నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక
తృతీయ వార్షికోత్సవ ప్రత్యేక సంచికకు రచనలకు ఆహ్వానం!
-ఎడిటర్
నెచ్చెలి తృతీయ వార్షికోత్సవం (జూలై 10, 2022) సందర్భంగా ప్రత్యేక రచనలను తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఆహ్వానిస్తున్నాం. కథ, కవిత, వ్యాసం, ట్రావెలాగ్ ప్రక్రియల్లో రచనలు స్వీకరించబడతాయి. ప్రతీ ప్రక్రియలోనూ ఎంపిక చెయ్యబడ్డ పది రచనలు ప్రత్యేక సంచికలో ప్రచురింబడతాయి. ప్రత్యేక సంచికకు ఎంపిక కానివి నెచ్చెలి నెలవారీ సంచికల్లో ప్రచురింపబడతాయి. ప్రత్యేక సంచికకు రచనలు పంపడానికి ఈ క్రింది నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.
నిబంధనలు:-
1. రచన ఈ – మెయిలు పంపే ముందే మూడు విశేషణాత్మక కామెంట్లు నెచ్చెలిలో డైరక్టుగా పోస్టు చెయ్యాలి.
కామెంట్లు పోస్టు చెయ్యడానికి నిబంధనలు:- ఇప్పటి వరకు నెచ్చెలిలో వచ్చిన విభిన్న ప్రక్రియల్లో రచనలు, నెచ్చెలి ఛానెల్లో వీడియోల నుంచి మీకు నచ్చినవి ఏవైనా మూడింటిని ఎంచుకుని ప్రతీ రచనకూ కామెంటు రూపంలో ఒక పారాగ్రాఫులో చిన్న విశ్లేషణ పోస్టు చెయ్యాలి. కామెంటులో విధిగా మీ పేరు రాయాలి. పేరు లేని కామెంట్లు లెక్క పెట్టబడవు. రచనతో బాటూ మీరు కామెంటు చేసిన రచన పేరు, కామెంటు చేసిన తేదీ విధిగా ఈ-మెయిలులో రాయాలి. కామెంటు ఆయా రచనల దగ్గర పోస్టు మాత్రమే చెయ్యాలి. ఈ-మెయిలులో పంపకూడదు.
2. కథ, కవితలకు ప్రధాన ఇతివృత్తం స్త్రీలకు సంబంధించినదై ఉండాలి. వ్యాసం, ట్రావెలాగ్ లకు వస్తు నియమం లేదు.
3. వస్తువు, శైలి, ఎత్తుగడ, ముగింపులలో కొత్తదనానికి ప్రాధాన్యతని ఇచ్చే రచనలకు ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది.
4. మీ రచన విధిగా యూనికోడ్ లో ఉండి వర్డ్ (లేదా) గూగుల్ డాక్ లో పంపాలి. రచన A4 లో పది పేజీలకు మించకూడదు.
5. రచనతో బాటూ విధిగా రచన మరెక్కడా ప్రచురితం కాలేదని, పరిశీలనకు పంపబడలేదని హామీ పత్రం జతచెయ్యాలి.
6. విధిగా మీ ఫోటో, ఒక పారాగ్రాఫులో మీ గురించి వివరాలు యూనికోడ్ లో రాసి జత చెయ్యాలి.
7. రచనలు చేరవలసిన చివరి తేదీ- జూన్ 25, 2022. గడువు తర్వాత చేరినవి పరిశీలనలోకి తీసుకొనబడవు.
8. ఒక్కొక్కరు ఒక ప్రక్రియకు ఒక రచన చొ||న అన్ని ప్రక్రియలకూ రచనలు పంపవచ్చు.
9. ఈ-మెయిలు మీద సబ్జెక్టు “నెచ్చెలి తృతీయ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక-2022” కి అని రాసి editor@neccheli.com కు పంపాలి.
10. ఇంగ్లీషులో పంపే రచనలు అనువాదాలైనా కూడా స్వీకరించబడతాయి. మూల రచన, రచయిత వివరాలు, మూల రచన ప్రచురణ వివరాలు విధిగా జత పరచాలి. అనువాదాలు ఎక్కడా ప్రచురితం కాలేదని హామీ పత్రం జతపరచాలి. పైన తెలుగు రచనలకు ఇచ్చిన నిబంధనలు అన్నీ పాటించాలి.
11. ప్రత్యేక సంచికకు ఎంపిక కాని రచనలు సాధారణ ప్రచురణకు స్వీకరించబడి నెచ్చెలిలో నెలవారీ సంచికల్లో ప్రచురింపబడతాయి.
ఇందులో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు.
12. రచనలు పంపేవారు విధిగా
నెచ్చెలి వెబ్ సైట్: (https://www.neccheli.com/)
నెచ్చెలి వాట్సాపు గ్రూపు:
https://chat.whatsapp.com/
నెచ్చెలి యూట్యూబ్ ఛానల్ :
https://www.youtube.com/c/
నెచ్చెలి ఫేసుబుక్ పేజీ :
https://www.facebook.com/
నెచ్చెలి ఇన్‌స్టాగ్రామ్ పేజీ:
https://www.instagram.com/
లకు సబ్స్క్రైబ్ చేసి, సభ్యులుగా ఉండాలి. ఇవన్నీ పూర్తిగా ఉచితం.
***
నిర్వాహకులు:
డా.కె.గీత, సంస్థాపక సంపాదకులు, నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక
*****
అభినందనలు గీత గారూ, విజయవంతంగా నెచ్చెలి నిర్వహిస్తూ మూడోసంవత్సరంలోకి అడుగు పెడుతున్నందుకు. మీపత్రిక విషయసూచిక చదవడానికే నాకు రెండు రోజులు పడుతోంది. మీ ఆసక్తి, శక్తిసామర్థ్యాలకు జేజేలు.
ధన్యవాదాలు మాలతి గారూ!