Please follow and like us:
పేరు శ్రీధర్ చౌడారపు. ఆదిలాబాద్ జిల్లాలోని ముధోల్ నా జన్మస్థలమైతే, స్వస్థలం నిర్మల్. నివాసం హైదరాబాదు. బి.ఏ., బీ.ఎడ్ చేసిన నేను తొమ్మిదేళ్ళు ఉపాధ్యాయునిగా పనిచేశాను. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రూప్ వన్ అధికారిగా సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారిగా మొదలెట్టి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖలో అదనపు సంచాలకునిగా పనిచేస్తున్నాను.
బి.ఏ లో తెలుగు, బి.ఎడ్ లో తెలుగు చదివాను. గ్రూప్స్ మరియు సివిల్స్ లో తెలుగు నా ఆప్షనల్ కావడం వల్ల తెలుగును కాస్త అధికంగానే అధ్యయనం చేశాను. చదవడం చాలా ఎక్కువ, రాయడంతో పోలిస్తే. ఇప్పటివరకూ 120 కి పైగా కవితలు భౌతిక, అంతర్జాల పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. ఒక కథ, ఒక ఇంటర్వ్యూ, కొన్ని పుస్తక సమీక్షలు కూడా ప్రచురితాలే.
చాలా అర్థవంతమైన కవిత …
చాలా బాగుంది sir
కవిత బాగుంది.
అభినందనలు.