పాటతో ప్రయాణం-10
– రేణుక అయోల
Ek Aisa Ghar Chaahiye Mujhako – Pankaj Udhas
ఇల్లు అంటే అందమైన గదులు అలంకరణ కాదు, ఇల్లు అంటే ఒక అందమైన ఊహ , సంతోషం. ఎక్క డ కూర్చున్నా మనసు ప్రశాంతంగా వుండాలి ఎప్పుడు తిరిగి చూసు కున్నా ఇది నా ఇల్లు అందమైన పొదరిల్లు అనుకోవాలి .. పంకజ్ ఉదాస్ గజల్ వింటే ఇంత స్వేచ్చా ఒక ఇంటికి వుంటే ఎంత బాగుంటుంది అనిపించక మానదు! మరి మీరు విని నాలాగే అనుకుంటారు ..
మరేందుకు ఆలస్యం ఈ గజల్ వినేయండి…
k aisa ghar chaahiye mujhako -2 jisakee faja mastaana ho
Ek kone m
(Ee gajal kee mehfil (ek kone me maikhaana ho -2) – (3)
Aisa ghar jiske darawaaje band naa ho insaano par – (3)
Shekho pehalman rendo sharaabee (sabka aana jaana ho -2)
Ek aisa ghar chaahiye mujhako
ఒక ఇల్లు నాకు కావాలి
దాని స్వరూపమే
ఆనందానికి చిరునామాగా వుండాలి
ఒక ఇల్లు నాకు కావాలి
మానవత్వాని ద్వారాలు మూయనిది
సిఖ్ ,పెహ్ల్వానులు, మదువుని సేవించే వాళ్ళు
అందరు ఆనందంతో వచ్చి వెళ్ళే ఇల్లు కావాలి
ఒక ఇల్లు నాకు కావాలి
ద్రాక్ష పళ్ళ సింహాసనం దక్కించుకున్న ఆనందంపు మద్యహ్నంలా
వచ్చిన వాళ్ళు మళ్ళి తిరిగి వెళ్ళలేనంత ఆనందం వుండాలి
ఓ మూల గజల్ ప్రతి ధ్వనించాలి ,
సంతోషానికి పుట్టినిల్లు అవ్వాలి
అలాంటి ఇల్లు నాకు కావాలి
ఒక ఇల్లు నాకు కావాలి
నా స్వంతంమనుకుని వచ్చేవాళ్ళు
నా అతిధులు
బజారులో ఎవరికీ
ఖరీదు చెల్లించని
అవసరం వుండని ఇల్లు
ఒక ఇల్లు నాకు కావాలి
దాహంతో చెప్పడం ఎంత సులువు కదా వో జాఫర్
కాని కళ్ళతో సంజాయించడం చాలా కష్టం ….
*****