Please follow and like us:
1958 జూలై 12 న పుట్టిన శిలాలోలిత అసలుపేరు పి.లక్ష్మి. వీరు కవియాకూబ్ గారి సహచరి.
పుట్టింది, పెరిగింది హైదరాబాద్ కు సమీపంలోని శంషాబాద్. తండ్రిగారు కీ.శే. పురిటిపాటి రామిరెడ్డి హిందీ పండిట్ గా హైదరాబాద్ పరిసరాల్లోనే ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం వల్ల బాల్యమంతా ఇసామియా బజార్,నింబోలిఅడ్డ, మలక్ పేటలలో గడిచింది.
తెలుగుసాహిత్యంలో ఎం ఏ, ఎం ఫిల్, పిహెచ్ డి లు తెలుగు విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయంలలో పూర్తిచేసి తెలుగు అధ్యాపకత్వంలో స్థిరపడి ఇటీవలే రిటైరయ్యారు.
కవితా సంపుటులు :
పంజరాన్నీ నేనే, పక్షినీ నేనే(1999), ఎంతెంత దూరం(2005), గాజునది(2013), The Inner Courtyard (Prof. Suneetha Rani Translation ; Published Web version in Amazon Books Series)2017
స్త్రీని ఆకాశంతో పోల్చి కొత్తలోకం కవితను ఆకాశానికెత్తేశారు.
ఆకాశంతో స్త్రీ పోలికను శిలాలోలితగారు అద్భుతంగా చెప్పారు. స్త్రీ వివిధ స్థితిగతులను రంగులతో సమన్వయ పరచటం బావుంది. వారి కలానికి నా హృదయ పూర్వక అభినందనలు💐💐
సముద్రంలా ఆకాశంలా సొంత రంగులను కోల్పోయిన బతుకు రంగుల నేరుకుంటూ జీవించక .. ఆమె.. మెదడు మనసు హృదయ తక్కెడలో తనను తాను పరిశీలించుకుంటే..
ఆమె( స్త్రీ) జీవితం రంగుల తోటలో పరిమళించే పాట పాడుకుంటూ “కొత్త లోకాన్ని” చూడగలదనే సత్యాన్ని ఆత్మస్థైర్యాన్ని నింపే శిలాలోలిత గారి చక్కని కవితకు అభినందనలు👌💐❤️
శిలాలోలిత గారి “కొత్తలోకం”కవిత ఆమె …గురించి తెలిపిన శైలి అద్భుతం.తనకు తాను తక్కేడలో కాక మనస్సుతో ,మెదడుతో,హృదయంతో హెచ్చవేయ గలగాలి అని చెప్పటం చాలా బాగుంది.బాబీ కవిత్వం బాగా తెలుసు…గాజునది అనుభూతి ఇంకా మరువ లేదు…మంచి కవిత ప్రచురించిన డా. కె.గీత గారికి ధన్యవాదములు…
రంగులతో జయాపజయాలను , జీవితంలోని ఎత్తుపల్లాలని పోల్చగలగడం ఒక్క రచయతకే సాధ్యం . ఒక్కో వర్ణంలో అన్ని పార్శ్వలను దర్శించగలగడం లక్ష్మి గారిలోని సునిశిత పరిశీలనకు తార్కాణం .
ఆకాశానికి మన దేశ సగటు స్త్రీకి పోలికను సమన్వయం చేస్తూ శిలాలోలిత అమ్మ రాసిన కవిత చాలా బాగుంది. ఏ రంగు తోడుక్కుంటే అదే తన రంగని మురిసిపోయే భ్రమల గురించి తేటతెల్లం చేసిన కవిత.
Excellent poem
భావుకతతో పాటు భావోద్వేగం కలగలిసిన కవనం. అద్భుతంగా కదిలింది కలం. అభినందనలు మేడమ్
కవిత చాలా బాగుంది.
ఆమెను అనంతమైన ఆకాశమంతో పోల్చడం చాలా బాగుంది. అలుపెరుగక ఎదురీదే ఆమె గురించి విపులీకరిస్తూ శిలాలోలిత అమ్మగారి కవిత్వం రమణీయం.