మారాల్సిన మనం
(డా.. కందేపి రాణిప్రసాద్ బాలల కథల సంపుటి పై సమీక్ష)
-వనపర్తి పద్మావతి
ప్రస్తుతం నడుస్తున్న స్పీడు యుగంలో పిల్లలకు ఎన్ని రకాల యానిమేటెడ్ వీడియోలు, కార్టూన్ షోలు అందుబాటులోకి వచ్చాయి. స్మార్ట్ ఫోన్ చేతిలో పెడ్తే కానీ అన్నం తినే చిన్నారులు ఉన్నారు. మాటలు రాని పసివాళ్ళు కూడ ఫోన్ లో పాటలు వింటూ ఆడుతున్నారు. కాని దీని వల్ల పిల్లల్లో శారీరక, మానసిక సమస్యలు ఎక్కువై నాయి. పిల్లల హాస్పిటల్ చేర్మెన్ గా ప్రతి రోజు ఎందరినో చిన్నారులను వాళ్ళ మానసిక సంఘర్షతో పాటు తల్లి దండ్రుల ఆవేధనను గమనిస్తుండడం వాళ్ళ రాణీ ప్రసాద్ గారి కాలం పిల్లల మనో వికాసానికి మేధస్సును పదును పెట్టేలా చిట్టి చిట్టి కథలోనే మానవ సంబంధాలను వాటి విలువను తెలిసేలా రాస్తూ బాలకథ రచయిత్రలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు డా.. కందేపి రాణి ప్రసాద్ గారు. “రాణీ ప్రసాద్ కథలు” లోకి వెళ్దాం.
ఇందులో మొత్తం ముప్పై కథలు వున్నాయి. ఆ నాటి రాజులు పిల్లలకు శౌర్య, దైర్య సాహసాలను నేర్పించడానికి కథలు చెప్పేవారు. అద్భుతాలను సృష్టించే బేతాళ కథలు, మాయ రాక్షసుడి కథలతో పాటు హాస్యాన్ని ఇచ్చే తెనాలి రామలింగడి కథలు పేదరాశి పెద్దమ్మ కథలు న్యాయo చేకూర్చే మర్యాద రామన్న కథలు అలనాటి పెద్దలు పిల్లలకు చెప్పేవారు. వారు ఉత్సాహంగా వింటూ కరుణ, దయ ఔదార్యం, స్నేహం వంటి ఎన్నో అంశాలు పిల్లల మెదళ్ళలోకి కథల రూపంలోని ఆయుదాలు.
నేటి సమాజంలోనూ పిల్లలను ప్రభావితం చేయుటకు నేటి సమస్యలకు పిల్లల మానసిక పరివర్తనకు ఆయుధంగా రాణీ ప్రసాద్ గారి కథలు ఉన్నాయి.
ఆవుపులి కథలో అణగారి పోతున్న మానవ సంబంధాల పై గురిపెట్టిన బాణంలా వుంది. ఆవు పులి అంటేనే శత్రుత్వము ఉన్న జంతువులు కానీ ఆవుపాలు తాగి పెరిగిన పులి కూడా మాతృత్వంను మర్చిపోలేదు.
నేటి సమాజంలోని పిల్లలకు కనువిప్పు కల్పించే కథ. కాంక్రీట్ భవనాల్లో ఖరీదైన సోఫాలు టి.వీ లే తప్ప పిల్లలకు ఆట స్థలం వుండదు. చెట్లు పెంచుకునే అవకాశం అంతకన్నా లేదు. ప్రకృతి సంపదను మానవుడు ఆహ్వానిస్తున్నాడు. అంతా భావితరాల సంతోషాన్ని కాక సహజ ప్రాణులకు హనీ కల్పిస్తూ తనను తాను హాని పర్చుకున్నాడు అని భావం ‘చిన్నూ – ఉడుత’ కథలో మనం చదవవచ్చు. “రంగునీళ్ళు” కథ సహజ పానీయాలు ఆరోగ్యానికి మంచిదని కూల్ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి హానికరమని చెప్పకనే చెప్పారు. మానవ సంబందాలన్ని ఆర్థిక బంధాలుగా మారిపోతుంటే మనుష్యు ల మధ్య తోటి వారితో అనుబంధాలు కరువౌతున్న రోజుల్లో పక్కవాడికి ఏమీ జరిగిన పట్టించుకునే వారు లేరు. ఇది సహజమైన జీవన విధానం కాదు అంటూ రాణీప్రసాద్ కలం గళం ద్వారా చెప్పారు. మనము మాత్రమే గొప్పగా ఉండాలి గొప్పపేరు రావాలి అని అనుకుంటే ‘అసూయ’ అవుతుంది. ఎవరి ప్రతిభ వారివే ఎవరి గుర్తింపు వారికే ఉంటుంది అనేది వేలిసేలా అసూయ కథను నడిపించారు. ప్రపంచీకరణ నేపద్యంలో దేశాల మధ్య సేవా వారదులు నిర్మిస్తున్నారు. వ్యాపారాలు మానవ మనుగడకు సోపానాలు అవుతున్న తరుణంలో ఒకే తల్లి పిల్లల మధ్య అడ్డు గోడలు కట్టు కోవడం అంటే ప్రేగు బంధాన్ని అవహేళన చేసినట్లే కదా! అంటారు. అడ్డు గోడ కథలో.
ఆకాశాన్ని తాకే భవనాల నిర్మాణంతో ఆకృతిలోని చెట్లు కనుమరుగై పర్యావరణము దెబ్బ తింటుంది. ఇదే విధంగా “ చెట్లను కాపాడండి” అంటూ చెడును చెడ్డవారికి పట్టుకోవడానికి పదవులు, హోదాలు కాదు మంచి మనస్సు వుంటే చాలు అనే భావం “వీధికుక్క కోరిక”, విమానాల్లో ప్రయాణం చేయటం మాత్రమే కాదు ఎందులో ప్రయాణం చేసిన పాటించాల్సిన రూల్స్ ఉంటాయి. వాటి వల్ల నష్టం జరగకుండ చూసుకోవచ్చు అనే భావం రూల్స్ పాటించాలిలోనూ మనం చూడవచ్చును. పల్లె జీవనంలోని సహజత్వం పట్నం వాసంలో వుండదు. యాంత్రిక జీవనం తప్ప జీవం వుండదు అనే భావంతో పాటు పల్లెలోని పచ్చదనంలో మూగజీవులు స్వేచ్చగా ఆహారాన్ని పొందుతాయి కానీ పట్నం వస్తే కల్తీ ఆహారంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థలను తినటం వల్ల జంతుజాలం అంతమవుతుంది అనే పరమార్థాన్ని “ పట్నం వద్దు ప్రకృతి ముద్దు” అనే కథలో చూపారు. “ అమ్మ గ్రేట్” అనే కథలో పిల్లల పెంపకంలో తల్లి పాత్ర ఎంత ఎలాంటి బుద్దులు మరియు బతుకు మార్గం ఏంటి అనేది తెలియచేశారు. సెల్ టవర్స్ వల్ల వచ్చే తరణల వల్ల పక్షి జాతి అంతరించి పోతుంది. అనే బాధకర విషయాలను “పిచ్చుక పిల్లల తప్పు “ ద్వార తెలియ చేశారు.
“పిల్ల చిలుక అబద్దం “ కథలో పిల్లల మనస్తత్వం తల్లిదండ్రుల ఆవేదన చాలా చక్కగా తెలియ చేశారు. అలా ఒక్కప్పుడు పిల్లలు పెద్దలు అందరు కలిసి ఇంటి పని వంటపని పొలం పనులు చేసేవారు కాబట్టి శ్రమ సౌందర్యం ఉండేది. కాని ఇపుడు పిల్లలకు పనులు చెప్పుకుండా జంక్ ఫుడ్ కు అలవాటు పడి ‘బద్దకంగా’ తయారు అవుతున్నారు. దాని మనస్సు కూడా చురుగ్గా లేక అనారోగ్యాల పాలు అవుతున్నారు. అనే సత్యాన్ని రాణీప్రసాద్ చక్కగా వివరించారు “మూగజీవుల సాయం “కథలో మనుష్యులైన పిల్లలకు సక్రమ అలవాట్లు నేర్పించాలి. అంతేకాక మూగ జీవుల పట్ల ప్రేమతో ఉండాలి. వాటికి అమ్మ ఉంటుంది బాధ నొప్పి కల్గుతాయి అనేది ఈ కథలోని సారంశము. తీర్థ యాత్రల సమయంలో మూగజీవుల సాయం ఎక్కువగా ఉంటుంది మరియు పొట్ట కూటి కోసం కూడా కొందరు మూగ జీవులతో ఆటలు అడిస్తుంటారు. నేటి కలికాలంలో ఎవర్ని నమ్మాలో నమ్మోద్దో తెలియని పరిస్థితులు ఉన్నాయి. కానీ మనం నిజాయితీగా ఎదుటి వారు కూడ మారి మంచివాళ్ళుగా ఉంటారు. మనుష్యుల్లోను మంచి, చెడ్డవారు ఉంటారు సమయ సందర్భాన్ని బట్టి మంచిని అంచనా వేయగలము అనేది “ అందరు చెడ్డ వారు కాదు” అనే కథనం బాగా ఉంది. “ ఎవర్ని నమ్మలేం “ అంటూనే అతి జాగ్రత్త వల్ల కూడా పిల్లలకు ప్రమాదాలు ఉంటాయి. ఏ విషయమైనా తల్లిదండ్రులుదగ్గర ఉండి అన్ని నేర్పించాలి. భయపెట్టే విషయాలను కాకుండా సమయ స్పూర్తిని అవసర మైన సమయాల్లో ఎలా ప్రదర్శించాలో కూడా చెప్పాలి అంటారు రచయిత్రి “ శాఖా హరి సింహం” కథలోకి వస్తే చివరగా మనుష్యలకైనా జంతువులకైనా శాఖాహారము ఆరోగ్యాన్ని ఇస్తుంది అన్న వాస్తవాన్ని ఈ కథ ద్వారా తెలియచేశారు. అంతేకాక అడవి జంతువులను చంపి తినడం వల్ల వాటి సంఖ్య పూర్తిగా తగ్గి పోతుంది. వాటిని కాపాడే బాధ్యత కూడా ఉంది అనే నిగూడ హితువు కూడా ఉంది. నేటి మానవ ఆలోచనలు దిగజారుడుతనాన్ని కథగా మొదలుపెట్టి సెల్ ఫోన్లు అతిగా వాడడం వల్ల వచ్చే సమస్యల్ని కథలుగా తీర్చి దిద్దిన ఘనత డా.. కందేపి రాణిప్రసాద్ గార్కే సొంతం.
రాణీ ప్రసాద్ కథలు బాలల కథల సంపుటి ప్రతి విద్యార్ధి చదవ గల్గితే మార్పు సహజం.
*****
వనపర్తి పద్మావతి ప్రముఖ రచయిత్రి – కవయిత్రి