మా వైష్ణుదేవి యాత్రా విశేషాలు – 3

-చెంగల్వల కామేశ్వరి

          ముందుగా  చింతపూర్ణి( ఛిన్నమస్తక) శక్తి పీఠం గురించి చెప్పాక మిగతా విషయాలు

          శక్తి పీఠాల వెనుక ఉన్న పురాణం ఏమిటంటే సతీదేవి శరీరాన్ని భుజం పై వేసుకుని పరమశివుడు  తీవ్ర దుఃఖంతో ప్రళయతాండవం చేసినప్పుడు ఆ అమ్మవారి శరీరభాగాలు ఏభయి ఒక్క ప్రదేశాలలో పడ్డాయి ఆ ప్రదేశాలన్నీ కాలగతిలో శక్తి పీఠాలుగా పూజలు అందుకుంటున్నాయి. 

          ఈ చింత్ పూర్ణి అమ్మవారు  ఛిన్నాభిన్నమయిన మెదడు భాగం పడటం వలన  ఛిన్నమస్తక అని పిలువబడుతున్నారు. ఈ అమ్మవారిని మనస్పూర్తిగా ప్రార్ధిస్తే మన మెదడులో కలిగే  పలు చింతలని పోగొడుతుందని  పేరు ఈ క్షేత్రానికి ఉంది.

జ్వాలాముఖి

          హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా లోయలో ఉన్న జ్వాలాముఖి ఆలయం ప్రసిద్ధి చెందింది మరియు హిందూ భక్తులకు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ప్రదేశం ఎటువంటి విగ్రహం లేని దేవాలయంగా ప్రసిద్ది చెందింది మరియు జ్వాలాముఖి దేవి యొక్క అభివ్యక్తి అని నమ్మే ఆలయం లోపల ఉన్న మంటకు పూజలు చేస్తారు.

          సతీదేవి నాలుక పడిన 51 శక్తిపీఠాలలో ఇది ఒకటి. హిందూ పురాణాల ప్రకారం, విష్ణువు తన చక్రాన్ని ఉపయోగించి సతీదేవి శవాన్ని కత్తిరించినప్పుడు, ఆమె శరీరం 51 ముక్కలుగా చెల్లాచెదురుగా పడిన వివిధ ప్రదేశాలలో జ్వాలాముఖి నాలుక పడిపోయిన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఆలయం ఒక రాగి పైపును కలిగి ఉంటుంది, దాని నుండి సహజ వాయువు వెలువడుతుంది మరియు ఆలయ పూజారులు దోషరహిత నీలం మంటను ఉత్పత్తి చేయడానికి దానిని వెలిగిస్తారు.

          జ్వాలాముఖి (‘జ్వాల’ అనేది జ్వాల మరియు ‘ముఖి’ అనేది ‘నోరు’) జ్వాలాముఖిని సూచిస్తున్న రాక్షసుడు జలంద్రను శివుడు చంపాడని పురాణాలు చెబుతున్నాయి. అతని నోటి నుంచి మంటలు వస్తున్నాయని భావిస్తున్నారు. ఆలయంలో మొత్తం తొమ్మిది జ్వాలలు వెలిగించబడ్డాయి, ఇది తొమ్మిది మంది దేవతలను సూచిస్తుంది మరియు ప్రతి రోజు తప్పకుండా మండే మహాకాళి, అన్నపూర్ణ, చండీ, హింగ్లాజ్, విద్యా, బస్ని, మహాలక్ష్మి, సరస్వతి, అంబికా మరియు అంజి దేవి పేరు పెట్టబడింది. 

          దుర్గామాత యొక్క గొప్ప భక్తుడైన కాంగ్రా రాజా భూమి చంద్ కటోచ్ ఈ భయానక ప్రదేశం గురించి కలలు కన్నాడని మరియు ఈ ప్రదేశం కోసం వెతకమని తన సైనికులను ఆదేశించాడని నమ్ముతారు. ఈ ప్రదేశాన్ని కనుగొన్న తర్వాత, రాజు ఈ ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించాడు, జ్వాలాముఖి ఆలయం బంగారంతో చేసిన గోపురం మరియు వెండి పలకలతో రూపొందించిన అందమైన ఆధునికంగా నిర్మించబడింది.

          హిందువులు పార్వ‌తీ దేవిని ఆరాధించే దేవాల‌యాల‌లో పురాణ గాథ‌ల‌, ఆచారాల ప‌రంగా ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కొన్ని స్థలాల‌ను శ‌క్తిపీఠాలు అంటారు. ఈ శ‌క్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విష‌యంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్క‌లున్నాయి. అయితే 18 ప్ర‌ధాన‌మైన శ‌క్తి పీఠాల‌ను అష్టాద‌శ శ‌క్తి పీఠాలు అంటారు. వాటి వివ‌రాలు 

1) జోగులాంబ ఆలంపురం 

2) కంచికామాక్షి కంచి

3) శ్రీ మహాలక్ష్మి కొల్హాపూర్

4) శ్రీ చాముండేశ్వరి మైసూర్

5) శ్రీ కాళీ ఘాట్ కాళి

6) శ్రీ బిమలాదేవి

7) మాంగల్య గౌరి గయ

8) కామాఖ్యాదేవి గౌహతి

9) జ్వాలాముఖి కాంగ్రా

10) సప్తశృంగి మహారాష్ట్ర

11) మాణిక్యాంబద్రాక్షారామం

12) మాతాతరతరిణి

13) సరస్వతీదేవి శ్రీనగర్

14) మహాకాళి ఉజ్జయిని

15) ఛిన్నమస్తక కాంగ్రా

16)  కాశీ విశాలక్షి వారణాశి

17) తుల్జాభవాని మహారాష్ట్ర

18) గిరిజాదేవి జాజిపూర్

ఇంక మా యాత్రావిశేషాల లో అయిదవరోజు 

          మనాలీకి మాకై బుక్ చేసిన జెస్సికా హోటల్  చేరాము.

          మంచుకొండలు అటల్ టన్నెల్ చూడాలంటే ఆరుగంటలకు బస్ ఎక్కితేనే మంచిదని మా డ్రైవర్స్ చెప్పడం వల్ల ఉదయం అందరం రెడీ అయ్యాము. మాకు హోటల్ వారు లైట్ గా బ్రేక్ ఫాస్ట్ ప్యాక్ చేసి ఇచ్చారు ఇక్కడ కూడా రెండు రాత్రులు  ఉన్నాము.

          మేము ఏప్రిల్ లో వెళ్లినా హోటల్ కి ఎదురుగా ఉన్న వాటర్ ఫాల్  కొండల పైన  కనపడే మంచు సన్నగా ప్రవహించే బియాస్ నదిని చూడగానే మనసు ఉల్లాసమై పోయింది. మా ప్రయాణమంతా ఘాట్ రోడ్స్ దారిపొడవునా మాతో ప్రయాణించే బియాస్ నది. ఆ నదిని అక్కడ దారిలో కనిపించిన డామ్ చూస్తే ఇరవయ్యారు మంది  డామ్ వదిలిన నీళ్లల్లో కొట్టుకుపోయిన వారు గుర్తొచ్చి మనసేదోలా అయింది. 

          అయిదునదుల సంగమం పంజాబ్ అని చదువుకున్న చరిత్ర గుర్తొచ్చింది.     రావి, జీలం, బియాస్ సట్లెజ్  సింధు నదులు కలిసి ఆ పంచనదులని పంజాబ్  అంటారని  అప్పుడెప్పుడో చదువుకున్నాము కదా, అవి గుర్తు చేసుకున్నాము. చలి బాగా ఉంది మనాలీ లో దారిలో ఒక షాప్ లో ఆ మంచులో ఆడటానికి తగిన ఉలెన్ దుస్తులు రెంట్ కి ఇస్తారంటే అందరం 250 రూపాయలు  డ్రెస్ బూట్లకు రెంట్ పే చేసి సాక్సులు గ్లవుజ్లు కొనుకున్నాము. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్ పేయ్ పేరు మీద మోడీ నిర్మింపచేసిన అటల్ టన్నెల్ మీదుగా మనాలీ మంచుకోండలకు చేరుకుని వెహికిల్ పార్కింగ్ నుండి అర కిలోమీటర్ నడిచాము.

          మేమే ముందు వచ్చాము కాబట్టి మా ఇష్టం వచ్చినంత సేపు  మంచుకొండల లో ఆడాము‌. మనాలీ డ్రెస్  అద్దెకు తీసుకుని రకరకాల విన్యాసాలు చేస్తూ ఫొటోలు దిగాము. అయితే అక్కడ ఐస్ మీద జారి పడిన మా చిట్టి తల్లి కి చేతి మీద బరువుపడి చేయి నొప్పి వాపు ! అది చూసి అందరం తల్లడిల్లాము. మేము తిరిగి వచ్చే సమయానికి కొన్ని వందల మంది జనం వచ్చేసారు.

          వచ్చేటప్పుడు మా హోటల్ కి దగ్గరలో ఉన్న హరిహరా హాస్పిటల్ దగ్గర నేను చిట్టి తల్లి  దిగి తనని ఆర్థోపెడిక్ డాక్టర్ కి చూపించి ఆయన సలహా మీదకు ఎక్సెరే  తీయిస్తే మణికట్టు దగ్గర ఫ్రాక్చర్ అయిందన్నారు. సిమెంట్ కట్టు కట్టాలి ఒక వారం తర్వాత డాక్టర్ కి చూపించమని చెప్పారు. 

          ఆయన ఆ కట్టు కట్టేటప్పుడు చిన్న తమాషా చిట్టి తల్లి నొప్పి పెడుతుందేమో అని భయపడుతుంటే “ఏమీ భయం లేదు  సాయిరామ్ సాయిరామ్ అనుకో! అంటుంటే మా అబ్బాయి ఏజ్ ఉన్న ఆ డాక్టర్ సడన్ గా “ఏమీకాదు ఛంపేస్తానంతే! అన్నాడు. 

          మేము ఆశ్చర్యానందాలతో నవ్వేస్తుంటే ఆ నవ్వుల్లో టక్కున చిట్టితల్లి చెయ్యి సెట్ చేసేసాడు. తను బాధతో ఒకసారి కెవ్వుమంది కాని  ఇక నిముషంలో సర్దుకుంది.

          అతనికి తెలుగెలా వచ్చు అని ఆరా తీస్తే ఓటీటీ లో మన మహేష్ బాబు జూనియర్ ఎన్టీ ఆర్ అల్లు అర్జున్ ప్రభాస్ తెలుగు హీరోల సినిమాలన్నీ చూస్తాడుట! మనం తెలుగు మలయాళం  కొరియన్ చూసినట్లు. ఆ హిమాచల్ ప్రదేశ్ లో ఒక్క నిముషం మన తెలుగు హీరోల వల్ల తెలుగు వారిగా గర్వంతో గుండె ఉప్పొంగింది మాకు!

          ఇదంతా అయి మా భోజనాలు ముగిసేసరికి మూడయింది. 

          మళ్లీ హిడింబా టెంపుల్ మనో టెంపుల్  క్లబ్ హౌస్ చూడటానికి వెళ్లాము కాని, హిడింబా టెంపుల్ కి అడ్డదిడ్డమయిన మెట్లు ఎన్నో ఎక్కి  అక్కడున్న ఘటోత్కచుడి గుడి కి కూడా వెళ్లాము. పచ్చని ఎత్తయిన చెట్ల మధ్య ఉన్న ఆ గుడి చాలా బాగుంది. అక్కడ రోజా సినిమాలో మధుబాల దైవదర్శనం చేసుకున్న టెంపుల్ అదేనని  అక్కడే  అరవిందస్వామి ని కిడ్నాప్ చేసిన దృశ్యాలు  అక్కడే షూట్ చేసారని తెలిసి ఇంకా సంతోషించాము. అక్కడ మన పమేరియన్ కుక్క పిల్లలంత కుందేళ్లు ని చూసి ముచ్చటపడి ఫొటోలు దిగాము .

          తర్వాత మనో గుడి క్లబ్ హౌస్ కి చాలా నడవాలి మెట్లు ఎక్కాలని తెలిసి ఉదయం నుండి అలిసిపోయిన శరీరాలు మొరాయించేసాయి. అప్పటికే అయిదున్నర అయింది. కొందరు టాక్సీలో వెళ్లారు కాని చాలామంది వెనక్కు వచ్చేసాము. 

          వచ్చి అందరూ ఫ్రెషప్ అయ్యాక విశాలంగా ఉన్న రిసెప్షన్ కమ్ డైనింగ్ హాలు లో  మా కెవి రావుగారి మధుర గీతాలు సత్యకామేశ్వరి సూచించిన విధంగా తమగురించి తాము  తెలియచేసుకున్న మాటలు తో చాలా బాగా ఎంజాయ్ చేసాము. 

          రోజూ రోటీ ఆలూ రాజ్మా చనా వంటి వంటలు  విసుగెత్తి బెండకాయలు కూరకి టమాటాలు పచ్చడికి కట్ చేసి నన్ను పిలవమని చంద్ర వాళ్ల కిచెన్ మా కిచెన్ గా చేసుకుని చేసిన బెండకాయ కూర టమాటపచ్చడి  అందరికీ సూపర్ గా నచ్చాయి. ఆ టిఫిన్స్ అయ్యాక  మర్నాడు అక్కడి ఫేమస్ చర్చ్ చూసి కులూ దారిపట్టాము. మిగతా విశేషాలు రేపు!

*****

  (సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.