అమృత వాహిని అమ్మే కదా(లలిత గీతం)

-రచన, గానం &సంగీతం : డా.కె.గీతామాధవి

పల్లవి:

అమృత వాహిని అమ్మే కదా

ఆనందామృత క్షీరప్రదాయిని అమ్మే కదా

అనురాగాన్విత జీవప్రదాయిని అమ్మే కదా

 

చరణం-1

ఇల్లాలై ఇలలో వెలసిన ఇలవేలుపు కదా

జోలాలై కలలే పంచిన కనుచూపే కదా

కడలిని మించే కెరటము ఎగసినా

కడుపున దాచును అమ్మే కదా-

 

చరణం-2

ఉరుము మెరుపుల ఆకసమెదురైనా

అదరదు బెదరదు అమ్మే కదా

తన తనువే తరువై కాచే

చల్లని దీవెన అమ్మే కదా

 

చరణం-3

జీవితమే ఒక ఆగని పోరాటం

ఆశనిరాశల తరగని ఆరాటం

కుంగిన వేళల తలచిన చాలును

దారిని చూపును అమ్మే కదా

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.