పెదాలు చీకటి పడి

– శ్రీ సాహితి

మధ్యలో
ఓ పేజీలో మాటేసిన
ఓ వాక్యం కవాతుకు

నిద్ర లేని రాత్రులు
తూర్పార పట్టినా
గుండెకెత్తలేని కలకు

పోగైన జ్ఞాపకాలు
నిద్రలో నల్లగా
పొంగి పొర్లి

పట్టపగలే 
పెదాలు చీకటి పడి
పలుకు స్పర్శలేక

ఆకలి కళ్ళు
పాత మనసువైపు
తీపిగా చూస్తుంటే

కొత్త ఆకలికి
పాత శరీరంలో
లేని రుచి ఉంటుందా?

*****

Please follow and like us:

2 thoughts on “పెదాలు చీకటి పడి (కవిత)”

  1. మీ కవిత చాల బాగుంది …
    మీ శీర్షిక కవిత చదవడానికి ఆసక్తి ని పెంపొందిస్తుంది …
    శీర్షిక కి తగ్గట్టు కవిత కూడా చాల బాగుంది …

  2. “పెదాలు చీకటి పడి” – ఈ కవిత పేరు చూడగానే చదవాలనే ఆసక్తి కలిగింది. చదివాక, ఇంత చక్కటి చిక్కటి బాషలో ఆలతి పదాలతో భావయుక్తంగా కవితలు అల్లలాడడానికి యువ తరం ముందుకొస్తున్నందుకు చాలా సంతోషం కలిగింది.
    చిరంజీవి శ్రీ సాహితి కి హృదయపూర్వక అభినందనలు.

Leave a Reply

Your email address will not be published.