కట్టె మోపు..!
(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)
– సాయి కిషోర్ గిద్దలూరు
మా అవ్వ కట్టెమోపును
తీసుకొచ్చేవేళ ఎండకు ఎండని కట్టెమోపుతో తనకు
ఎండుతుందానే ఓ నమ్మకం.
తాను వచ్చేవెళ తన అరపాదం
చూస్తే ముళ్ళతో కుర్చినట్టుంటాది..
అవ్వనడుస్తుంటే నింగిమొత్తం నల్లటి మబ్బులతో
చినుకుజల్లు వర్షం కురిసేది
అప్పుడే అంబరముకూడా అవ్వబాధ
తెలుసుకుంది కాబోలు
అవ్వపాదాలు నీటితో తడుస్తుంటే
అవ్వ ముఖంలో చిరునవ్వు కనిపించేది.
అప్పుడే
మా అవ్వతో కట్టెమోపును
నేను తీసుకొని మా ఇంటిదాక వెళ్ళాను..
మా అవ్వ చెప్పిన ఓ మాట
“స్రీ ఒక పుస్తకభాగం ఈ సమాజానికి ఓ నిండి కుండ”…
మా అవ్వకు నాకు
విడలేని ఓ తీపి కబురు…
ఓ కట్టెమోపు..
*****