కీ

-లక్ష్మీ శ్రీనివాస్

ఆనాడు కొందరు
ఊపిరి విడిచి
ఊపిరి పోసిరి
ఊరూరు స్వేఛ్చగా 
ఉండాలని ఆశ పడిరి
ఆశలు ఆశలుగానే ఉన్నాయి
 
నేడు స్వేచ్ఛ
ఎగరేసిన ప్లాస్టిక్ పక్షిలా
మారిపోయింది
ఎక్కడ వాలమంటే 
అక్కడ వాలుతుంది
పాపం దానికేం తెలుసు ?
 
నేడు సమాజమే
“కీ” ఇచ్చే యంత్రంలా
మారిపోయింది 
ఆడించే ఆటబొమ్మలా 
మారిపోయింది
ఇంక ఎక్కడ స్వేచ్ఛ
స్వేచ్ఛ కూడా అక్కడే
ఎక్కడ ఉంటే “కీ”

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.