“నెచ్చెలి”మాట 

వాగ్దానాలు – వరదలు

-డా|| కె.గీత 

బాబోయ్
వాగ్దానాలు!

అదేదో
వరదొచ్చినట్టు

అయ్యో
వరదలండీ
వరదలు!

వాగ్దానాల
వరదలా?

వరదల
వరదలా?

రెండూనూ-

ఏది మంచిది?

ఎవరికి?

ఏలినవారికా!
ఏలుతున్నవారికా!
ఏలబోయేవారికా!

వారికన్నీ
మంచివే!

ఆర్చేవారా!
తీర్చేవారా!
నోటి మాటేగా

వాగ్దానాలా?
వరదలా?

రెండూనూ-

ఒకటి
కంటిమెరుపులకీ
రెండు
కంటితుడుపుకీ

మనబోటి
ససామాన్యుల
సంగతో!

మన సంగతే
చెప్పుకోవాలా?

వాగ్దానానికి పొంగీ-
వరదొస్తే కుంగీ-

అయినా
అయిదేళ్ళకోసారేగా

ఏడాదికోసారి
వస్తూనే ఉన్నాయిగా

అయినా
మన పిచ్చి గానీ
కంటిమెరుపులూ
కంటితుడుపులూ
లేని
ఎలక్షనుకాలముందా!
వర్షాకాలముందా!

అందుకే మరి-

వాగ్దానాలు
వరదలు
అన్నిటినీ
తట్టుకునే
ససామాన్యులం!

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

          ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణా త్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు. 

          మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.  

          వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి” వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

అక్టోబరు 2023 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు: పద్మావతి నీలంరాజు
ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: ఎక్కడ వెతికేది?(కవిత) – శీలా పల్లవి
ఇరువురికీ అభినందనలు!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.