జ్ఞాపకాల సందడి-33

-డి.కామేశ్వరి 

కావమ్మ  కబుర్లు -2 

మానయనమ్మ  పేరు లచ్చయ్యమ్మట  మరీ పాత కలంపేరు   అని మోడిఫైచేసి లక్ష్మి అని చేర్చి సుందరలక్ష్మి అనిఅక్కకి పెట్టారు .తాతగారి పేరు సుబ్బారావు అనిఅన్నయ్యకి పెట్టారు .గుంటూరు వాళ్ళ ధర్మమని బతికున్న వాళ్ళపేర్లు పెట్టారుకనక. మా అమ్ముమ్మపేరు. సూరమ్మ అని పెట్టలేదుట నాకు .అది వింటే గుడ్డిలో మెల్ల సూరమ్మ కంటే కామేశ్వరి కాస్త నయంగావుందని. అప్పటినించి నోరు మూసుకున్న . పోనీ కామేశ్వరిని కాస్త నాజూకుగా కాము అని పిలవచ్చుగదా -ఆబ్బె అసలు మన పేర్లే చుడండి సుబ్బలక్ష్మి ఆదిలక్ష్మి. సూర్యకాంతం నరసమ్మ అలివేలు మాణిక్యం వెంకటమ్మ లాటివి తప్ప నాజూగ్గా ఏ బెంగాలీవాళ్లలాగో. చంద్రలత చారులత చంద్రముఖి. మనోరమ వినోదిని నీరద  నీరజ సుహాసిని. శుభ్శషిణి పేర్లు ఇ ప్పుడంటే. పెడుతున్నారుగాని మాటైంలో అసలు పెట్టె వారు కాదు .ఆపెట్టిన పేరుని మరింత వికృతంగా ఆదెమ్మ సూరమ్మ సుబ్బులు పిచ్చమ్మ కావమ్మా అంటూ పిలుపు.సరే మగాళ్ళయితే. ఇంటికో సుబ్బారావు వెంకట్రావు హనుమంతరావు. ఆంజనేయులు సూర్యనారాయణ. ఇవే పేర్లు తాతల నించి తండ్రులకితండ్రులనించి. కొడుకులకి ఆలా వంశాలకి వంశాలు అవే  పేర్లు. .అసలు ఆలా పెట్టకపోతే తాతలు నయనామాలు కోపగించుకుని ఆ పిల్లలని దగ్గిరికి తీసేవారుకాదట .తమపేరిటిగాళ్లయితే. నెత్తికెక్కించుకునేవారట మిగతావాళ్ళని అంటి ముట్టనట్టు వుంచేవారట .ఇలాటి కధలు ఇంట్లో చెప్పుకునేవారు ఆడవాళ్ళూ .  ఎక్కడ నించి ఎక్కడికి వచ్చేసా. కాము అనిపిలవచ్చుకదా అన్నకదా నేను కాస్త పెద్దయ్యాక ఎం బుద్ధి పుట్టిండో కాము అందం మొదలు పెట్టారు నాన్న అదిచూసి మా అక్కాచెల్లెళ్లు అన్న ఇప్పటికి అందరికి నోట్లో కావుమ్మ. వస్తుంది . అసలు నేను మరీ  చిన్నపిల్లగా వున్నప్పుడు. మా అమ్మమ్ముగారింట్లో. రోజారంగులో ఉందని రోజా అని ముద్దుగాపిలవడం నాకు గుర్తు . దానికి మా. నాన్న దానికి కామేశ్వరన్నపేరు పెడితే. మీరేమిటి ఆపిలుపు అది పడనీకుండా చేశారట . పేరులో ఏముంది అంటారుగానిపేరులోనే ఉందంత అంట 

 చక్కని పేరుంటే మనిషి ఎలావుంటుందో చూడాలనిపిస్తుంది .చూసాకమీనాక్షి మెల్లకన్నుతో .,రూపవతి అన్న ఆమె రూపం లేకుండా సుహాసిని. చిరచిరలాడుతూ కనిపిస్తే. అదివేరేవిషయం. ఆశ భంగం కలగొచ్చు కానీ ముందు మంచి పేరుంటే ఆకరిష్స్తుందన మాట నిజం . 

 ఈ గోల ఎందుకు పాయింట్ చెప్పరాదు అంటారు.  కావమ్మా కబుర్లు పేరు చదివి ఈ ముసలమ్మా చెప్పేదేం ఉంటుంది అని పేజీ తిప్పే యకండి . మకాలం కబుర్లు చెప్పడానికి మేమె మిగిలాం అని మర్చిపోకండి. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.