కవయిత్రి మహెజబీన్ మానవ హక్కుల న్యాయవాది, ఫెమినిస్ట్ రచయిత్రి, సామాజికవేత్త. ఆమె తొలి కవితా సంపుటి, ఆకు రాలు కాలం, సాహితీ విమర్శకుల మన్ననలను అందుకుంది. కవిత్వంతో పాటు ఆమె కధలు, సాహిత్య సామాజిక, రాజకీయ వ్యాసాలు కూడా రాసారు. ఆమె రచనల్లో ప్రధానంగా జెండర్ జస్టిస్ మరియు పర్యావరణ స్పృహ ( Eco-Feminism) కనిపిస్తుంది. సామాజిక చైతన్య మున్న రచయిత్రిగా, స్త్రీల హక్కుల న్యాయవాదిగా మహెజబీన్ సాహిత్య ప్రపంచానికి తెలుసు. DAAD Fellowship తో జర్మనీ వెళ్లి ఫెమినిజం చదువుకున్నారు. Europe దేశాలలో జరిగిన అనేక అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని ప్రసంగించారు. United Nations/UN ఆహ్వానాన్ని అందుకొని NY/USA లో జరిగిన ప్రపంచ స్త్రీల సదస్సులో పాల్గొన్నారు. మహేజబీన్ కవిత్వం అనేక అంతర్జాతీయ యూనివర్సిటీ స్థాయి జర్నల్స్ లో ప్రచురించబడింది. Oxford University Press /UK , Wisconsin University Press /USA , Indian Literature , Penguin India, National Book Trust India/NBT ఆమె కవిత్వాన్ని ప్రచురించాయి. భారత ప్రభుత్వం నుండి స్త్రీ శక్తి పురస్కార్, జాతీయ అవార్డును అందుకున్నారు. ఈమె రాసిన స్ట్రీట్ చిల్డ్రన్ కవిత పదవ తరగతి పాఠ్యాంశంగా చేర్చబడింది. ఈ కృషికి గాను Ministry of Women and Child Development/ India నుండి రాజీవ్ గాంధీ మానవ సేవ జాతీయ అవార్డు అందు కున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి (United Andhra Pradesh State) కవిత్వానికి డిపార్ట్మెంట్ అఫ్ కల్చర్ అవార్డు, స్టేట్ లాంగ్వేజ్ కమిషన్ నుండి భాషా పురస్కారం, Telugu University award, అనేక సాహితి సాంస్కృతిక సంస్థల నుండి గౌరవ పురస్కారాలను అందుకున్నారు. Indian Diaspora తో కలిసి సాహిత్య సాంస్కృతిక
కార్యక్రమాలలో పాల్గొన్నారు.
Please follow and like us: