“నెచ్చెలి”మాట 

పురుషులతోడిదే జీవనం

-డా|| కె.గీత 

ఇదేవిటి?
పురుషులతోడిదే జీవనం
స్త్రీలతోడిదే జీవనం
ఉండునా?

నామమాత్రపు
స్త్రీలతోడిదే జీవనం
ఎక్కడో ఉన్నప్పటికీ
ఖచ్చితంగా
పురుషులతోడిదే జీవనం
ఉండును

అసలిది
మీకు
తెలుసా!
పురుషులతోడిదే
జీవనం
అని నమ్మడం
కళ్ళు మూసుకుని
జీవించడం
ఒక్కటే-

తండ్రి
అన్నయ్య
తమ్ముడు
భర్త
కొడుకు
బంధమేదైనా
బతుకు
ఎవరికో
ఒకరికి
అప్పగించి
నిశ్చింతగా
పచారీలు
తెచ్చుకోవడం
తెలుసుకోకుండా
టీవీ
చూస్తూ
గడిపే
జీవితం
బానే ఉండును-
కాదు కాదు
బహు భేషుగ్గా
ఉండును!

మరి
వచ్చిన
చిక్కేవిటీ?

ఉద్బోధనలేవిటీ?

వస్తున్నా
అక్కడికే
వస్తున్నా-
హాయిగా
కడుపులో
చల్ల
కదలకుండా
ఉండు
జీవితంబు
ఎంత
వరకు
సజావుగా
ఉండును?

అన్నీ
సక్రమంగా
జరిగిన
వరకు-

హఠాత్తుగా
సదరు
భర్తకేమైనా
అయితే?

సదరు
భర్తగారికి
మోజు తీరి
“పోతే”?

సదరు
భర్త
……
…….

అబ్బా!
ఈ రోజుల్లో
ఎవరున్నారండీ
ఇంత
ఆధారపడే
ఆడవాళ్లు!

అయినా
ఇవన్నీ
నూటికో
కోటికో
ఒక్కరికి
జరుగుతాయి
అందులో
మనం ఉంటామా?

హయ్యో!
అందులో
ఉన్నవాళ్ళ
కోసమేనండీ
ఇదంతా-

అందులో
ఏ అమ్మాయీ
ఉండకూడదనే
ఇదంతా!

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

          ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు. 

          మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.  

          వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి” వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

మే  2023 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు: ధరణి

ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: ఆ చిరునవ్వు ఆగిపోయింది (కవిత) –పారుపల్లి అజయ్ కుమార్

ఇరువురికీ  అభినందనలు!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.