ఆ చిరునవ్వు ఆగిపోయింది

-పారుపల్లి అజయ్ కుమార్

 

మనిషి ఎంత ఎత్తు ఎదిగి  ఏం లాభం ?
మనసులో మాలిన్యాన్ని నింపుకొని …….

ఎంత చదువు చదివి ఏం ప్రయోజనం ?
సంస్కారం అన్నది లేకపోయాక ……

కత్తితో పొడిస్తేనో,
తుపాకీతో కాలిస్తేనో హత్యా ?

మాటలను తూటాలుగా పేల్చి
మనసును శకలాలుగా చేయటం
హత్య కాదా?

ఎన్నో గుండెలపై స్టెతస్కోప్ ను పెట్టి
హృదయ స్పందనలను విని ప్రతిస్పందించే గుండెలో

హేళనగా,
అసహ్యకరమైన రాతల
గునపాలు దించి
గాయాలు చేయటం
హత్య కాదా మరి ……

ఏ మనిషీ కావాలని మృత్యుదేవత ముందు మోకరిల్లరు …

మనసు కాస్త కలత పడగానే
మరణాన్ని కోరుకోరు ….

ఎన్ని అవమానాలు ,
ఎన్ని బాధలు
ఎన్ని హేళనలు,
ఎన్ని నిందలు భరించిందో………..

ఎన్ని రాత్రులు కన్నీళ్లతో
కరిగిపోయాయో ?

తన చుట్టూ మనుషులున్నా
మనసు గోడు  వినేవారు కరువై
ఎంత తల్లడిల్లి పోయిందో
పాపం ఆ చిట్టి తల్లి ..

ఎందరినో పోస్టుమార్టం చేసిన బల్లపై తానే పోస్టుమార్టం కు బలియై ….

శవాల గదిలో తానొక శవమై………

ఏవరికి తెలుస్తుంది
ఆహృదయపు రంపపు కోత ?

కుళ్లిపోయిన సమాజపు
కంపు భరించలేక
దేవ పారిజాత తావికోసం
గగనానికెగిరిపోయావా  చిన్న తల్లీ….

ఆ తల్లితండ్రుల  ఆవేదనకు
అంతం ఎప్పుడు ?

ప్రాణాలను
డబ్బులతో కొలిచే సమాజంలో
నైతిక విలువలకు స్థానమెక్కడ ?

చావులను సైతం
కులాల ,మతాల కళ్లల్లోంచి చూసే మనుషుల మద్య బతుకుతున్నాం మనం . …

మనిషి  బ్రతికున్నాడు
మానవత్వం చచ్చిపోయి ……

(మెడికో ప్రీతి చనిపోయినప్పుడు మనసులో చెలరేగిన భావాలకు అక్షర రూపం నా ఈ కవిత …)

*****

Please follow and like us:

10 thoughts on “ఆ చిరునవ్వు ఆగిపోయింది (కవిత)”

  1. సమకాలీన సామాజిక అంశాలపై కవి గాక ఇంకెవరు స్పందిస్తారు. గుండె లోతుల్లోంచి ఉబికి వచ్చే ఆవేశావేదనకు తార్కాణం ఈ కవిత్వం. నేడు ఈ సమాజంలో మనుషుల మానవతత్వాన్ని గురించి చిత్రీకరించేట్టు రాశారు. ఇలాంటి రచనలకు ప్రోత్సాహం ఇస్తున్న నెచ్చెలికి ధన్యవాదాలు

  2. ప్రాణాలను
    డబ్బులతో కొలిచే సమాజంలో
    నైతిక విలువలకు స్థానమెక్కడ ?నిజమే .. మనిషి విలువలు ఏనాడో పడిపోయాయి ,, ఒక్కోసారి అనిపిస్తుంది అసలెందుకు ఈ జీవితాలు అని .. మనిషికి విలువ వారు చనిపోతే కానీ రాదా అని .. ఆర్ద్రత తో నిండిన కవిత్వం

  3. ఆ చిరునవ్వు ఆగిపోయింది

    పారుపల్లి అజయ్ కుమార్ గారి ఈ కవిత చదువు తుంటే ప్రస్తుత సమాజంలో జరుగుతున్న దారుణ పరిస్థితులపై మనిషికి ఒక రకమైన జుగుప్స కలుగు తుంది.

    నిజమే తూటాలు లాంటి మాటలతో కూడా ఎదుటి వారిని హత్య చేసేయవచ్చు.

    మనిషి బ్రతికున్నాడు మానవత్వం చచ్చిపోయి…
    గొప్ప వాక్యం. తప్పుడు మనుషులు ఈ కవిత్వం చదవరు కానీ చదివితే సన్మార్గులు కావడం ఖాయం.

    కవికి నిండు మనసుతో అభినందనలు

    నల్లబాటి రాఘవేంద్రరావు
    9966212386

    1. నా కవిత మీకు నచ్చినందులకు ధన్యవాదములు .ఇప్పుడిపుడే అక్షర సేద్యం నేర్చుకుంటున్న వాడిని . మీ ఆశీస్సులతో మునుముందు మంచి మంచి కవితలు రాయగలననే నమ్మకం వస్తున్నది.

  4. మనిషి లోని మానవత్వం చచ్చిపోయి మనీకి
    బానిస గా తయారవుతున్నాడు.
    డబ్బు తోని ప్రతీదాన్ని కొనగలుగుతున్నారు.
    కవిత లోని ప్రతీ మాట ఆక్షరసత్యం.

  5. ప్రీతి మరణంపై కవితా రూపంలో మీ స్పందన బావుంది. మీరు ఉచిత లైబ్రరీ నడుపుతున్నానన్నారు. నాకు అడ్రసు ఇవ్వండి. నా రచనలు పంపగలను

    1. ధన్యవాదాలు మీకు. నా address:
      Parupalli satyanarayana pustaka Poodota.
      Mamata Hospital Road.
      Near Lakaaram Tank bund Fountain.
      Khammam
      507002.
      Mobile: 9849736069.
      Once again thank you for your response…
      మీ నవలలు విరోధాభాస, గొంతువిప్పిన గువ్వ పుస్తకాలు మా పూదోటలో వున్నాయి .

Leave a Reply

Your email address will not be published.