Expiration

-బండి అనూరాధ

 
వెళ్ళిపోతే వెళ్ళిపోయావు. 
ఈ దిగులునూ పట్టుకునివెళ్ళవలసింది.
చేతులు ఖాళీలేకపోతేనేం.
మనసు అరలో కుక్కుకునైనాపోవలసింది.
 
ఏకాంతాలదొంతరని తివాచీలా పరచి 
రాజసంగా నడిచి వెళ్ళిపోయావు. 
దేదీప్యమాన జ్ఞాపకాల రత్నాలు నలిగి అలిగి 
ప్రకాశించడం మానేసాయి. 
 
మళ్ళీ వస్తావని 
నా చుట్టూ ఉన్న ఏ పరిసరమూ నమ్మదు. 
నేనెలా నమ్మేదీ. 
 
మోహం సడలి మైకం వదిలి
హ్మ్ ..మజిలీలుండవు.  
ముగింపులే ఉంటాయి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.