇంగ్లీష్ బాగామాట్లాడాలి , మరి మీ డుమ్మడికి ఇంగ్లీష్ బాగా మాట్లాడను వచ్చా?” అసలే నల్లని పెద్ద కళ్ళని ఇంకా పెద్దవిచేసి గుండ్రంగా త్రిప్పుతూ అంది రుద్ర. .

          “అయ్యో తల్లీ! వాడుఇస్కూల్ కు వెళ్ళరా’  అని మా అమ్మా బాబూ పోరితే వెళితేనా?, ఊరి బయట ఉండే చెఱువులో ఈతలాడి వచ్చేవాడు వెధవ . మొద్దుగాడిద!” అంటూ నిజం వెళ్ళ గక్కింది మాణిక్యం.

          “పోన్లేకానీ మానాయనగారు నౌకరీ ఇప్పిస్తారు, బాగా వళ్ళువంచి  చేస్తాడుగా? లేకపోతే మా నాయనగారు నాపై కోపగిస్తారు. ‘పనిచేయని శుధ్ధమొద్దు గాళ్ళని తెస్తావా! ‘నాపేరేమైపోనూ ..అంటూనూ”  ముందరి కాళ్ళకు బంధం వేసింది రుద్ర .

          “వెధవడ్ని కాళ్ళువిరక్కొట్టి తోలేస్తాను ఇంటినుండీ , ఆపల్లెకేపోయి అమ్మా అయ్యలు పెట్టే  జొన్నసంకటి తింటూ పడుంటాడు.” అని ముందే తాను చేయబోయే పని చెప్పేసింది రుద్రకు. ఆడబోయిన తీర్ధం  ఎదురైనట్లు తాను వేయబోయే పాచిక పారుతున్నందుకు సంతోషంతోఐతే వస్తానక్కా! రేపు ఉదయాన్నే పంపు మీ తమ్ముడు డుమ్మడ్ని..” అంటూ , వెనక్కు తిరిగి సుబ్బులుకు సైగచేసి వెళ్ళింది రుద్ర. . 

          మరునాడు ఉదయాన్నే మాణిక్యం తమ్ముడు డుమ్మడు , [ ఇస్కూల్ కు డుమ్మాకొట్టి తిరుగుతున్నాడని డుమ్మడు అనిపిలవగా అదే అసలు పేరైకూర్చుంది. ]  భయం భయంగా వచ్చి వీధిగుమ్మం ముందే నిల్చున్నాడురుద్ర చూసి పిలిచింది.

          వచ్చి గుమ్మం వారగా వసారాలో నిల్చున్నాడు.” ఏం డుమ్మయ్యా! అంత భయం! పాపం పిచ్చి పిల్ల సుబ్బుల్ని ఏడిపించి నట్లుకాదు నౌకరీఅంటే. కళ్ళు గీరటం , కాళ్ళు తొక్కటం,ఎక్కడెక్కడో తాకబోడం , అదిమౌనంగా ఏడుస్తుంటే ఇకిలించటం కాదు, బుధ్ధిగా చేయాలి నౌకరీ. అక్కడ ఇలాంటి వెధవ్వేషాలు వేస్తే ,మక్కె లిరగ తన్నిపంపుతారు. సుబ్బుల్లాంటి అమ్మాయిలుంటారు , మీ అక్కలాంటి ఆడ వాళ్ళుంటారుమానాయనగారి లాంటి పెద్దవారుంటారు, ఏమైనా జరిగిందో ఇహ నీప్రయాణం పల్లెకు ,జొన్న సంకటి , జాగ్రత్త . ఒళ్ళు దగ్గర పెట్టుకుని నౌకరీ చేస్తానని మానాయనాగారికి మాటివ్వు. లేదా జొన్న సంకటికి వెళ్ళు, మీ అక్క చెప్పిన మాటే ఇది.” అంటూ ఝాడించింది రుద్ర. .

          తాను సుబ్బుల్ని చేసిన అల్లరంతా రుద్రకు తెలీడంతో భయపడ్డాడు డుమ్మడు. వాడి అసలుపేరు రాఘవరావు

          వణుకుతున్నవాడ్ని చూసిఇహ ఎప్పుడూ సుబ్బులు జోలికెళ్ళకు. నీ ముఖానికి సుబ్బులు కావల్సి వచ్చిందా ? ఎప్పుడైనా  అద్దంలో నీముఖం చూసుకున్నావా? అది బాగా చదువు కుంటున్నది . మానాయనగారు చూపే నౌకరీ చేసుకుంటూ బుధ్ధిగా ఉండు. గంతకు  తగిన బొంత నీకు దొరుకుతుంది . ఎక్కడైనా నోరువిప్పావో, ఏదైనా మీ అక్కకుచెప్పావో …” గుడ్లురిమి ఉగ్రంగా చూస్తున్న రుద్రను చూసి వణుకుతూ… లేదు లేదు  మీరు చెప్పినట్లే నౌకరీ  చేసుకుంటాను.” అని చెంపలేసుకున్నాడు డుమ్మడుఅదే రాఘవరావు.

          డుమ్మడ్ని[రాఘవరావు] తీసుకుని భానుచంద్ర  లోలోపల నవ్వుకుంటూ వెళ్ళాడు . చేనేత వస్త్రాలయంలో  నేతకారులంతా వారి ఇళ్ళలో నేసిన చీరలూ, పంచలూ, దుప్పట్లూ, తుండు పంచలూ ఇంటింటికీ  వెళ్ళి వసూలు చేసుకురావటం ,లెక్కలు వ్రాయటం వాడి పని.ఎక్కడైనా పొరపాటు వస్తే అటువస్త్ర కారులకూ ఇటు యజమానులకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. దాని కోసం వాడికి  కొంతచదువు ముఖ్యంగా గణితం  అవసరమైంది.

          “అయ్యా!భానుచంద్రబాబాయ్ గారూ ! రుద్రక్కనడిగి నాక్కాస్త గణిత బోధనచేయిస్తే నాపని సులువవు తుంది.తప్పులు రాకుండా చేయగలుగుతానుఅనికోరినమీదట రుద్ర వాడికి గణిత బోధనచేయసాగింది . బుధ్ధిగా నేర్చుకోసాగాడు.

****

(ఇంకా ఉంది) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.