ప్రముఖ రచయిత్రి త్రిపురనేని రజనీ సుబ్రహ్మణ్యం గారితో నెచ్చెలి ముఖాముఖి

-డా||కె.గీత 

(త్రిపురనేని రజనీ సుబ్రహ్మణ్యం గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)

***

        ప్రముఖ రచయిత్రి త్రిపురనేని రజనీ సుబ్రహ్మణ్యం గారు త్రిపురనేని రామస్వామి చౌదరి గారి మనుమరాలు, త్రిపురనేని గోపీచంద్ గారి కుమార్తె, ప్రముఖ నటులు త్రిపురనేని సాయిచంద్ గారి అక్క. వారి నాన్నగారి అసమర్థుని జీవయాత్ర పట్ల మక్కువ తో తన కథాసంపుటికి “అసమర్థురాలి అంతరంగం” అని పేరు పెట్టారు.

        రజని గారు తాతగారైన రామస్వామి చౌదరి గారి సూతాశ్రమంలో 1945 లో త్రిపురనేని గోపీచంద్, శకుంతలాదేవి గార్లకు జన్మించారు. మద్రాసు, కర్నూలు, హైదరాబాద్ లలో విద్యాభ్యాసం చేశారు. ఎం.ఏ సోషియాలజీ చేసారు. బెంగుళూరు నివాసం. మాబోజల్ ఏడ్ కంపెనీకి ఇంగ్లీషు నించి తర్జుమాలు చేశారు. అయిదు సంవత్సరాల పాటు స్పార్టెక్ టైల్స్ కంపెనీ బిజినెస్ చేశారు. మూడు షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. అందులో వారణాసి లాస్ ఏంజిలిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ ఫారిన్ ఫిలిమ్ అవార్డు అందుకుంది. తోకచుక్క సినిమాకు సహరచయిత్రిగా పనిచేసారు.

ప్రచురణలు:

అసమర్థురాలి అంతరంగం (కథలు, వ్యాసాలు, అనువాదాలు)

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.