Please follow and like us:
సి. సుజాత 12 డిసెంబర్ 1950లో తెనాలిలో కొంజేటి జయమ్మ, వెంకటేశ్వర్లు దంపతులకు జన్మించి, 1984 నుంచి రచనలు చేస్తున్నారు. సుప్తభుజంగాలు, రాతిపూలు నవలలు, సుజాత కథలు, రెప్పచాటు ఉప్పెన, నెరుసు కథా సంపుటాలు ప్రచురించారు. కథా కోకిల, విశిష్ట మహిళ, డాక్టర్ పరుచూరి రాజారాం, తెలుగు యూనివర్శిటీ, ప్రతిభా పురస్కరాలు అందుకున్నారు. వృత్తిరీత్యా జర్నలిస్ట్.