ఆస్కార్ బరిలో అచ్చతెనుగమ్మాయి – అపూర్వ చరణ్

-నీలిమ వంకాయల

          సినిమా రంగానికే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘ఆస్కార్’ అవార్డుల రేసులో  తెలుగు సినిమా నిలవాలి అనేది తెలుగువారందరి తపన. ఈసారి ఆ అవకాశం ‘ఆర్. ఆర్.ఆర్’ దక్కించుకుంటుంది అనే ఆశ నిరాశ అయినప్పటికీ మన తెలుగమ్మాయి అపూర్వ చరణ్ నిర్మించిన చిత్రం   జాయ్‌లాండ్ఆస్కార్ నామినేషన్ కి ఎంపికైంది.

          అపూర్వ హైదరాబాద్‌లో పుట్టి ఉత్తర కాలిఫోర్నియాలో పెరిగింది.  తన కెరీర్‌ను సింగపూర్‌లోని ఫ్రీమాంటిల్ మీడియాలో ప్రారంభించి ,  డిజిటల్ ప్రొడ్యూసర్‌గా ఎన్నో  ప్రధాన సిరీస్‌లలో పనిచేసింది.

        అపూర్వ చరణ్ డయానా లిన్ నటించిన LONELY BLUE NIGHTతో సహా ఇరవైకి పైగా షార్ట్ ఫిల్మ్‌లను నిర్మించింది.  మరొక షార్ట్ ఫిల్మ్‌ THE FAREWELL -AFI ఫెస్ట్ 2020లో ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌గా ఆడియన్స్ అవార్డును గెలుచుకుంది, అట్లాంటా FFలో అధికారికంగా ఎంపికైంది, HBO APA విజనరీస్ అవార్డుకు ఫైనలిస్ట్‌ లో నిలిచింది,  HBO Max, DISTANCEలో 29వ సింగపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2018లో ప్రదర్శించబడి, 2020లో ఫిల్మ్ పైప్‌లైన్ ఉత్తమ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది,   సెప్టెంబర్ 2018లో TIFFలో ప్రదర్శించబడి INTERIORS  Clermont-Ferrand-2019 కి అధికారికంగా  ఎంపిక అయ్యింది.

          అపూర్వ 2019 ప్రాజెక్ట్ ఇన్వాల్వ్ క్రియేటివ్ ప్రొడ్యూసింగ్ ఫెలో, 2020 ఫిల్మ్ ఇండిపెండెంట్ క్రియేటివ్ ప్రొడ్యూసింగ్ ల్యాబ్ ఫెలో, 2021 ఉమెన్ ఇన్ ఫిల్మ్ ఎమర్జింగ్ ప్రొడ్యూసర్స్ ఫెలోగా నిలవడమే కాక బిగ్ బీచ్- వాల్ట్ డిస్నీ స్టూడియోస్ లైవ్ యాక్షన్  డెవలప్‌మెంట్‌లో పనిచేసింది.

          వాస్తవానికి జాయ్‌లాండ్ఒక పాకిస్తానీ చిత్రం. ఈ చిత్రానికి పని చేసిన వాళ్ళంతా పాకిస్తానీయులే.   పాకిస్తాన్  ఆస్కార్ సెలక్షన్ కమిటీ ‘ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అవార్డ్’ కేటగిరీకి  అపూర్వ చరణ్ సమర్పించిన జాయ్‌లాండ్ ను షార్ట్‌లిస్ట్ చేసినట్లు, ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.  ఈ సంవత్సరం అకాడమీ అవార్డ్స్‌లో పోటీ పడేందుకు “అత్యుత్తమ వ్యక్తులలో ఒకరిని పంపగలిగినందుకు తాము సంతోషిస్తున్నామని పాకిస్తానీ సినిమా ఎట్టకేలకు ప్రపంచ వేదిక పై ఒక ముద్ర వేస్తుందని జాయ్‌లాండ్ ఆశను కల్పిస్తోందని  పాకిస్తాన్ ఆస్కార్‌ కమిటీ ఛైర్‌ షర్మీన్‌ ఒబైద్‌ చినోయ్‌ అన్నారు.

          అపూర్వ తండ్రి హరి చరణ్‌ ప్రసాద్‌ కూడా నిర్మాతే. ఆయన నిర్మించిన ‘కమలి’ చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది. అపూర్వ నిర్మాతగా మారటానికి  స్ఫూర్తి ఆమె తండ్రేనని చెప్పవచ్చు. ‘జాయ్‌ లాండ్‌’ని  వివిధ  అంతర్జాతీయ వేదికల పై ప్రదర్శించారు. ఎన్నో  అవార్డులూ అందుకొంది.  ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరీలో పాకిస్తాన్ నుంచి అఫీషియల్‌ ఎంట్రీగా ఆస్కార్‌కు వెళ్లింది.

          ‘జాయ్‌ లాండ్‌’ నిర్మాత అపూర్వ గురు చరణ్ , సహ నిర్మాత సర్మద్ సుల్తాన్ ఖూసత్ లు  మాట్లాడుతూ, ‘జాయ్‌లాండ్  నిర్మాణ ప్రయాణంలో  ప్రపంచవ్యాప్తంగా ఉన్న అద్భుతమైన టీమ్‌ని ఏకతాటిపైకి తెచ్చిందని,  ఇందువల్ల  నిజంగా దక్షిణాసియా, సార్వత్రిక మానవ కథలో పాకిస్తాన్  ఐక్యమైందని’ అన్నారు.

          అపూర్వ చరణ్ మరికొన్ని ఆణిముత్యాలు -2018లో లోకార్నోలో ఓపెన్ డోర్స్ హబ్‌కి ఎంపికైన GULAAB  అనే ఫీచర్ ఫిల్మ్, 2020లో ఫిల్మ్ ఇండిపెండెంట్ యొక్క ఫాస్ట్ ట్రాక్ , సిడ్నీ కిమ్మెల్ గ్లోబల్‌కు చెందిన HORIZON అనే సిరీస్ ఉన్నాయి. విభిన్నమైన మరియు వినూత్నమైన కథాంశాలపై దృష్టి సారించిన చరణ్, ప్రపంచ ప్రేక్షకుల కోసం  ప్రత్యేకమైన కథనాలను రూపొందించడమే తన లక్ష్యమని తెలియజేసింది. మన అచ్చ తెనుగమ్మాయి అపూర్వకు ఆస్కార్ దక్కాలని ఆశిద్దాం. 

*****

Please follow and like us:

7 thoughts on “ఆస్కార్ బరిలో అచ్చతెనుగమ్మాయి – అపూర్వ చరణ్”

  1. నీలిమ గారు, అపూర్వ గురించి చాలా చక్కగా, సమగ్రంగా చెప్పారు. నెచ్చెలి పత్రికకు, మీకు ప్రత్యేక ధన్యవాదాలు.
    -హరి చరణ ప్రసాదు.

    1. ‘నెచ్చెలి’ని చదివినందుకు, ప్రతిస్పందించినందుకు ధన్యవాదాలు హరి చరణ ప్రసాదు గారూ!
      -డా.కె.గీతామాధవి (ఎడిటర్)

      1. చాలా మంచి ఆర్టికల్. అపూర్వ చరణ్ గురించి మరియు ఆమె విజయాలను గురించి సమగ్రంగా వివరించారు. తండ్రి స్ఫూర్తి తో అపూర్వ పని చేయటం చాలా సంతోషాన్ని ఇచ్చింది.

    2. ప్రసాద్ సార్! నెచ్చెలి తెలుగు ఆర్టికల్ చదివి మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published.