పుత్తడి బొమ్మ మనసు తెలుసునా ?
-శ్రావణి బోయిని
పచ్చని తోరణాలు …
ఇంటి నిండా బంధువులు …
బంగారు బొమ్మల
ముస్తాబు చేశారు తనని …
పక్కన స్నేహితులు …
ఎవరి పనుల్లో వారు …
ముస్తాబు గురించి అడిగే స్నేహితులు …
బాధ్యతలో బిజీగా అమ్మా నాన్నా…
పైకి కనపడకుండా బాధని
లోపల దాచుకున్న అమ్మా నాన్నా…
బాధని భరిస్తూ
అన్ని సిద్ధం చేస్తున్న సోదరి…
అందరికి సంతోషంగా ఉన్న …
తన మదిని ప్రశ్నించే సమాధానం లేని ప్రశ్నలు…
తన ఇల్లు పేరు….
లోకం కూడా మారుతుంది అనే బాధ ….
అమ్మా నాన్నా సోదరిని వదిలి వెళ్ళాలి అనే ఆమె బాధ…
పుత్తడి బొమ్మ బాధ ఎవరికీ ఎరుగదు ….
ఇవి అన్ని ప్రతి అమ్మాయికి జరిగేవి
అని ఆమె తన మనసుని సర్ది చెప్పుకోడం …
తన బాధని గుండెలో దాచుకొని సిగ్గుపడుతూ కనిపిస్తూ…
జ్ఞాపకాలను దాచుకొని సరికొత్త జీవితానికి అడుగులు వేస్తుంది కొత్త పెళ్లి కూతురు
*****