డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
చిన్న జీవితం చదవగానే నా కళ్ళు నా అదుపు తప్పినవి. మా వారు చనిపోయిన రోజు! అన్ని సమకూర్చు కొని, అసలైన జీవితం మొదలైన సమయానికి, నాకు ఒంటరి పోరాటం మిగిలింది. వాస్తవాన్ని కవిత రూపంలో అందజేశారు. ఒకసారి నా గతంలోకి వెళ్లాను.🙏
చిన్న జీవితం కవిత లో మీరు చెప్పిన సత్యం అందరూ ఎరిగిందే అయినా మన రోజువారీ కోపాలు ఇర్శ్య అసూయలు మధ్య మానసిక బలహీనతకు గురు అయిపోయి మర్చిపోకుండా చాలా చకగా కవిత ద్వారా గుర్తు చేశారు.
ధన్యవాదాలు-
గీత గారి “చిన్న జీవితం “ సంపాదకీయం
‘జీవితం బుద్బుదప్రాయం,’’దినదిన గండం నూరేళ్ళ ఆయుశ్సు అన్న నాడిని/ సామెతకు గుర్తు చేస్తుంది.
‘రేపు ‘అనే వాయదా వేయక అనుకున్నది అనుకున్నప్పుడే చేయడం ;చూడాలని/ కలవాలనుకున్న వారిని
కలిసి పలకరించడం చేయమని జీవితం చాల చిన్నదనే సత్యాన్ని తెలిపే మంచి సందేశాన్ని ఇచ్చారు
మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు విజయలక్ష్మిపండిట్ గారూ!
నెచ్చెలి మాట చిన్న జీవితం అని చాలా చక్కని కవిత ద్వారా చాలా బాగా చెప్పారు గీతా మేడమ్ గారు💐🍩💐💐💐💐🌹🤝🌹