
ఈజిప్టు పర్యటన – 1
-సుశీల నాగరాజ
నాకు ఇష్టమైన విషయాలలో ఒకటి ప్రదేశాలు చూడటం. ఎన్నో రోజుల్నించి ఈజిప్టు చూడాలన్న కోరిక మార్చినెలలో సాకారమైంది. నేటి యువతరం ఆన్ లైన్లో అన్నీ చూసుకొని, రిజర్వేషన్లు చేసుకొని, వాళ్ళకు నచ్చిన స్థలాలను ఎంచుకొని ఇష్టమైనన్ని రోజులు హాయిగా తిరిగి వస్తారు. మేము ఎప్పుడూ ట్రావెల్స్ ద్వారానే వెళ్తుంటాము. ఇందులో అనుకూలాలూ అనానుకూలాలూ రెండూ ఉన్నాయి. అన్నీ వాళ్ళే చూసుకొంటారు. ముఖ్యంగా భోజనాలకు వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. కానీ వారి సమయాన్ని పాలించాలి. చారియట్ వరల్డ్ టూర్స్ తో 8 రోజుల ఈజిప్టు పర్యటన. ప్రతివారము ఒక బ్యాచ్ ఈజిప్టు కు వెళ్తుందని చెప్పారు. నాకు ఆశ్చర్యం వేసింది. అక్కడ కు వెళ్ళిన తరువాత తెలిసింది. “ఈజిప్టు దేశానికి ముఖ్య ఆదాయం పర్యాటకులే!” అని.
ఈజిప్టులో విభిన్న సంస్కృతి కొన్ని వేల ఏళ్ల కిందే నెలకొంది. స్ఫింక్స్ , పిరమిడ్స్ , వాలీ ఆఫ్ కింగ్స్ లోని సమాధులు, లుక్సర్ ఇంకా కార్నాక్ లో ఉన్న దేవాలయాలు, పురాతన ఈజిప్టు సంస్కృతికి నిదర్శనాలు. సుమారు ఐదువేల సంవత్సరాలకు పూర్వం ఈజిప్టు లో ఫెరోల సామ్రాజ్య స్థాపన ప్రారంభమైంది. వీరు మరణానంతరం కూడా జీవితం పై ఉన్న నమ్మకంతో సమాధుల పేర్లతో పిరమిడ్లు నిర్మించారు. నైలు నది వల్లే ఈజిప్ట్ కు అంత ప్రాచుర్యం ఏర్పడింది.
చిన్నప్పుడు చదివింది, పాఠాలు చెప్పింది “Cradles of the Civilization’. అందులో. ” Egypt is the Gift of the Nile River”. Pyramids! Spinx ! 7 Wonders of the world! మొదటి నుంచి వాటి గురించి ఏ సినిమాలు ఉన్నా చూడటం ! పుస్తకాలు చదవటం చాలా ఆశక్తి ! మొదట “స్పింక్స్” సినిమా చూశాను. పుస్తకం లైబ్రరీలో వెతికి చదివే వరకు నాకు తృప్తి కలగలేదు. నవలల ఆధారం పై తీసిన ఇంగ్లీషు సినిమాలు చూశానంటే నవల వెదికి చదివే వరకు నాకు తృప్తి ఉండదు.
ఇలా ఈజిప్టు గురించి ఊహల పల్లకిలో ఊరేగుతూ ఉన్నాను. అది మార్చినెల 5వ తారీఖు 2019 లో సాకారమైంది.
మైసూరు నుండి 6 మంది మొత్తం 32 మంది బెంగళూరు నుంచి బయలుదేరాము. 5వ తారీఖు తెలవారి 4.55 కువైటు విమానంలో 5.30 గంటలు ప్రయాణం చేసి కువైటు , తరువాత 3 గంటల ప్రయాణం చేసి కైరో చేరుకొన్నాము. భారతదేశం 4.30 గంటలు ముందు ఉంది.” వీసా ఆన్ అరైవల్ ” టూరు మేనేజరు అవన్నీ సిద్ధం చేసి చూసుకొన్నారు. సిద్ధంగా ఉన్న బస్సులో హోటలుకు వెళ్ళి భోజనాలు చేశాము . తక్షణం మా పర్యటన ప్రారంభమైంది. ఆ రోజు పురాతనమైన కోట (Citadel) మరియు మోహమ్మదలి మసీది( Mosque of Mohammad Ali) చూశాము.
కైరోలోని ఈ కోట మద్యయుగం కాలంనాటి ఇస్లామిక్ కోట. 1976 లో యునెస్ కో వాళ్ళు ఒక ప్రపంచ వారసత్వ కేంద్రంగా ప్రకటించారు.( World Heritage Centre) . మోహమ్మదలి కాలంనాటి మసీదు (The Great Mosque of 1830 to 1848 Mohammed Ali) కోట పై భాగం లో ఈ మసీదు ఉంది.. 10,000 మంది చేరి ప్రార్థన చేసేటు వంటి విశాలమైన ప్రదేశం. ఇది ఒక టూరిస్ట్ ఆకర్షణ. ఆట్టొమాన్ టర్కుల శైలిలో కట్టబడి ఉంది . మద్య పెద్ద గోపురంతో చుట్టూ చిన్న నాలుగు అర్ద చంద్రాకారంలో గోపురాలు కట్టారు. మద్యనున్న గోపురం రంగులతో అలంకారాలతొ అందంగా , ఆకర్షణీయంగా ఉంది! చాలా అద్భుతం!
అక్కడ్నించి హోటలు మెరీడియన్ కు తీసుకువెళ్ళారు.. సామాన్లు రూములో పెట్టి ఫ్రష్ అయి అలాగే గిజా పిరమిడ్డు కు ‘Sound and Music ” కు వెళ్ళాము. నేపథ్య సంగీతంలో ఆ పిరమిడ్డు పై రంగుల దీపాలు వేస్తూ, వాటి గురించి వివరణ ఇస్తూంటారు. చాలా అద్భుతంగా ఉంది. ఆ బయలు ప్రదేశంలో వణికిపోయేంత చలి. రాత్రి అదే హోటల్లో భోజనం చేసి రూముకు వెళ్ళి మరసటి రోజుకు సిద్దం చేసుకొని పడుకొనేటప్పటికి రాత్రి 10 గంటలు పై బడింది. ప్రయాణం, నడక, ఇలా అందరం బాగా అలసిపోయాము. కైరో లో ఆహ్లాదకరమైన వాతావరణం. అక్కడ మూడు రోజులు ఉన్నాము!
( తరువాత గ్రేటు పిరమిడ్సు ఆఫ్ గిజా. స్పింక్స్ , సోలార్ బోట్ (మ్యూజియం), పర్ఫ్యూం షాప్, ఈజిప్షియన్ మ్యూజియం (మమ్మీస్ రూం) ఖలీల్ బజార్ వీటి గురించి.)
*****
(సశేషం)
