నీకేమనిపిస్తుంది?(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)– నర్సింహా రెడ్డి పట్లూరిపెరిగిన దూరానికిరోజురోజుకూ నీ ప్రేమ ధృవంలా కరిగిపోతే..ఒకప్పటి జ్ఞాపకాల సముద్రంఉప్పెనై మీద పడ్డట్టుంది.నీకేమనిపిస్తుంది? ఆ చెక్కిళ్ళ చెమ్మని చెరిపిన చేతులుఇప్పుడు ఎడారులైతే..ఆ స్పర్శలనే నువ్ చెరిపేస్తే..నిర్జీవమే నరాల్లో పవ్రహిస్తుంది.మరి నీకేమనిపిస్తుంది? నా నుదుట నీ తడినిఉత్తలవణ గీతమనినువ్ కొట్టిపడేస్తేతనువణువణువునూ బాణాలు తాకిన బాధ.నీకేమనిపిస్తుంది? ఇరువురి నడుమఇంకిపోని మాటల బావినిఏకపక్షంగా మూసేస్తే..ఉల్కా పాతంలా నేలబడ్డాను.మరి నీకేమనిపిస్తుంది? దూరాన్ని లెక్కచెయ్యని పాదాలు.రెండు రెళ్ళు ఒకటనుకున్నా ను.గణితాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను.నీ లెక్కలేవీ అర్థంకాకఅనంతమైన అంకెలుమీద పడ్డట్టుంది.నీకేమనిపిస్తుంది?***** Please follow and like us: నర్సింహా రెడ్డి పట్లూరిపట్లూరి నర్సింహా రెడ్డి మనూర్ , సంగారెడ్డి వాస్తవ్యులు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో పి.జి. పూర్తి చేశాను. “జత” అనే పుస్తకం 2021లో అచ్చయింది.