మనల్ని విడిచి పెట్టి వెళ్ళిపోయిన మన అనుకున్న వాళ్ళు తిరిగి రారని తెలిసినా ఏదో వెర్రి ఆశ. దుఃఖంతో మనుసులో అనుకునే మాటలు, వాటి తాలూకు స్పర్శలు. ఈ గజల్ వింటుంటే అనిపిస్తుంది “నిజానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎప్పటికీ తిరిగిరారు, అయినా ఏదో తపన లాంటి వుత్తరం.” నా భావాలతో మీకు అందిస్తున్నాను.
మరి ఈ సినిమా గజల్ వినేయండి ..
Chithhi na koyi sandesh…
Ho… Chithhi na koi sandesh
Jaane woh kaun sa desh jaha tum chale gaye
Chithhi na koyi sandesh
Jaane woh kaun sa desh jaha tum chale gaye
Chithhi na koyi sandesh
నువ్వు వెళ్ళిపోయావు సరే
ఓ చిన్న వుత్తరం ఓ చిన్న సందేశం పంపలేకపోయావా
ఏదేశం వెళ్ళిపోయావు ?ఎక్కడికి వెళ్ళి పోయావో ఎవరికి తెలుసు ?
గుండెని గాయం చేసి మరీ వెళ్ళిపోయావు ,
వెళ్ళేటప్పుడు నీ హృదయం విలపించిందా
నేను వినలేక పోయానా ?
వెళ్తూ వెళ్తూ పిలిచే వుంటావేమో
దుఖంలో ఇప్పుడనిపిస్తోంది
ఆ నిమిషంలో
నేను ఎక్కడ వున్నానా అని ..
ప్రతీ వస్తువులో నీ జ్జాపకం వెన్నాడుతోంది,
కన్నీళ్ళతో నీ పేరు రాస్తున్నాను
ఈ దార్లు ఈ సందులు నీకు వీడ్కోలు చెప్పలేక పోతున్నాయి .
తొందరగా చెయ్యి వదిలేసావేమో
చెప్పాల్సింది ఈ గుండెలో ఇంకా మిగిలిపోయింది
ఇప్పుడు జ్జాపకాల ముళ్ళే మిగిలున్నాయి
ఇప్పటికీ గుచ్చు కుంటున్నాయి
ఈ ప్రేమ ఇంకా నిన్ను వెతుకుతోంది ఎలా నిరాకరించను ?
నువ్వు వెళ్ళిపోయావు సరే ఓ చిన్న వుత్తరం ఓ చిన్న సందేశం పంలేకపోయావా
Chithhi na koyi sandesh…
Ho… Chithhi na koi sandesh
Jaane woh kaun sa desh jaha tum chale gaye
Chithhi na koyi sandesh
Jaane woh kaun sa desh jaha tum chale gaye
Chithhi na koyi sandesh..