డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
అమ్మ పైన ఎన్ని కవితలు చదివినా మనసు నిండదు. గీతగారు ఈ గేయంలో తన కోణంలో అమ్మను రాగయుక్తంగా అద్భుతంగా ఆవిష్కరించారు. గీతగారికి అభినందనలు💐💐
ధన్యవాదాలు ఝాన్సీ గారూ!
డా కె. గీతా గారు మీరు రాసిన ‘అమృత వాహిని అమ్మే కదా ‘ పాట సింపుల్ గా హాయిగా మనసుకు హత్తుకునేలా ఉంది మీకు అభినందనలు 💐
ధన్యవాదాలు నాగలక్ష్మి గారూ!
అమ్మే కదా అమ్మే కదా అంటూ ఆద్యంతా మనసులని మీటుతూ ఎంతో హృద్యంగా ఆలపించిన ఉప్పెనలా ఉపద్రవం వచ్చిన తనువునే తరువుగా కాచిన ఆశనిరాశ ల
నడుమ ఏమి ఆశించిన నిస్వార్థపు మహనీయురాలు అమ్మ
ఎంత చెప్పిన తక్కువే ఏమిచ్చిన ఋణం తీర్చుకోలేము ఆ అమ్మ ప్రాదాలకి ప్రణామాలు గీతగారికి హృదయ పూర్వక అభినందనలు⚘️⚘️⚘️⚘️⚘️👏👏👏
ధన్యవాదాలు యామినిగారూ!
ధన్యవాదాలు యామిని గారూ!
డా. కె. గీత గారు వ్రాసిన అమృత వాహిని రచన కలం గళం అద్భుతంగా ఉంది సో…. హార్ట్ టచింగ్ మేడమ్ గారు. హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు 👏👌💐👏👌💐👏👌💐👏👌💐👏👌💐🤝🌹
ధన్యవాదాలు అఫ్సర గారూ!
డా.కె. గీత గారి ‘అమృతవాహిని అమ్మే కదా’ అన్న గేయం చదివాను. మాతృమూర్తి తన బిడ్డలను ఎన్నో కష్టాలను అనుభవిస్తూ పెంచుతుంది. అందుకే ముందు తల్లికి, తరువాత తండ్రికి, తరువాత ఆచార్యునికి, ఆపైన పరమాత్మకు నమస్కరించుకోవాలి. ఈ గేయంలో తల్లిప్రేమను తనదైన శైలిలో డా.కె.గీతగారు చక్కగా వివరించారు. గేయం బాగున్నది.
మీ ఆత్మీయ ప్రతిస్పందనకు ధన్యవాదాలు రంగారావు గారూ!