చిత్రం-48

-గణేశ్వరరావు 

          ఇంగ్లాండ్ లో స్థిరపడ్డ ఫోటోగ్రాఫర్ ఆడమ్ బర్డ్. కి నగర జీవితం అంటే విసుగు. వీలైనప్పుడల్లా అడవికి వెళ్తుంటాడు. ఒక కాల్పనిక ప్రపంచాన్ని సృష్టించడానికి అక్కడ అనువైన ప్రదేశాన్ని వెతుక్కుంటాడు. అప్పటికే తనకు తెలిసిన కథల పైన దృష్టి పెడతాడు. తాను ఎంపిక చేసిన మోడల్స్ ను అక్కడకు తీసుకెళ్తాడు. అవసరమైన సామగ్రిని చేరుస్తాడు. ఇంచు మించు ఒక సినిమా తీసినంత సందడి చేస్తాడు. కథా నేపథ్యం వివరించి తన మోడల్స్ చేత వాటిలోని పాత్రల హావభావాలను ప్రదర్శింప చేస్తాడు. అలా తన ఫోటోలు చూసే చూపరులను తన స్వాప్నిక జగత్తులోనికి స్వాగతి స్తాడు. ఒక్కొక్కసారి అతను తీసిన ఫోటోలలో అధివాస్తవికత తొంగి చూస్తుంటుంది. ఏది ఏమైనా అతని ఫోటోలు చూడడం ఒక గొప్ప అనుభూతి కలిగిస్తుంది. చూడగానే మనకు ఆ జానపద కథ గుర్తొచ్చేలా చేయడం ఆడమ్ ప్రతిభకు కారణం. అతని ఆల్బం చూస్తూ పోతూ వుంటే, మనం కూడా ఒక ఊహాలోకంలోకి ప్రయాణం చేస్తున్నట్టు భావన కలుగు తుంది. అనేకసార్లు అతని ఫోటోల్లోని హీరో, హీరోయిన్లతో మమేకమవుతాం. అది అతని conceptual photography యొక్క గొప్పతనం.
 
          డిస్నీ రాకుమార్తె బెల్ ను ఆడమ్ ఇలా ఫోటో తీసాడు. ఆ పాత్ర Beauty and the Beast లో వస్తుంది. బీస్ట్ చెర నుంచి తన తండ్రిని విడిపించడానికి బెల్ ప్రయత్నిస్తుంది. అందరూ అనుకున్నంత దుర్మార్గుడు కాదని తెలిసాక అతన్ని ప్రేమిస్తుంది. చివర్లో అతనో రాకుమారుడని శాపవశాత్తు క్రూర మృగంగా మారాడని గ్రహిస్తుంది. బెల్ ను రూపకల్పన చేయడంలో ఆడమ్ ఎంత శ్రమ పడ్డాడో ఈ ఫోటో చూడగానే గ్రహించగలం.
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.