పిల్ల చీమలు
-కందేపి రాణి ప్రసాద్
అదొక పెద్ద చీమల పుట్ట . రాత్రయింది పగలంత పని చేసి ఉండటంతో ఓళ్ళు మరిచి నిద్రపోతున్నారు . ఒకింట్లో పిల్ల చీమలు మాత్రం మెలుకువతో ఉన్నాయి . వాటికి నిద్ర రావడం లేదు కారణం ఏంటంటే ఉదయం తిన్న , లడ్డు రుచి గుర్తుకు కావడం .
అదేదో కొత్త ఇల్లు . ఇది వరకు ఎప్పుడు వెళ్ళలేదు . ఈరోజే అమ్మా నాన్నా చుట్టాలందరు కలసి వెళ్ళారు . వాళ్ళది గృహ ప్రవేశమట ఇంటినిండ బోలెడు స్వీట్లున్నాయి . అందులో లడ్డూలు చాలా తియ్యగా ఉన్నాయి . పిల్ల చీమలకు ఆ లడ్డూలే గుర్తుకొచ్చి నోరూరుతున్నది . మళ్ళీ వెళ్ళి తినోద్దామా ?
అడిగింది పిల్ల చీమ మరో పిల్ల చీమను . “ అమ్మానాన్న అరుస్తారేమో ” ? భయంగా అన్నది రెండో పిల్ల చీమ “ చెప్పకుండా పోదామా ” అన్నది మొదటి పిల్ల చీమ ‘ అమ్మో ‘ అమ్మ కొడుతుందేమో ? భయపడింది ” ఏం కాదు ! ఆడుకోవడానికి వెళ్తున్నామని
చెబుతా ? ” .
భరోసాగా చెప్పింది మొదటి పిల్ల చీమ సరే అన్నది రెండో పిల్లచీమ . తెల్లవారగానే వెల్దామని నిర్ణయించుకుని పడుకున్నాయి పిల్ల చీమలు .
ఆడుకోవడానికి వెళుతున్నామని చెప్పి పిల్లచీమలు కొత్తింటికి బయల్దేరాయి . ఆ కాలనిలోని మిగతా ఫ్రెండ్స్ అందరినీ తీసుకు వెళ్ళాయి . వరుసగా నడుచుకుంటూ వెళ్ళాయి .
ఆ ఇంటికి చేరాయి ఇంటి వాళ్ళు అందరు ఎవరి పనులల్లో వారున్నారు . చకచకా లోపలికి వెళ్ళాయి . ఆనందంగా నచ్చిన స్వీట్లు తినడం మొదలు పెట్టాయి ‘ ఇదేమిటి ఈ తెల్లని పొడి ‘ ? అంటూ ఆశ్చర్యంగా అడిగిందో పిల్లచీమ వాసన కూడ గాటుగా వస్తుంది అన్నది చీమ .
‘ అమ్మో ! నాకు కళ్ళు తిరుగుతున్నాయి అంటూ మరో చీమ పరుగెత్తింది మిగతా చీమలు అప్పటికే కళ్ళు తిరిగి పడిపోయాయి. పిల్ల చీమలు ఆ ఘాటుకు తట్టుకోలేక అటూ ఇటూ పరుగెత్తాయి . ఆ తర్వాత అవి కూడ కళ్ళు తిరిగి ఎప్పుడు పడిపోయాయో గుర్తులేదు .
పిల్ల చీమలు కళ్ళు తెరిచెసరికి తమ ఇంట్లో ఉన్నాయి . చుట్టూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాయి బందువులందరూ ఉన్నారు . ” ఇప్పుడెలా ఉందిరా ” ? అంటూ అమ్మా నాన్నా అదుర్దాగా అడిగారు . పిల్ల చీమలు కళ్ళు తెరచి నీరసంగా చూస్తూ బాగానే ఉన్నట్లుగా తల ఊపాయి .
మేమిక్కడికి ఎలా వచ్చాం ‘ ? ఆశ్చర్యపోతూ అడిగాయి పిల్ల చీమలు . అమ్మ ప్రేమగా తల నిమురుతూ విషయం చెప్పింది . “ చాలా సేపు మీరంతా కనపడక పోయేసరికి మీ కోసం వెతికాం ఎక్కడ కనబడ లేదు దాంతో అనుమానం వచ్చింది .
నిన్న వెళ్ళిన ఇంటికి వెళ్ళారేమో చూద్దాం అనుకున్నాం వెంటనే ఆ కొత్తింటికి మేమందరం వచ్చాం అప్పటికే మీరందరూ సృహ లేకుండా పడిపోయి ఉన్నారు . గబగబా మిమ్ముల్ని ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చేశాం . ఉదయం నుంచి డాక్టర్ మామయ్య మీకు వైద్యం అందిస్తూనే ఉన్నారు . ఇప్పటికి గాని మీరు కళ్ళు తెరిచారు చాలా ప్రమాదం తప్పింది ” కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ అమ్మ చెప్పింది . నాన్న దగ్గరగా వచ్చిముద్దు పెట్టుకున్నాడు .
ఇదంతా విని పిల్ల చీమలు కూడా ఏడ్చేశాయి “ అవునుగాని మేమెందుకు కళ్ళు తిరిగి పడిపోయాం ” ? అని అమాయకంగా అమ్మను అడిగాయి. అప్పుడు అమ్మ చెప్పింది.
మీరు స్వీట్లు తినడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు గమాక్సిన్ మందు చల్లారు. ఆ మందు వల్లె మీకు సమస్య వచ్చింది . మేము రావడం కాస్త ఆలస్యం అయితే మీ ప్రాణాలు దక్కేవి కాదు ” అంటుంటే అమ్మగొంతు బొంగురు పోయింది.
ఎందుకు ఆ మందు చల్లారమ్మ ? పిల్ల చీమలు అయోమయంగా అడిగాయి . “ మనల్ని చంపడానికి అలా చల్లారు . తెల్లని పొడిలా కనిపించిందన్నారు కదా ! అదే గమాక్సిన్ . మన పాలిట విషం . నిన్న అందరం వెళ్ళివచ్చాం కదా . వెంటనే మళ్ళీ అదే ఇంటికి వెళ్ళ కూడదు . ఇలాంటి ప్రమాదాలు ఎదురవుతాయి . మీరు పెద్దవాళ్ళకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు కన్నా . అంటూ అమ్మ ప్రేమగా చెప్పింది .
ఇన్ని ప్రమాదాలుంటాయని తెలీదమ్మా . ఈసారి నుంచి మీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళం . ” అంటూ పిల్లచీమలు అమ్మను అల్లుకు పోయాయి .
*****
నేను ప్రధానంగా బాలసాహిత్యం రాస్తాను.నేను సుమారుగా 40పుస్తకాలు రచించాను. బాలసాహిత్యం_విజ్ఞానికరచనలు అంశంపై PhD చేశాను.తెలుగు విశ్విద్యాలయం వరి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్న ను.20 ప్రక్రియలలో రచనలు చేశాను.టీచింగ్ aids,memontoes, బొమ్మలు చార్టులు,చేయటం ఇష్టం. మిల్కీ museum nu నిర్వహిస్తున్నాం.sweety children library nI pillala kosam pettanu.