“నెచ్చెలి”మాట 

సరికొత్త 2024వ సంవత్సరం!

-డా|| కె.గీత 

నూతన సంవత్సరంలోకి
వచ్చేసాం!

నూతనం
అని
అనుకోవడమే
వినూత్నంగా
ఉంటుంది కదూ!

కొత్తదేదైనా
వింతే!
మార్పు
ఎప్పుడూ
ఆహ్వానించదగినదే!

కొత్తదనం
సువాసన-
ఉత్సాహం-
బలం-
వేరు కదూ!

కానీ
కొన్ని
పాతలు-
జ్ఞాపకాలు-
శిథిలాలు-
బాధలు-

నిరంతరం
వెంటాడాల్సినవీ
అంతర్లీనంగా
భద్రంగా
మోసుకెళ్ళడమే

కొత్తదనానికి
ఆభరణం
కదూ!

కొన్ని ముగిసిన
కథల్ని
కొన్ని ఆగిపోయిన
పేజీల్ని
కొన్ని విరిగిపోయిన
మనసుల్ని

కొత్తగా
మళ్ళీ
మొదలెట్టడమే
జీవితం
కదూ!

ఎప్పటికీ
నెరవేరని
కొన్ని
ఆశయాలు!
ఎన్నడూ
నెరవేర్చని
కొన్ని
ఆకాంక్షలు!

అయితేనేం
తీర్మానాలు
చేసుకొందుకు
వెనకాడని
కొత్తదనమే
ముందంతా!

మారని
రాజ్యాలు
యుద్ధాలు
విద్వేషాలు
మధ్య

మారుతున్న
భూమ్యాకాశాలు
ప్రభుత్వాలు
ఆరోగ్యాలు

తస్మాత్ జాగ్రత్తల
కొత్తదనమే
ముందంతా!

*****
పాఠకులందరికీ
రచయిత(త్రు)లందరికీ
సహకరిస్తున్న అందరికీ
నెచ్చెలి
నూతన
సంవత్సర
శుభాకాంక్షలు!

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

          ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణా త్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు. 

          మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.  

          వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి” వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

డిసెంబరు 2023 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు: శారద (బ్రిస్బేన్)
ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: ప్రమద-టెస్సీ థామస్ – నీలిమ వంకాయల
ఇరువురికీ అభినందనలు!

*****

Please follow and like us:

2 thoughts on “సంపాదకీయం-జనవరి, 2024”

Leave a Reply

Your email address will not be published.