స్వరాలాపన-9

(మీ పాటకి నా స్వరాలు)

-డా||కె.గీత

మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు ఇటువంటి కాలమ్ ఒకటి ఉంటే ఉపయోగకరంగా ఉంటుందన్న సలహా ఇవ్వడంతో అవి మీకూ ఉపయోగపడతాయని ఇక్కడ నెలనెలా ఇస్తున్నాను.

మీకు నచ్చి, నేర్చుకుంటే ఇక్కడ కామెంటులో తెలియజెయ్యడమే కాకుండా రికార్డు చేసి editor.neccheli@gmail.com ఈ-మెయిలుకి పంపండి. ఉత్తమమైన వాటిని ప్రచురిస్తాం. అంతే కాదు మీకు నచ్చిన సినిమా/ఏదైనా ప్రముఖ పాటకి (ఏ భాషైనా) స్వరాలు కావాలనుకుంటే కూడా ఈ-మెయిలు పంపండి. వరసవారీగా స్వరాలు ఈ కాలమ్ ద్వారా అందజేస్తాను.  మీరు ఇలా నేర్చుకున్న పాటల్ని యూట్యూబు, ఫేసుబుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పెట్టదలుచుకుంటే తప్పనిసరిగా ఆ పాట ప్రచురితమైన  నెచ్చెలి పేజీ లింక్ ని ఇస్తూ, నా పేరుని జత చెయ్యడం మరిచిపోకండేం!

***

రాగం: శివరంజని రాగం 

ఆరో: సరి2 గ2 ప ద2 స  

 అవ: స ద2 ప గ2 రి2 స  

అదనపు స్వరం ద1

లింగాష్టకం

బ్రహ్మమురారి సురార్చిత లింగం

సారిగగాగ రిగాగగ గారీ 

నిర్మలభాషిత శోభిత లింగమ్ ।

రీరి సరీసద సారిగ రీరీ 

జన్మజ దుఃఖ వినాశక లింగం

సారిగ పాప పపాద1ప గారీ 

తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 1 ॥

సారిగ రీస దరీ సస సాసా 

 

దేవముని ప్రవరార్చిత లింగం

సారిగగాగ గగాగగ గారీ 

కామదహన కరుణాకర లింగమ్ ।

రీరి సరిరి సదసారిగ రీరీ 

రావణ దర్ప వినాశన లింగం

సారిగ పాప పపాద1ప గారీ 

తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 2 ॥

సారిగ రీస దరీ సస సాసా  

 

సర్వ సుగంధ సులేపిత లింగం

పాపప దా2ద2ద2 దా1ద1ద1 పాపా

బుద్ధి వివర్ధన కారణ లింగమ్ ।

పాపప దా2ద2ద2 దా1ద1ద1 పాపా

సిద్ధ సురాసుర వందిత లింగం

గాపగ పాద1ప గాపగ రీరీ 

తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 3 ॥

సారిగ రీస దరీ సస సాసా

 

కనక మహామణి భూషిత లింగం

ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ ।

దక్షసుయజ్ఞ వినాశన లింగం

తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 4 ॥

 

కుంకుమ చందన లేపిత లింగం

పంకజ హార సుశోభిత లింగమ్ ।

సంచిత పాప వినాశన లింగం

తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 5 ॥

 

దేవగణార్చిత సేవిత లింగం

భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ ।

దినకర కోటి ప్రభాకర లింగం

తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 6 ॥

 

అష్టదళోపరివేష్టిత లింగం

సర్వసముద్భవ కారణ లింగమ్ ।

అష్టదరిద్ర వినాశన లింగం

తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 7 ॥

 

సురగురు సురవర పూజిత లింగం

సురవన పుష్ప సదార్చిత లింగమ్ ।

పరాత్పరం (పరమపదం) పరమాత్మక లింగం

తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 8 ॥

 

లింగాష్టకమిదం పుణ్యం 

సారీరీరి సారిరీగా

యః పఠేశ్శివ సన్నిధౌ ।

గగ రిగారిస సారిసాదా 

శివలోకమవాప్నోతి 

దససాస దసాసాస 

శివేన సహ మోదతే ॥

దసాస దారీససా

 *****

*ఈ స్వరాలు వింటూ నేర్చుకోవడానికి అనువుగా కింద ఇవ్వబడిన “గీతామాధవీయం” టాక్ షో లో రెండవ భాగమైన “స్వరాలాపన” వినండి-

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.