క’వన’ కోకిలలు – 10 : 

విలియమ్ కల్లెన్ బ్రాయంట్ (William Cullen Bryant)

(November 3, 1794 – June 12, 1878) 

   – నాగరాజు రామస్వామి

          “చిట్టడవులు దేవుని తొలి ఆలయాలు. పుష్ప సారభాన్ని, నక్షత్ర వైభవాన్ని ప్రేమ నయనంతో గాని చూడలేము. ఆరుబయట తిరుగాడే లలిత పవనాలలో ఆనంద తరంగాలు అలలు పోతుంటవి” – విలియం బ్రాయంట్.

          విలియమ్ కల్లెన్ బ్రయాంట్ 19వ శతాబ్దపు కాల్పనికవాద అమెరికన్ కవి. పాత్రికేయుడు.

          అలనాటి ప్రసిద్ధ పత్రిక ‘న్యూయార్క్ పోస్ట్ అనుబంధ సంచికను అర్ధశతాబ్దం పాటు నిర్విఘ్నంగా నడిపిన చిరకాల సంపాదకులు. యురోపియన్ కాల్పనికవాదాన్ని అమెరికన్ సాహిత్యలోకానికి పరిచయంచేసిన తొలి కవి. అతని ప్రసిద్ధకావ్యం ఠనతొప్సిస్ (మృత్యుధ్యాస – గ్రీకు శాస్త్రీయ పరిభాషా ఉత్పన్నరూప పదం).

          కల్లెన్ బ్రాయంట్ యునైటెడ్ స్టేట్స్ లోని న్యూఇంగ్లండ్ ప్రాంతపు పట్టణం మసచూసెట్స్ (అస్సచుసెత్త్స్)లోజన్మించాడు.

          అతని రెండేళ్ళ వయసులో తండ్రి హోమ్స్టెడ్ (హొమెస్తేద్) లోని కొత్త ఇంటికి మారాడు. ఆ ఇల్లు ఇప్పుడు ఒక మ్యూజియం. జనరంజకమైన ఫైర్ సైడ్ పోయెట్స్ లో సభ్యుడుగా ఉండి అనతి కాలం లోనే పేరుతెచ్చుకున్నాడు. ఆ తొలి అమెరికన్ కవుల కూటమి నాటి బ్రిటిష్ కవులకు పోటీగా నిలిచింది. వాల్డో ఎమర్సన్ వంటిప్రఖ్యాత కవులు ఆ గ్రూపు సభ్యులుగా ఉండేవారు.

          తండ్రి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటం వల్ల తనకు ఇష్టమైన సాహిత్య విద్యాభ్యాసానికి బదులున్యాయశాస్త్రం చదువాల్సి వచ్చింది. వకీలు అయ్యాక కొన్నాళ్ళ పాటు రోజుకు ఏడు మైళ్ళు నడవాల్సి వచ్చేది.

          పిన్న వయసులోనే బ్రాయంట్ కవిత్వం పై అభిరుచిని పెంచుకున్నాడు. వకీలుగా ఉన్న రోజుల్లో కవిత్వం రాయటం ప్రారంభంచి నాటి పాపులర్ ప్రతిధ్వంధులైన గ్రేవ్ యార్డ్ పోయెట్స్ లను ఎదిరించేవాడు. అతని పాట లోని మాంత్రికతను(థె విత్చెర్య్ ఒఫ్ సొంగ్) నచ్చిన వర్డ్స్ వర్త్ (వొర్ద్స్వొర్థ్) ఎంతగానో ప్రోత్సహించేవాడు. బ్రాయంట్ తన ఆదర్ష కవి అలగ్జాండర్ పోప్ ను అనుసరించి,నాటి నియోక్లాసికల్ బ్రిటిష్ కవులకు దీటుగా పోటీ చేసేవాడు. అమెరికా ప్రెసిడెంట్థామస్ జాఫర్ సన్ పై ఘాటైన వ్యాసం (ఎంబార్గో) ప్రచురించి ఖ్యాతి కెక్కాడు. ఠనతొప్సిస్ (ఎదితతిఒన్ ఒన్ దేథ్) తర్వాతి మరో ప్రఖ్యాత కవన సంకలనం “ఠె ఆగెస్”. అతని కవితా ఖండిక నీరుకాకి (టొ అ వతెర్ Fఔల్) జగత్ప్రసిద్ధం. కవిత్వమే కాక కాల్పనిక సాహిత్య రచనలు కూడా చేశాడు. కారణాంతరాల వల్ల అతని కథలు పాపులర్లే కాలేదు. ణెవ్-Y ఒర్క్ ఋఎవిఎవ్ లో సంపాదకీయాలు రాయటం వల్ల అతని పొలిటికల్ భావధార బలపడింది. ఆ పత్రికా ఎడిటర్ పదవి నుండి సహభాగస్వామి (ఛొ- ఓవ్నెర్) స్థాయికి ఎదిగాడు. పరోక్ష పాలిటిక్స్ లో ప్రముఖ పాత్ర వహించాడు. తన క్రియాశీల పాత్రికేయ రచనల ద్వారా మానవ హక్కుల, బానిసత్వ నిర్మూలన, కార్మిక సంక్షేమ పరిరక్షణకై పాటుపడ్డాడు. మైనారిటీలకు, ప్రవాసులకు అండగా నిలిచాడు. నిరంకుశ బాంక్ లను ఎదిరించాడు. అబ్రహం లింకన్కు ముఖ్య వ్యాఖ్యతగా వ్యవహరించాడు. బ్రాయంట్ రాసిన “కూపర్ యూనియన్ స్పీచ్” లింకన్ ఎన్నికకు అత్యంత దోహదకారి అయిందంటారు.

          బ్రాయంట్ బహుముఖ ప్రజ్ఞాశాలి. హోమ్యోపతి వైద్యుడు. చర్చ్ గాయకుడు. గ్రీక్ కవి హోమర్ రాసిన ఇలియడ్, ఒడెస్సీ గ్రంధాలను వచన కవితలుగా (Fరీ వెర్సె) అనువదించాడు.

          అమెరికా, కెనడాల ప్రకృతి సౌందర్య ప్రదేశాల సచిత్ర రచనలతో ఫిచ్తురెస్qఉఎ ఆమెరిచ అనే పుస్తకాలనుప్రచురించాడు.

          విలియమ్ కల్లెన్ బ్రాయంట్ అలనాటి అధునాతన స్వేచ్ఛా రచయితల మేరు శిఖరంగా వెలుగొందాడు. అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ & సైన్స్ అసిస్టెంట్ ఫెల్లో గా నియమితుడయ్యాడు.

అతని ప్రఖ్యాత కవన ఖండాలు మూడింటికి నా క్లుప్తానువాదాలు:

: మృత్యు ధ్యాస :

(ఠనతొప్సిస్)

నీవు ప్రేమించాలే కాని/ నిన్ను పలుకరించేందుకు ప్రకృతి సదా సిద్ధమే;/ ప్రీతి వచనాలతో, ప్రియ దర్శనాలతో/ బహుముఖీనంగా, బహురూప సంభాషణంగా,/ నీ సంతోష సమయాలను అందగించేందుకు / ఆనంద స్వరాలతో, అందాల దరహాసాలతో, / నీ హుషారును తస్కరించిన చింతల చీకట్లలో నీవు చిక్కుకున్నప్పుడు / అనునయ సంజీవినీ స్పర్శలతో ఆదుకునేందుకు.

మృత్యుఘాత అవసాన సంధ్యా విషాద ఛాయలు నీ జీవచైతన్యాన్ని కమ్ముకున్నప్పుడు, / గోరీ గోడల నడిమి ఊపిరి సలుపని ఇరుకు ఇరుల చింతలు నిన్ను వణికిస్తున్నప్పుడు / వెళ్ళు విశాల ఆకాశం కిందకు ప్రకృతి ప్రసాదాలను తలచుకుంటూ;/

అప్పుడు నీకు సనసన్నని ఆప్త స్వరమేదో వినిపిస్తుంటుంది / నీ చుట్టూ వున్న పృథివీ తలాల లోంచి, / జల సమూహాలలోంచి, వాయు అగాధాల లోంచి./ ఐనా, కొన్నాళ్ళకు / నీవూ, నీ సకల విలోకన సూర్యుడూ వుండడు, / నీ పేలవ పార్థివదేహాన్ని ఇమిడ్చుకున్న ఇగము తడిపిన మృత్యు శీతల అశ్రుసిక్త నేలా, / నిన్ను హత్తు కున్న సముద్రపు ఆచూకీ వుండదు.

నిన్ను కప్పి పెట్టిన మట్టి లోకి మర్రి వేర్లు దిగుతుంటవి, / సనాతన మహా సమాధిలో/ రారాజుల, ద్రష్టల, జ్ఞాన ధనుల సరసన అంతిమ శయ్యపై నీవు ఒంటరిగా విశ్రమిస్తావు.

పసిడి సూర్యుడు, గ్రహగోళాలు, స్వర్గసీమలు

అన్నీ వెలుగుతున్న మృత్యుధామ విషాదాలే!

స్వల్పమే సుమా / ఈ భూగోళం పై నడయాడుతున్న మానవ జాతి సమస్తం / పుడమి ఒడిలో యుగాలుగా నిశ్శబ్ద సమాధిపొందిన / దివంగత మనుజకోటి ముందు!

ఒక్కొక్కరూ ఒకనాడు అన్ని వ్యాపకాల్ని వదిలేసి బండెక్కుతారు. / అందుకే / హాయిగా జీవించు, అంతిమ పిలుపువచ్చేదాకా, / ఆ రహస్య రథం నిన్ను నిశ్శబ్ద నిశాంత సౌధానికి చేర్చే దాకా; /

వెళ్ళు అచంచల విశ్వాసంతో నీ సమాధి లోకి

సుఖ స్వప్నాల వెచ్చని దుప్పట్లు చుట్టుకుంటూ.

: వశీకరణం :

(ఈ భ్రొకె థె శ్పెల్ల్ థత్ హెల్ద్ ంఎ లొంగ్)

విడిచి వచ్చాననుకున్నాను / చిరకాలంగా నన్ను ఆవహించిన / పాటల వశీకరణ మంత్ర మోహాన్ని,

అనుకున్నాను / నా యవ్వన కాలాన్ని కబళించే ఏ కవి ప్రతిభా నన్నిక లోగొనలేదని.

కవిత్వం పుట్టింది అమర సీమలోనే / కాని, వెంటేసుకొస్తుంది / పేదరికాన్ని, అలక్ష్యాన్ని!

పూలూ, సెలయేళ్ళూ, / నక్షత్ర కాంతీ, సూర్య రశ్మీ ఏకమై కవన వైభవమైన కమనీయ శోభ! / అదిగో నన్ను ఇన్నాళ్ళూ ఆకట్టుకున్న నా పాత ప్రపంచపు / పాటల ప్రీతి నన్ను పిలుస్తున్నది!

: నీరుకాకి :

(టొ అ వతెర్ Fఔల్ )

మంచు కురుస్తున్న వేళ / మలిసంజ చరమ చరణమై పారి పోతున్నావు / ఒంటరి దారులలో /

సుదూర నాక లోకాల రోజా లోతులను దిన కాంతులతో వెలిగిస్తూ. / నీ ఆన్వేషణ

తొణకుతున్న నాచు నిండిన చెరువు గట్టు / ఉరకలేసే సువిశాల నదీ తటం, / ఉద్రిక్త కెరటాల సముద్ర తీరం; / కాని, కావచ్చు సుమా

ఊదారంగుల ఆకాశంలో తేలుతున్న నీ రూప బిందువు వేటకాని లక్ష్యం. / ఐనా, దిగాలు పడొద్దు / నీ వెంటే వుంటుంది నిన్ను నడిపించే అలౌకిక అవ్యక్త అతీత శక్తి; /నీవు ఏకాకివై తిరుగాడుతున్న / అగమ్య విజన ఎడారులలో, /

అనంత విగత పవన పథాలలో / నీకు దారిచూపే దీపధారి! / అదుగో, పిలుస్తున్నవి / ఆ శీతల రేతిరి ఆకాశాల కింది నీ నేలలు, /నీ వాళ్ళఎదిరిచూపుల కేరింతలు;/ నీ స్వంత గూటిపై వంగనున్న ఆకునీడలు. / నిన్ను కబళించిన స్వర్గ /అగాధాలలోకి నీవు నిర్గమించినా నన్ను వదలవు /నీవు నీ అడుగు జాడలు!

          అమెరికా దేశం అతని స్మృతి చిహ్నంగా, న్యూయార్క్ సిటీ స్క్వేర్ పేరును ను “బ్రాయంట్ పార్క్” గా మార్చిసత్కరించింది.

          అమెరికన్ సాహిత్య లోకాన్ని ఉర్రూతలూగించిన తొలి కవి విలియమ్ కల్లెన్ బ్రాయంట్!

*****                  

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.