ప్రముఖ రచయిత్రి డా.సి.భవానీదేవి గారితో నెచ్చెలి ముఖాముఖి
-డా||కె.గీత
(డా.సి.భవానీదేవి గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)
***
డా సి.భవానీదేవి గత 50 ఏళ్ళుగా తెలుగు భాషా సాహిత్య రంగాలలోని అనేక ప్రక్రియల్లో గణనీయ రచనలు చేసిన రచయిత్రి. స్వస్థలం గుంటూరు జిల్లా బాపట్ల. శ్రీ కోటంరాజు సత్యనారాయణ శర్మ, శ్రీమతి అలివేలు మంగతాయారు తల్లిదండ్రులు. సికిందరాబాదులో జన్మించారు. వీరికి తెలుగుతో పాటు హిందీ భాషలో కూడా పరిజ్ఞాన ముంది. “స్వాతంత్య్రానంతరం తెలుగు హిందీ కవిత” లపై తులనాత్మక అధ్యయనం చేసి పి.హెచ్.డి. పట్టా పొందారు. అంతేకాక ఆమె న్యాయశాస్త్రంలో కూడా పట్టభద్రులు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి హిందీలో ఎం.ఎ., ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం.ఎ, ఎల్.ఎల్.బి., పి.హెచ్.డి. పట్టాలు పొందారు. కవిత్వం, కథలు, నవల లు, సాహితీ విమర్శ, నాటకం, బాలసాహిత్యం, జీవితచరిత్ర, లలితగీతాలు మొదలైన ప్రక్రియలలో రచనలు చేసారు. వీరు సచివాలయంలో ప్రభుత్వ ఉప కార్యదర్శిగాఉన్నత పదవిలో పనిచేసి పదవీవిరమణ తరువాత ప్రస్తుతం హైదరాబాదులో నివసిస్తున్నారు.
భారతప్రభుత్వ సాంస్కృతిక విభాగ సీనియర్ ఫెలోషిప్ ఎంపికలో “ స్వాతంత్రయా నంతర తెలుగు-హిందీ కవిత్వంలో స్త్రీ” ప్రచురించారు. ఆం. ప్ర. సచివాలయ సర్వీసుల నుండి ఉపకార్యదర్శిగా పదవీ విరమణ చేశారు.
16 కవితా సంపుటాలు, 4 కథాసంపుటాలు, 4 నవలలు, 7 బాలసాహిత్యం, 2 నియో లిటరేచర్, 9 అనువాదాలు, 3 వ్యాససంపుటులు, 11 వివిధ ప్రక్రియలు, జీవిత చరిత్రలు, మొదలైన 56 ప్రచురణలు వెలువరించారు. 2 టి. వి. సీరియల్స్, 12 గేయాల క్యాసెట్లు శ్రవ్య సాహిత్యంగా వెలువడ్డాయి. అనేక నాటక, నాటికలు, సంగీత రూపకాలు ప్రసారాలు, ప్రదర్శితాలు. నలభైకి పైగా ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్న భవానీదేవికి సాహితీ స్వర్ణోత్సవ సంవత్సర అభినందనలు.
వీరి రచనలు:
కవిత్వం:
నాలోని నాదాలు (1986)
గవేషణ (1993)
శబ్దస్పర్శ (1996)
వర్ణనిశి (2001)
భవానీ నానీలు (2004)
అక్షరం నా అస్థిత్వం (2006)
హైదరాబాద్ నానీలు (2007)
కెరటం నా కిరీటం (2009)
కోయిలా పాడవే (గేయసంపుటి – 2009)
రగిలిన క్షణాలు (2012)
ఇంత దూరం గడిచాక (2014)
భవాని కవిత్వం 1 (2014)
భవాని కవిత్వం 2 (2014)
భవానీ గీతాలు (2016)
నది అంచున నడుస్తూ (2017)
వేళ్ళని వెతికే చెట్లు (2021)
కథా సంపుటాలు:
అంతరంగ చిత్రాలు[9] (1993)
అమ్మా నన్ను క్షమించొద్దు (2008)
తప్తశిల (2014)
వ్యాస సంపుటాలు
అధ్యయనం (2007)
కవయిత్రుల నానీలు (2007)
చివరివలస (2023)
నవలలు:
మందాకిని (1990)
కొత్తానక్షత్రం (2014)
బంగారుకల (2015)
మరోచరిత (2023)
సాహిత్య విమర్శ:
స్వాతంత్య్రనంతర తెలుగు, హిందీ కవిత- తులనాత్మక పరిశీలన (సిద్ధాంత గ్రంథం)[10]
నాటకం:
బొబ్బిలి యుద్ధం
జీవితచరిత్రలు:
కొర్రపాటి గంగాధరరావు జీవితం-సాహిత్యం
బాలసాహిత్యం:
అమరజీవి (2001)
కందుకూరివీరేశలింగం (2001)
స్వామివివేకానంద (2001)
బాలకార్మికులు (2001)
అన్నమాచార్య (2001)
జానపద కళలు (2001)
తాతా@మనవడు.కామ్ (‘నది’ కాలం కథలు – 2007 – 2011)
నియోలిటిరేచర్ :
రక్తపోటు (1998)
నా కథ (1998)
అనువాదాలు :
నరుడు-నారాయణుడు (శ్రీరామకృష్ణ మఠం ప్రచురణ) (తెలుగు-హిందీ)
త్యాగయోగం (1996) (హిందీ-తెలుగు)
గాయపడిన కాకి కథ (NBT – 2008) (హిందీ-తెలుగు)
అక్షర్ మేర అస్తిత్వ్ (కవిత్వం) (తెలుగు-హిందీ)
అగ్ని (నవల) (మలయాళం-ఇంగ్లీష్-తెలుగు) – ఎమెస్కో ప్రచురణ
మిల్ జుల్ మన్ – కలసిన మనసులు (హిందీ-తెలుగు) (2021) – సెంట్రల్ సాహిత్య అకాడమీ ప్రచురణ
కరోనా కెలమిటీ – నానీలు (తెలుగు-ఇంగ్లీష్) (2022)
ఇంకెవ్వరూ కాదు (హిందీ-తెలుగు) (2023) – కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురణ
వ్యాససంపుటాలు:
వ్యాసభూమి (2014)
అధ్యయనం (2007)
కవయిత్రుల నానీలు (2007)
సత్కారాలు, పురస్కారాలు:
శబ్దస్పర్శ కావ్యానికి ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డ్ -1996లో
“ఇంత దూరం గడిచాక” పుస్తకానికి 2016 సంవత్సర ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం లభించింది.
*****