కొత్త రంగు
-లక్ష్మీ శ్రీనివాస్
ఈ రంగుల ప్రపంచంలో
ఈ రంగుకు రూపం ఉండదు
ఇదొక వింత రంగు
మార్కెట్లో దొరికే
రంగుల కంటే చాలా చిత్రమైనది
దుర్గుణ వర్ణాలతో కూడి
మనిషి రూపాన్ని మార్చేస్తుంది
ఈ రంగు పులుముకొన్న
మనుషుల్లో
ప్రేమలకు అనురాగాలకు
మంచితనానికి మానవత్వానికి
బంధాలకు బంధుత్వాలకు
బాధ్యతకు భరోసాకు
తేడా తెలియని మనిషిగా
ఒక వింత మనిషిగా
ఒక విచిత్ర వేష భాష ధారణతో
వికృత చేష్టలతో విహరిస్తుంటారు.
ఈ రంగులద్దుకొన్న
మనుషుల్ని కాస్తా గుర్తించండి
జనజీవన విధానాలను
తుంగలో తోక్కేస్తుంటారు
విలువలు మరిచి
విచ్చల విడిగా
కర్కోటక సర్పల్లా తిరుగుతూ
మానవాళిపై కాటేస్తుంటారు
ఈ రంగును ఖండించండి
మనుషులు నుంచి
కుటుంబాల నుంచి
సంఘం నుంచి
ప్రపంచం నుంచి
నీ నుంచి
ఆ కొత్త రంగును
ఈ వింత రంగును
ఖండించండి !!
ఆ రంగులద్దుకోన్న
మనుషుల్ని కాదు ?
మనిషిలో ఉన్న
ఈ కొత్త రంగును !
ఈ రంగు పులుముకొన్న
మనుషుల్లో
మూర్ఖత్వం మూడనమ్మక
స్వార్థం దౌర్జన్యం
అన్యాయం అక్రమం
కుట్రలు కుతంత్రాలు
వింత పైశాచిక ఆనందాలు
పులుముకొని తిరుగుతుంటారు
అందుకే ఈ రంగును
ఎక్కడ కనిపించిన ఖండించండి
ఆ రంగులద్దుకోన్న
మనుషుల్ని కాదు ?
మనిషిలో ఉన్న
ఈ కొత్త రంగును !
ఈ కొత్త రంగును !!
*****