పాటతో ప్రయాణం-3

– రేణుక అయోల  

ఈ పాట papon అనే singer పాడుతాడు.
ఇతని విలక్షణ మైనగొంతుకు ఈ పాటని ఎన్నోసార్లు వినేలా చేస్తుంది..

ఈ పాటలో మొదటి రెండు చరణాలు చాలా ఇష్టంగా విన్నాను. చాలా సార్లు విన్నాను. ఇంకా ఆగలేక నా friend కి కూడా షేర్ చేసాను… మీకు నచ్చితే తప్పకుండా ఈ పాట వినండి.

ఈ పాట నాభావాలతో మీకోసం ..

Kuch rishton ka namak hi doori hota hai
Na milna bhi bahut zaroori hota hai

కొన్ని బంధాలలో ఉన్న బంధమే ఉప్పగా అయిపోతుంది
కలవకపోవడమే చాలా అవసరం అయిపోతుంది..

మనసులో ఎంతో ప్రేమ ఉన్న కొన్ని పరిస్థితుల్లో బయటికి చెప్పుకోలేము. అంతా మనసులోనే వుంది అంటే నమ్మకం కుదరదు అయినా తప్పదు…

तू बात करे या ना मुझसे
चाहे आँखों का पैगाम न ले

నువ్వు నాతో మాట్లాడక పోయినా
కళ్ళ సందేశాలు తీసుకోక పోయినా
అరే పిచ్చి దానా ఇలా మాత్రం అనకు !
నిన్ను చూడొద్దని, నీ పేరు పిలవొద్దని

నువ్వు చెప్పాలే గాని
బులల్లేహ షాహ సోదాయి అయిపోతాను అంటాడు

నాప్రేమ ఎప్పుడూ సగమే
దానికే హృదయం సిగ్గు పడుతుంది
పూర్తి అనిపిస్తూనే ఆగిపోతుంది
మిగిలినది సగమైనా జీవించి ఉన్నాయి

అవి ఒక నమ్మకాన్ని సహిస్తూ
నీ ఇంటి ద్వారం ముందు
వాటికి ఆగిపోని నిర్లక్ష్యంలో
నా మనసే వొక పక్షి..

అంటూ పాడే ఈ పాటని వింటారుగా
మరెందుకు ఆలస్యం వెంటనే వినండి….

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.