“నెచ్చెలి”మాట 

నెచ్చెలి రచయిత(త్రు)లు/కవులకి సూచనలు-నిబంధనలు

-డా|| కె.గీత 

ఔత్సాహికంగా నెచ్చెలికి రచనలు పంపిస్తున్న రచయిత(త్రు)లు/కవులకి కొన్ని సూచనలు-నిబంధనలు :

  • మీ రచనని యూనికోడ్ లో అంటే వర్డ్ ఫైలు కానీ, డైరక్టుగా ఈ మైయిలులో టైపు చేసి కానీ మాత్రమే పంపాలి. PDF ఫైళ్లు స్వీకరించబడవు.
  • రచనతో బాటూ విధిగా హామీపత్రం, స్పష్టంగా ఉన్న మీ పాసుపోర్టు సైజు ఫోటో, ఒక చిన్న పారాగ్రాఫులో మీ వివరాలు విధిగా పంపించాలి. మీ వివరాలు కూడా యూనికోడ్ లోనే పంపాలి. PDF ఫైళ్లు స్వీకరించబడవు. అన్నీ ఒకే ఈ-మెయిలులో పంపాలి. ఒకొక్కదానికి ఒక్కొక్క ఈ మెయిలు పంపవద్దు.  
  • రచనలు కేవలం ఈమెయిలు ద్వారా మాత్రమే పంపాలి. దయచేసి మరి ఏ మాధ్యమాల ద్వారా పంపవద్దు.
  • రచన పంపిన ఈమెయిలుకి  రిప్లై కేవలం ఈమెయిలు ద్వారా మాత్రమే ఇవ్వబడుతుంది. దయచేసి మరి ఏ మాధ్యమాల ద్వారా రిప్లై ఆశించవద్దు. 
  • అత్యధికంగా రచనలు వస్తున్నందున పంపిన రచనను పరిశీలించడానికి కనీసం ఒక నెల, ప్రచురించడానికి కనీసం రెండు లేదా మూడు నెలల సమయం పడుతుంది.
  • రచన పంపిన తర్వాత, అలాగే మీ రచన ప్రచురితమైన తరువాత దయచేసి మీ ఈమెయిలుని అప్పుడప్పుడూ అయినా చెక్ చేసుకుంటూ ఉండండి. 
  • మీ రచన ప్రచురితమైన తరువాత నెచ్చెలి పత్రికలో మీ ఆర్టికల్ మీద వచ్చిన కామెంట్లకి సమాధానాలు ఇవ్వడం మర్చిపోకండి. 

ఆడియో & వీడియో 

నెచ్చెలిలో ఓ కథ విందాం!,  ఓ కవిత విందాం! ఆడియో & వీడియో శీర్షికలకి రచనలు పంపించే రచయిత(త్రు)లు/కవులు పాటించవలసిన నిబంధనలు:

  • స్వీయ రచనల ఆడియోలు మాత్రమే పంపాలి. 
  • రికార్డింగు స్పష్టంగా, చుట్టూ ఎటువంటి శబ్దం లేకుండా ఉండాలి. 
  • డైరక్ట్ రికార్డింగు ఫైలుని పంపాలి. యూట్యూబు వంటి మాధ్యమాలలో వచ్చిన లింకులు స్వీకరించబడవు. 
  • డైరక్ట్ రికార్డింగు ఫైళ్లు పెద్దవైతే Google లేదా One డ్రైవ్ ల  ద్వారా లేదా wetransfer లేదా sendgb వంటి మాధ్యమాల  ద్వారా పంపవచ్చు. 
  • రికార్డింగుతో బాటూ ఆయా రచనల్ని కూడా పంపాలి. రచనల్ని కేవలం యూనికోడ్ లో పంపాలి. PDF ఫైళ్లు స్వీకరించబడవు. ఇవన్నీ ఈమెయిలు ద్వారా మాత్రమే పంపాలి. దయచేసి మరి ఏ మాధ్యమాల ద్వారా పంపవద్దు.
  • రచన పంపిన ఈమెయిలుకి  రిప్లై కేవలం ఈమెయిలు ద్వారా మాత్రమే ఇవ్వబడుతుంది. దయచేసి మరి ఏ మాధ్యమాల ద్వారా రిప్లై ఆశించవద్దు. 
  • మీ రచనని, ఆడియో/వీడియోని పరిశీలించడానికి కనీసం ఒక నెల, ప్రచురించడానికి కనీసం రెండు లేదా మూడు నెలల సమయం పడుతుంది.
  • రచనని, ఆడియో/వీడియోని పంపిన తర్వాత, అలాగే మీ రచన ప్రచురితమైన తరువాత దయచేసి మీ ఈమెయిలుని అప్పుడప్పుడూ అయినా చెక్ చేసుకుంటూ ఉండండి. 
  • మీ రచన ప్రచురితమైన తరువాత నెచ్చెలి యూట్యూబు ఛానెల్లో, నెచ్చెలి పత్రికలో మీ ఆడియో/వీడియో మీద వచ్చిన కామెంట్లకి సమాధానాలు ఆయా మాధ్యమాల్లోనే ఇవ్వడం మర్చిపోకండి.

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

          ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటి పైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు. 

          మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.  

          వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి”లో  వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

ఆగస్టు, 2022 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు: సునీత పొత్తూరి

ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: శ్రీరాగాలు- 3 పి. సత్యవతి కథ ‘నేనొస్తున్నాను’

ఇరువురికీ అభినందనలు!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.